BigTV English

iPhone 16 Series New Leaks: ఆసక్తిరేపుతున్న ఐఫోన్ 16.. దడపుట్టిస్తున్న కొత్త లీక్స్!

iPhone 16 Series New Leaks: ఆసక్తిరేపుతున్న ఐఫోన్ 16.. దడపుట్టిస్తున్న కొత్త లీక్స్!

iPhone 16 Series New Leaks: టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ 16 సిరీస్‌ను విడుదల చేయనుంది. ఐఫోన్ 16 సిరీస్‌లో రెండు బేస్ మోడల్‌లు, రెండు ప్రో మోడల్‌లు ఉంటాయి. అందులో ఐఫోన్ 16, 16 ప్లస్ ఉన్నాయి. ఇది వాటి ముందు మోడల్‌ల మాదిరిగానే ఉంటాయి. అయితే iPhone 15లో కనిపించే కెమెరా సెటప్‌కు బదులుగా వర్టికల్‌గా ఉండే డ్యూయల్ కెమెరా సెటప్‌తో రానుంది. ఇందులో ప్రస్తుతం ప్రో సిరీస్‌కే పరిమితమైన బేస్ ఐఫోన్ మోడల్‌లో 3డి వీడియో రికార్డింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. అన్ని ఫోన్‌లు యాక్షన్ బటన్‌లు, కొత్త క్యాప్చర్ బటన్‌ కలిగి ఉంటాయి. లీక్‌స్టర్ సోనీ డిక్సన్ ప్రకారం ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ కొత్త షేడ్స్‌లో వస్తాయి. అయితే ఐఫోన్ 16 ప్రో సిరీస్ కోసం ఎదురుచూస్తున్న వారు కొంచెం నిరాశ చెందవచ్చు.


ఈ రెండు మునుపటి మోడల్‌ల మాదిరిగానే అదే రంగులలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వెనుక వైపున ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఐఫోన్ 16 మోడల్‌లు USB-C పోర్ట్‌లతో వస్తాయి. గత సంవత్సరం వలె ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ టాప్ స్పీడ్‌తో డేటాను ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. అయితే బేస్ మోడల్‌లో ఇది కేవలం USB 2.0 స్టాండర్డ్ స్పీడ్‌కి రెస్టిక్ట్ చేయబడింది.

Also Read: iPhone 14 Plus Price Down: ఆఫర్ అద్భుతం.. రూ.9,648లకే ఐఫోన్ 14 ప్లస్!


ఆపిల్ iOS 18తో iPhoneలకు Apple Intelligence అనే AI ఫీచర్లను తీసుకువస్తోంది. ఇది iPhone 15 Pro సిరీస్‌కు మాత్రమే పరిమితం చేయబడుతుంది. రాబోయే ఐఫోన్ 16 సిరీస్‌తో బేస్ వేరియంట్‌లు కూడా ఆపిల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌తో వస్తాయి. మాక్‌రూమర్స్ నివేదిక ప్రకారం నాలుగు మోడల్‌లు A18 చిప్‌తో అమర్చబడి ఉంటాయి.

ఐఫోన్ 16 ప్రో సిరీస్‌పై యాపిల్ పూర్తిగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సోనీ డిక్సన్ నుండి వచ్చిన లీక్ ప్రకారం ఐఫోన్ 16 ప్రో 6.3 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.9 అంగుళాల పెద్ద స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది ఇప్పటివరకు ఏ ఐఫోన్‌లో చూడని అతిపెద్ద స్క్రీన్.

ఆపిల్ iPhone 15 Pro Maxలో 5x ఆప్టికల్ జూమ్ కెమెరాను తీసుకొచ్చింది. ఇది ఇప్పుడు iPhone 16 Pro, Phone 16 Pro Max రెండూ ఫోన్‌లలో ఉంటుంది. అదనంగా రెండు ఫోన్లు మెయిన్ కెమెరాతో సమానంగా 48 MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. సెల్ఫీ కెమెరా 12 MPతో వస్తుంది.

Also Read: Upcoming Mobiles August 2024: టైమ్ ఆగయా.. ఐదు బడ్జెట్ ఫోన్లు.. చాలా చీప్‌ రా బాబు!

ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌లను భారతదేశంలో తయారు చేస్తోంది. ఐఫోన్ 15 ప్రో మోడల్‌ను దిగుమతి చేసుకుంటోంది. మీడియా నివేదికల ప్రకారం ఆపిల్ మొత్తం ఐఫోన్ 16 సిరీస్‌ను భారతదేశంలో తయారు చేయనుంది. దీని ద్వారా రాబోయే ప్రో మోడల్‌ల ధరలు తగ్గవచ్చు ఈసారి మెరుగైన ఫోటోగ్రఫీ కోసం కొత్త ఐఫోన్ 16 సిరీస్‌లో ప్రత్యేక బటన్‌ను కూడా ఉంటుంది. ఇది ఫోటోగ్రఫీ ప్రియులకు చాలా ప్రత్యేకమైనది. ఈ బటన్ కెమెరా క్విక్ యాక్సెస్‌ను అందిస్తోంది.

Related News

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Big Stories

×