Mobile Restart : మొబైల్ రీస్టార్ట్.. ఆండ్రాయిడ్ అయినా ఐఫోన్ అయినా మొబైల్ ను రీస్టార్ట్ చేయడం తప్పనిసరి. నిజానికి ఈ రీస్టార్ట్ వల్ల ఫోన్ ను అన్ని విధాలా కాపాడే అవకాశం ఉంటుంది. ఫోన్లో ఉండే సున్నితమైన డేటా హ్యాక్ కాకుండా ఉంటుందని తెలిసిందే అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ తరచూ ఫోన్ ని రీస్టార్ట్ చేయటం తప్పనిసరని హెచ్చరించింది.
ఎంత హైసెక్యూరిటీ ఫోన్ అయినా కచ్చితంగా రీస్టార్ట్ చేయాల్సిందే. ఫోన్ రీస్టార్ట్ చేయకపోతే అన్ని విధాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఫోన్ హ్యాంగ్ అయినప్పుడు, లేదా యాప్స్ సరిగ్గా రన్ కానప్పుడు, సాఫ్ట్‌వేర్ లోపాలు ఉన్నప్పుడు రీస్టార్ట్ చేస్తాం. దీంతో సమస్య తీరుపోతుంది. అయితే ఫోన్ లో అప్డేట్స్ తో పాటు రీస్టార్ట్ తప్పనిసరని ఇప్పటికే నిరూపితమైనప్పటికీ తాజాగా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఫోన్ రీస్టార్ట్ చేయడం తప్పనిసరని తెలుపుతూ పలు హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈ నేపథ్యంలో ఫోన్ ను రీస్టార్ట్ చేయడం వల్ల ఏ ఏ ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.
సైబర్ క్రైమ్స్ కు అడ్డుకట్ట – స్మార్ట్ గాడ్జెట్స్ వాడుతున్న ప్రతీ ఒక్కరినీ భయపెట్టే విషయం సైబర్ క్రైమ్. ఏ చిన్న అవకాశం దొరికినా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫోన్లో ఉండే సున్నితమైన డేటాను హ్యాక్ చేయడం లేదా ఆ డేటా సహాయంతో డబ్బులు వసూలు చేయటం, మభ్యపెట్టి డబ్బులు తీసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి సైబర్ దాడులు జరగకుండా ఉండాలంటే కచ్చితంగా ఫోన్ ను రీస్టార్ట్ చేయాలని నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. రీస్టార్ట్ తో ఫోన్లో ఉండే సున్నితమైన డేటా హ్యాక్ కాకుండా ఉంటుందని తెలిపింది.
రీస్టార్ట్ చేసిన మొబైల్స్ లో సైబర్ అటాక్స్ జరిగినప్పుడు మొబైల్ రిమోట్ యాక్సెస్ ని పొంది జీరో క్లిక్ ఎక్స్ప్లోయిట్స్ వంటివి జరగకుండా ఉంటాయని తెలిపింది. దీనివల్ల హ్యాకర్స్ మొబైల్ నుంచి ఇన్ఫర్మేషన్ ని దొంగలించడం కష్టతరం అవుతుందని చెప్పుకొచ్చింది.
స్మార్ట్ ఫోన్ స్లో అవ్వదు – రీస్టార్ట్ చేసే మొబైల్స్ లో మెమోరీతో పాటు బ్యాగ్రౌండ్ లో రన్ అయ్యే యాప్స్ క్లియర్ అయిపోతాయి. దీని వలన మొబైల్ స్లో అయ్యే అవకాశం తగ్గిపోయి స్పీడ్ గా పని చేస్తుంది. కొత్త మెుబైల్ లో ఉన్నట్లే స్పీడ్ ప్రాసెస్ ఉంటుంది.
ఎక్కువ బ్యాటరీ లైఫ్ – తరచూ రీస్టార్ట్ చేస్తున్న మొబైల్స్ లో బ్యాటరీ లైఫ్ సైతం ఎక్కువ కాలం ఉంటుందని తెలుస్తుంది.
వారానికి ఒకసారి తప్పనిసరి – కనీసం వారానికి ఒక్కసారైనా ఫోన్ ను రీస్టార్ట్ చేయాలని.. దీని వల్ల ఎదురయ్యే పలు రకాల సమస్యలను తప్పించుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. అయితే ఫోన్ ను రీస్టార్ట్ చేసే సమయంలో మాత్రం సేవ్ చేయని డేటా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఒక్కసారిగా డేటా మొత్తం గల్లంతయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఐఫోన్ లో రీస్టార్ట్ సమయంలో ఫ్యాక్టరీ రీసెట్ ను క్లిక్ చేస్తే సేవ్ చేయని డేటా మెుత్తం పోతుంది.
ALSO READ : ఓలాకు ఝలక్