BigTV English

Ariyana Glory : ఆర్జీవిని బ్లాక్ చేసిన హాట్ బ్యూటీ.. ఆ ఒక్కటి అడగొద్దు..?

Ariyana Glory : ఆర్జీవిని బ్లాక్ చేసిన హాట్ బ్యూటీ.. ఆ ఒక్కటి అడగొద్దు..?

Ariyana Glory : బిగ్ బాస్ హాట్ బ్యూటీ అరియనా గ్లోరీ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు.. యూట్యూబ్ ద్వారా బాగా పాపులర్ అయిన ఈ అమ్మడు ఆ క్రేజ్ తో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది. అక్కడ తన మాట, ఆటతో బాగా ఫెమస్ అయ్యింది. బిగ్ బాస్ లో ఆమె ఫైర్ ను చూసి విన్నర్ అవుతుంది అనుకున్నారు. కానీ రన్నర్ గా కూడా మిగల్లేదు. అయినా హీరోయిన్ కన్నా ఎక్కువగా పాపులారిటిని సొంతం చేసుకుంది. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఈమె బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ లు చేస్తూ వచ్చింది. అలాగే స్టార్ మా లో ప్రసారం అయిన బీబీ జోడి అనే షోలో డ్యాన్స్ అదరగొట్టింది.. ఆర్జీవికి ఈమెకు ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయన ఇంటర్వ్యూ తోనే ఇంత పేరు వచ్చిందని తెలిసిందే. తాజాగా వీరిద్దరి మధ్య ఎదో పెద్ద గొడవ జరిగిందని తెలుస్తుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. అసలు వీరిద్దరి మధ్య నిజంగానే గొడవ జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది.


అసలు విషయానికొస్తే.. రామ్ గోపాల్ వర్మకు అత్యంత సన్నిహితురాలుగా మెలిగిన ఈ బ్యూటీ ఆరియానా గురించి చెప్పాలంటే ఒకానొకప్పుడు ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి హైలైట్ అయ్యింది. అలాగే ఆర్జీవీ బ్యూటీగా ముద్ర పడింది. అలాంటి లైఫ్ ఇచ్చిన ఆర్జీవీ నంబర్ ని బ్లాక్ చేశానంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అసలు ఏమైంది అనేది చెప్పలేదు కానీ బ్లాక్ చేసానని చెప్పడం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొత్తగా విడుదల అవుతున్న మూవీస్ కి సంబంధించిన సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసే దావత్ అనే షోలో ఆరియానా ఈ కామెంట్స్ చేసింది. ఈ షోకి జబర్దస్త్ రాకేష్, సుజాత కలిసి వాళ్ళ ‘కేసీఆర్’ మూవీ ప్రమోషన్ కోసం ఈ కార్యక్రమానికి వచ్చారు. వచ్చాక రాకేష్ ఆరియానని ఇలా అడిగాడు ఆయనతో చెప్పి ఒక్క ట్వీట్ చేయించు అని అడిగాడు. దానికి అరియనా మాట మాట్లాడకుండా ఆయనకు టచ్ లో లేను అని చెప్పింది.

నిజంగానే నేను అసలు ఆయనతో టచ్ లోనే లేను అని చెప్పింది. జిమ్ చేసేటప్పుడన్నా చెప్పు అరియనా అని సుజాత కూడా అడిగేసరికి మీరు నమ్మతారా ఆరు నెలల క్రితమే ఏడాది క్రితమో నాకు ఆర్జీవీ గారికి చిన్న డిస్టర్బెన్స్ వచ్చి ఆయన నంబర్ ని బ్లాక్ చేసేసానని చెప్పింది. దానికి రాకేష్ నువ్వు బ్లాక్ చేసావా.. ఆయనే ప్రపంచాన్ని బ్లాక్ చేస్తాడు కదా అని సెటైర్ వేసాడు. ఇక ఈ షో ద్వారా ఆర్జీవీకి ఒక కోరిక కోరింది.. మీకు కెసిఆర్ మూవీ గురించి తెలిస్తే మీరు కూడా ప్రమోట్ చేయండి ప్లీస్ అని చెప్పింది. అంతేకాదు నేను మీ నంబర్ ను బ్లాక్ చేస్తాను మీరు కూడా నన్ను అన్ బ్లాక్ చెయ్యండని రిక్వెస్ట్ చేస్తాను. మీతో మాట్లాడాలని ఉందని అడిగింది. మరి వీరిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? లేదా ఇంకేదైనా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.


Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×