108MP Camera Smart Phones Under Rs 20,000: ప్రస్తుతం మార్కెట్‌లో అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్లు దర్శనమిస్తున్నాయి. కెమెరా పరంగా కూడా అదరగొడుతున్నాయి. ఏఐ లెన్స్‌లతో మార్కెట్‌లోకి దిగుతున్న కొత్త ఫోన్‌ను కొనుక్కుంటే ఎలాంటి కెమెరా కూడా అవసరం ఉండదు. అలాంటి కెమెరా ఫోన్లు వస్తున్నాయి. అందువల్ల చాలామంది ఫోన్ ప్రియులు మంచి ఫీచర్లు, కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను చాలా తక్కువ ధరలో కొనుక్కోవాలని అనుకుంటారు. కానీ అధిక ధర కారణంగా తమ ప్లాన్‌ను మార్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు మార్కెట్‌లో 108 మెగా పిక్సెల్ కలిగిన ది బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకుందాం.
Xiaomi Redmi Note 13 5G
Xiaomi Redmi Note 13 5జీ మొబైల్ 6.67-అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లేని కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13లో నడుస్తుంది కానీ ఆండ్రాయిడ్ 14ని అందుకుంటుంది. 108MP ట్రిపుల్-రియర్ కెమెరా సిస్టమ్, 16MP సెల్ఫీ స్నాపర్‌ని కలిగి ఉంది. దీని ధర విషయానికొస్తే ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 16,999గా ఉంది.
OnePlus Nord CE 3 Lite 5G
OnePlus Nord CE 3 Lite 5G 6.72-అంగుళాల 120Hz IPS LCD, 108MP ట్రిపుల్ కెమెరాలు, స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్, 67w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13లో నడుస్తుంది కానీ ఆండ్రాయిడ్ 14కి అప్‌గ్రేడ్ చేయబడుతుంది. ధర విషయానికొస్తే.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17,200కి లభిస్తుంది.
Also Read: వచ్చే వారం లాంచ్ అయ్యే కిల్లర్ మొబైల్స్ ఇవే.. ఏ బ్రాండ్ ఫోన్ తీసుకోవాలంటే..?
Poco X6 Neo 5G
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో Poco X6 Neo 5G 6.67-అంగుళాల 120Hz AMOLED డిస్ప్లే, 108MP డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌తో ఆధారితమైనది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13లో బూట్ అవుతుంది. దీని ధర రూ.14,999గా ఉంది.
Tecno Pova 6 Pro 5G
Tecno Pova 6 Pro 5G స్మార్ట్‌ఫోన్ 108MP డ్యూయల్-రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. 32MP సెల్ఫీ స్నాపర్‌తో వస్తుంది. 6.78-అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లే, డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌తో 70W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 19,999కి కొనుక్కోవచ్చు.
Also Read: 10 వేల లోపే బ్రాండెడ్ 5G స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు చూస్తే షాకవుతారు
Infinix Note 40 Pro 5G
Infinix Note 40 Pro 5G స్మార్ట్‌ఫోన్ 108MP ట్రిపుల్-రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. అలాగే ఫోన్ ముందు భాగంలో 32MP సెల్ఫీ స్నాపర్‌ను అమర్చారు. ఇది 6.78-అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లే, డైమెన్సిటీ 7020 చిప్‌సెట్, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో రూ.21,999 ధరకి కొనుక్కోవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు ట్రాన్షక్షన్‌పై రూ.1000 వరకు తగ్గింపు ఉంటుంది. అప్పుడు ఇది రూ.20,999లకే వస్తుంది. అయితే దీనికోసం ఓ రూ.999 ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
Realme 12 5G
Realme 12 5G స్మార్ట్‌ఫోన్ 108MP డ్యూయల్-రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. అలాగే 8MP సెల్ఫీ స్నాపర్‌ను కలిగి ఉంది. ఇది 6.72-అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లే, డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. దీని ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.16,999గా కంపెనీ నిర్ణయించింది.
Itel S24
Itel S24 4G ఫోన్ 6.6-అంగుళాల 90Hz LCD డిస్ప్లే, 108MP డ్యూయల్ కెమెరాలు, MediaTek Helio G91 అల్ట్రా చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ.10,999గా ఉంది.