Good News For Telangana women: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఏడాది పాలనలో అనేక పథకాలను, హామీలను నెరవేర్చిన ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళుతోంది. ముఖ్యంగా మహిళల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ పథకంతో ఎంతో మందికి ఆసరాగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఏడాది పాలన పూర్తి చేసుకోబోతున్న తరుణంలో మహిళలకు సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది.
Also read: శ్రీరెడ్డి, బోరుగడ్డ ఎవరో తెలీదు, గుడివాడ అమర్నాథ్ హాట్ కామెంట్స్
బ్యాంకుల నుండి మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకున్న వడ్డీ లేని రుణాలకు ప్రభుత్వం మిత్తి డబ్బులు విడుదల చేసింది. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి మొత్తం రూ.30.70 కోట్లను విడుదల చేసింది. త్వరలోనే డబ్బులు మహిళా సంఘాల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ మొత్తంలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5,283 సంఘాలకు రూ.1.99 కోట్లు వెళ్లనున్నాయి. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో 50,10 గ్రూపులు ఉండగా రూ.1.91 కోట్లు వారి ఖాతాల్లోకి వెళ్లనున్నాయి. ఖమ్మంలో 3,983 సంఘాలు ఉండగా రూ.1.66 కోట్లు జమ చేయనున్నారు. కరీంనగర్ జిల్లాలో 3,983 గ్రూపులు ఉండగా రూ.1.55 కోట్లు ఆ సంఘాల ఖాతాల లోకి చేరనున్నాయి.
మిగిలిన డబ్బులు ఇతర జిల్లాల మహిళా సంఘాల ఖాతాల్లోకి చేరనున్నాయి. దీంతో మహిళలకు ఎంతో లబ్ది చేకూరనుంది. డ్వాక్రా సహా ఇతర సహాయక సంఘాల మహిళలకు మేలు జరగనుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏళ్లుగా మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకున్న వడ్డీలేని రుణాలకు మిత్తి డబ్బులు ఇవ్వలేదు. దీంతో మహిళలు కొత్త రుణాలు తీసుకునేందుకు బ్యాంకులు ఇబ్బంది పెడుతున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ముందు మిత్తి డబ్బులు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.