iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. దీన్ని స్టాటస్ సింబల్‌గా, సెక్యురిటీ కోసం చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. అయితే రీసెంట్గా యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. యాపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో మరింత శక్తిమంతంగా దీన్ని రూపొందించింది. అధునాతన కెమెరా కంట్రోల్ ఫీచర్‌తో పాటు కొత్త బటన్లను అమర్చింది. ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్ ఏ18తో దీన్ని విడుదల చేసింది.
అయితే ఐఫోన్‌పై ఆసక్తి ఉన్నప్పటికీ చాలా మంది ధర కారణంగానో లేదా ఇతర కారణాల వల్ల ఐఫోన్‌ను కొనుగోలు చేయలేరు. అందుకే మీకోసం ఐఫోన్‌కు ఆల్టర్నేటివ్గా, దానితో సమానంగా ఉండే టాప్ 5 ఆండ్రాయిడ్ ఫీచర్ స్మార్ట్ ఫోన్ల వివరాలను ఇక్కడికి తీసుకొచ్చాం. అవి ఐఫోన్ ధర కన్నా తక్కువకే లభిస్తున్నాయి. అలానే ఈ ఐఫోన్ 16 (రూ.79,900) ధరతో సమానంగా ఉండే ఇతర టాప్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ వివరాలను కూడా ఈ కథనం ద్వారా అందిస్తున్నాం. కాబట్టి మీరు కొనుగోలు చేయాలనుకుంటే ఈ కింద స్మార్ట్ ఫోన్లను ట్రై చేయండి.
iPhone 15 Plus – ఐఫోన్ 15 ప్లస్ 6.7 అంగుళాల పెద్ద డిస్ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. కాబట్టి మీరు పెద్ద డిస్ ప్లే ఉన్న స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఇది రూ.65 వేలకే ప్రముఖ ఇ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ఫ్లిప్ కార్ట్, అమెజాన్‌లో దొరుకుతుంది. ఈ ఐఫోన్ 15కు డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. ఐఫోన్ 16కు ఉన్నట్టే దీనికి 48 మెగా పిక్సల్ వైడ్, 12 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి.
Google Pixel 9 – గూగుల్ పిక్సల్ 9 ఐఓఎస్‌కు కాస్త దగ్గరగా ఉంటుంది. అండ్రాయిడ్‌లో ఈ స్మార్ట్ ఫోన్ బెస్ట్. ఒకవేళ మీరు ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు మారాలనుకున్నా పెద్దగా తేడా అనిపించదు. ఫీచర్స్‌తో పాటు చేతిలో పట్టుకునేందుకు కంఫర్ట్‌గానే ఉంటుంది. ఈ గూగుల్ పిక్సల్ 9లో సాఫ్ట్ వేర్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఏడేళ్ల వరకు ఓఎస్ అప్‌గ్రేడ్స్‌ను ఇస్తుంది. ఐఫోన్ 15 (6.1 అంగుళాల డిస్ ప్లే) కన్నా పెద్ద డిస్ ప్లేతో ఉంటుంది. 6.3 అంగుళాల డిస్ ప్లే ప్యానల్‌ను కలిగి ఉంది. ఎక్కువ పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు 120Hzను సపోర్ట్ చేస్తుంది. అలానే ఇది వింటర్ గ్రీన్, పియోనీ, పోర్సలైన్, ఒబ్సిడియన్ వంటి రంగుల్లో అందుబాటులో ఉంది. బేస్ మోడలే 256 జీబీ స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంది. దీని ధర ఐఫోన్ 16తో సమానంగా ఉంది. ఇది రూ.79,900కు దొరుకుతుంది.
Oppo Find X8 – ఈ ఒప్పో ఫైండ్ X8లో చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఐఫోన్ 16కు బదులుగా ఇది బెస్ట్ ఛాయిస్. ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 6.59 అంగుళాల అమోలెడ్ ప్యానెల్ డిస్ ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, పీక్ బ్రైట్నెస్ 4500 నిట్స్‌తో వచ్చింది. ఇండియాలో మీడియా టెక్ డైమన్సిటీ 9400 చిప్సెట్తో వచ్చిన తొలి స్మార్ట్ ఫోన్ ఇదే.
అలానే ఈ స్మార్ట్ ఫోన్ 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ బేస్ మోడల్ ధర రూ.69,999. ఇంకా ఇందులో ఏఐ క్లారిటీ, ఏఐ రిఫ్లెక్షన్ రిమూవల్, ఏఐ అన్ బ్లర్, ఏఐ మ్యాజిక్ ఎడిటర్ వంటి ఏఐ ఫీచర్లు ఉన్నాయి.
Samsung Galaxy S24 Plus – ఈ శాంసంగ్ S24 Plus బెస్ట్ అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్. అస్సలు ఎక్కడ కాంప్రమైజ్ కానక్కర్లేదు. ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తూ 6.7 అంగుళాల డిస్ ప్లే, అమెలెడ్ ప్యానెల్‌తో వచ్చింది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ గూగుల్ సర్కిల్, ఇన్స్టంట్ స్లో మోషన్, లైవ్ ట్రాన్స్‌లేట్, ఫొటో అసిస్ట్ వంటి ఫీచర్స్‌ను సపోర్ట్ చేస్తుంది. శాంసంగ్ ఇండియా వెబ్ సైట్లో దీని ధర రూ.79,999గా ఉంది. 256 జీబీ, 8 జీబీ ఆన్‌బోర్డ్ మెమరీని సపోర్ట్ చేస్తుంది. 128 జీబీ ఫోన్ అయితే రూ.5 వేలు తక్కువకే పొందొచ్చు. అంటే రూ.74,999కు దొరుకుతుంది. ఐఫోన్ 16తో పోలిస్తే పెద్ద డిస్ ప్లే ఉంటుంది. బెస్ట్ కెమెరా కూడా ఉంటుంది.
Xiaomi 14 – ఇప్పటికే షియోమీ 15 సిరీస్ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే చైనాలో విడుదలైపోయింది. ఇండియాలో త్వరలో రానుంది. అయితే షియోమీ 14కు అమెజాన్‌లో మంచి డిస్కౌంట్‌తో లభిస్తోంది. మీరు దీనిని రూ.49,999కే పొందవచ్చు. లికాకు చెందిన 50 మెగా పిక్సల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 6.4 అంగుళాల అమోలెడ్ ప్యానల్ డిస్ ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ స్క్రీన్ మరీ పెద్దగా కాదు, మరీ చిన్నదిగా కాకుండా సరిగ్గా ఉంటుంది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్‌లో 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కూడా ఉంది. స్మాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3తో పనిచేస్తుంది. సో చూశారుగా ఐఫోన్ 16కు బదులుగా, దానికి దాదాపుగా సమానంగా ఫీచర్స్ ఉండే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో వీటిని కొనుగోలు చేయొచ్చు.
ALSO READ : బిట్ కాయిన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్.. ఇందులో పెట్టుబడి పెట్టారా మీ డబ్బులు గోవిందా?