E-Paper
Advertisement

Elon Musk Iran: ట్రంప్ కోసం అప్పుడే డ్యూటీ ప్రారంభించిన ఎలన్ మస్క్.. ఇరాన్ అంబాసిడర్‌తో చర్చలు

Elon Musk Iran: ట్రంప్ కోసం అప్పుడే డ్యూటీ ప్రారంభించిన ఎలన్ మస్క్.. ఇరాన్ అంబాసిడర్‌తో చర్చలు
Advertisement

Elon Musk Meets Iran Ambassador : అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సన్నిహితుడైన బిలియనీర్ బిజినెస్‌మెన్ ఎలన్ మస్క్ ఇరాన్‌తో అమెరికా సంబంధాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇరాన్ – ఐక్యరాజ్యసమితి అంబాసిడర్ అమిర్ సయీద్ ఇరావాణితో ఎలన్ మస్క్ చర్చలు జరిపారని ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక గురువారం నవంబర్ 14 2024న కథనం ప్రచురించింది.

ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఎలన్ మస్క్, ఇరాన్ ఐరాస్ అంబాసిడర్ అమిర్ సయీద్ ఇద్దరూ సోమవారం నవంబర్ 11న రహస్యంగా సమావేశమయ్యారు. ఇద్దరూ గంటకు పైగా చర్చలు జరిపినట్లు ఇరాన్ వర్గాల ద్వారా తెలిసినట్లు న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్. అయితే మస్క్ జరిపిన చర్చల గురించి ట్రంప్ వర్గం కానీ ఇరాన్ ఐక్యరాజ్య సమితి మిషన్ కానీ అధికారికంగా ధృవీకరించలేదు.

Advertisement

అయితే ఈ చర్చల గురించి ట్రంప్ వర్గం త్వరలోనే బహిరంగ ప్రకటన చేసే అవకాశం ఉంది. అదే జరిగితే.. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లు యుద్దాలు ఆపే దిశగా అడుగులు వేసినట్లు అవుతుంది. కానీ ఇరాన్ తో స్నేహం చేస్తే.. అందుకు ఇజ్రాయెల్ ఎంతవరకు అంగీకారం తెలుపుతుందనేది అనుమాస్పదంగా మారింది.

Also Read: కరిగిపోయిన ట్రంప్ ఆస్తి.. ఒక్కరోజులో 300 మిలియన్ డాలర్లు నష్టం!

Advertisement

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తరువాత నుంచి ప్రపంచ దేశాల నాయకులతో సంప్రదిస్తున్నారు. అయితే ట్రంప్ చేసే సంప్రదింపుల్లో ఎలన్ మస్క్ కూడా పాల్గొనడం విశేషంగా మారింది.

అయితే ట్రంప్ ఇంతకుముందు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాన్ తో అమెరికా సంబంధాలను తెంచుకున్నారు. ఆయన కంటే ముందు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా ఇరాన్ తో చేసుకున్న న్యూక్లియర్ డీల్ ని ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ డీల్ ని రద్దు చేశారు. పైగా ఇరాన్ పై ఆంక్షలు విధించారు. ఇతర దేశాలను కూడా ఇరాన్ వద్ద నుంచి చమురు కొనుగోలు చేయకూడదని ఒత్తిడి చేశారు.

కానీ ఇదంతా గతం. అప్పటిలా ట్రంప్ ఇప్పుడు లేరని సంకేతాలు పంపిస్తూ.. ఇరాన్ తో చర్చలు ప్రారంభించారు. మరోవైపు ఇజ్రాయెల్‌కు మద్దతు కూడా ఇస్తామని ఎన్నికల ప్రచారంలో అన్నారు. గాజా, లెబనాన్, ఇరాన్ తో ఏకకాలంలో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ని ఆపేదిశగా ఆయన కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఇరాన్ కొత్త ప్రెసిడెంట్ మసూద్ పెజేష్కియన్ కూడా గురువారం ఐరాస్ అధికారులతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగామ్ శాంతి కోసం మాత్రమే ఉపయోగిస్తామని ఆయన హామి ఇచ్చారని సమాచారం.

Also Read: మూడోసారి కూడా ప్రెసిడెంట్‌ కావొచ్చేమో?.. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఎలన్ మస్క్, ఇరాన్ – ఐరాస అంబాసిడర్ తో జరిగిన చర్చల్లో ఇరాన్ పై అమెరికా విధించిన ఆంక్షలను తొలగించాలని ఇరాన్ అంబాసిడర్ కోరారని ఇరాన్ విదేశాంగ మంత్రి తెలిపారు.. అమెరికా, ఇరాన్ మధ్య వ్యాపారం తిరిగి ప్రారంభించేందుకు మస్క్ కృషి చేస్తారనే నమ్మకం తమకు ఉందని అన్నారు.

అమెరికా విదేశాంగ విధానాలతో పాటు పరిపాలనలో కూడా ఎలన్ మస్క్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×