Lost Phone Track Tips : ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ అవసరం ఎంత ఉందో దాని పోగొట్టుకునే అవకాశాలు కూడా అంతే ఉన్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఫోన్ దొంగల చేతికి చిక్కటం తప్పనిసరి. అయితే అనుకోని పరిస్థితుల్లో మొబైల్ పోయినప్పటికీ తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయని తెలిసిందే. అయితే ఫోన్ స్విచాఫ్ చేసినా అందులో నుంచి సిమ్ తీసేసినా కాసేపు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. మరి పరిస్థితి ఏదైనాప్పటికీ ఫోను తిరిగి పొందాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఓసారి చూద్దాం.
స్మార్ట్ ఫోన్ పోయిందా.. అసలు కంగారు పడకండి. ముందుగానే ఫోన్లో కొన్ని సెట్టింగ్స్ మార్చేసుకుంటే ఫోన్ దొంగల చేతికి చిక్కినప్పటికీ ఎలాంటి సమస్య ఉండదు. ముఖ్యంగా ఫోన్ దొంగలించిన వాళ్లు వెంటనే ఫోన్లో సిమ్ తీసేయడం, స్విచ్ ఆఫ్ చేయడం చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఫోన్ ను ట్రాక్ చేయడం ఇబ్బందికరంగా మారుతుంది. అయితే సెట్టింగ్స్ లో కొన్ని ముందుగానే మార్చుకోవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే అవకాశం ఉండదు. సిమ్ తీసేసినా సిగ్నల్ ట్రాక్ అవుతూ ఉండటం వల్ల తిరిగి ఫోన్ రాబట్టుకునే అవకాశం ఉంటుంది.
స్విచ్ఛాఫ్ కాకూడదంటే –
మొబైల్ సెక్యూరిటీ విషయంలో ఫోన్ పోగొట్టుకున్నా తిరిగి పొందాలంటే ముందుగా సెట్టింగ్స్ లోకి వెళ్లి సెక్యూరిటీ అండ్ ప్రైవసీ (Security and privacy) ను క్లిక్ చేయాలి. More Secrity And Privacy Option పైన క్లిక్ చేయాలి. Require Password To Power Off పైన క్లిక్ చేయాలి. ఈ ఆఫ్షన్ తో పాస్ వర్డ్ లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వదు. దీంతో ఫోన్ పోయినప్పటకీ దొంగలు స్విచ్ఛాఫ్ చేయలేరు.
సిమ్ లేకపోయినా సిగ్నల్ ట్రేస్ అవ్వాలంటే –
ఇక ఫోన్ లో నుంచి సిమ్ తీసేసినప్పటికీ సిగ్నల్ ట్రేస్ అవ్వాలంటే కాస్త కష్టమైన పనే. అయితే లేటెస్ట్ గా స్మార్ట్ ఫోన్స్ లో వచ్చిన అప్డేట్స్ తో మొబైల్ సిమ్ లేకపోయినా ట్రేస్ అవుతుంది. ఈ అప్డేట్ ను ఎలా ఎనేబుల్ చేయాలంటే.. Device Finders ను క్లిక్ చేయాలి. Find Your Offline Devices ను క్లిక్ చేయాలి. Without Net Work ను క్లిక్ చేయాలి. దీంతో ఫోన్ లో సిమ్ లేకపోయినప్పటికీ సిగ్నల్ ఉంటుంది. ఫోన్ పోగొట్టుకున్న సమయంలో ఈజీగా ట్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది.
మెుబైల్స్ లో ఈ ఆఫ్షన్స్ ను ఛేంజ్ చేసుకుంటే చాలు.. ఇకపై ఫోన్ పొగొట్టుకున్నా కంగారుపడాల్సిన అవసరం ఉండదు. తేలికగా ట్రేస్ చేసి పొగొట్టుకున్న మెుబైల్ ను తిరిగి పొందవచ్చు. ఇక దీంతో పాటు మొబైల్స్ లో ఎప్పటికప్పుడు వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ను ఛేంజ్ చేసుకోవడమే కాకుండా రీస్టార్ట్ చేస్తూ ఉండటం వల్ల ఫోన్లో ఉండే సున్నితమైన డేటా కాపాడుకోవడమే కాకుండా ఫోన్ ను సైతం సేఫ్ గా ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఇక ఇంకెందుకు ఆలస్యం ఈ సెట్టింగ్స్ మీరు కూడా మార్చేసుకోండి. ఫోన్ ను సేవ్ చేసేసుకోండి.
ALSO READ : మెుబైల్ రీస్టార్ట్ తో లాభామా.. నష్టమా! ఐఫోన్ Vs ఆండ్రాయిడ్‌లో పాటించాల్సిన టిప్స్ ఏంటి!