BigTV English

Ulefone Armor 27T Pro: దీన్ని ఢీ కొట్టినోడే లేడు.. 10600mAh బ్యాటరీ, 24GB ర్యామ్‌తో కొత్త ఫోన్ లాంచ్.. ధర తక్కువే..!

Ulefone Armor 27T Pro: దీన్ని ఢీ కొట్టినోడే లేడు.. 10600mAh బ్యాటరీ, 24GB ర్యామ్‌తో కొత్త ఫోన్ లాంచ్.. ధర తక్కువే..!

Armor 27T Pro Launched: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనే ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఒక మంచి కెమెరా క్వాలిటీ, అలాగే అధిక సామర్థ్యం గల బ్యాటరీ ఫోన్‌ను కొనుక్కోవాలని అనుకుంటారు. అంతేకాకుండా మంచి స్పీడ్‌ ఉన్న ఫోన్‌ కోసం తెగ వెతికేస్తుంటారు. కానీ అలాంటి ఫోన్లు వారికి దొరకవు. దీంతో ఏదో ఒకటి కొనుక్కుందాంలే అని ఒక నిర్ణయానికి వస్తుంటారు. అయితే ఇప్పుడు అలాంటి అవసరం లేదు. ఎందుకంటే మీ టేస్ట్‌కి తగ్గట్టుగానే తాజాగా ఒక ఫోన్ లాంచ్ అయింది. దాని బ్యాటరీ, కెమెరా క్వాలిటీ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే. మరి ఆ ఫోన్ ఏంటి.. దాని స్పెసిఫికేషన్లేంటి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం.


ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ Ulefone తాజాగా ఆర్మర్ 27T ప్రో (Armor 27T Pro)ని విడుదల చేసింది. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 6300 5G చిప్‌సెట్ ఉంది. దీని బ్యాటరీ కూడా చాలా పెద్దది. ఇది దాదాపు 10600mAh బ్యాటరీని కలిగి ఉంది. అంతేకాదండోయ్ ఈ ఫోన్ 24GB RAM వరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ ఫోన్ థర్మల్ ఇమేజింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో తమకు సపోర్ట్ చేసే ఫోన్ కావాలనుకునే వారికి ఇది ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక దీని ధర, ఫీచర్ల విషయానికొస్తే..

Ulefone Armor 27T Pro Price


Ulefone Armor 27T Pro ఫోన్ ధర విషయానికొస్తే.. ఇది $269.99గా ఉంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం.. సుమారు రూ. 22,600 అన్నమాట. కాగా ఈ ఫోన్ రెండు వేరియంట్లలో వస్తుంది. అందులో ఒకటి FLIR థర్మల్ కెమెరాని కలిగి ఉంటుంది. అదే సమయంలో దాని ఆల్టర్‌నేటివ్ వేరియంట్‌లో 50MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఈ రెండు మోడళ్ల సేల్స్ ఆగస్టు 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ Aliexpressలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

Also Read: కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్లు.. ఒప్పో నుంచి ఫైండ్ ఎక్స్8, ఎక్స్ 8 ప్రో లాంచ్‌కు సిద్ధం.. ఫీచర్లు హైలైట్..!

Ulefone Armor 27T Pro Specifications

Ulefone Armor 27T Pro ఫోన్‌లో FLIR థర్మల్ కెమెరాతో వస్తుంది. ప్రొఫిషనల్లీ అండ్ పర్సనల్లీ యూజింగ్‌కి ఈ బెస్ట్ కెమెరా ఫోన్ ఉత్తమమైనదని కంపెనీ పేర్కొంది. ఇది కాకుండా ఫోన్‌లో సెకండరీ సెన్సార్‌గా 64MP OMNIVISION OV64B సెన్సార్ అందించబడింది. విశేషమేమిటంటే ఈ ఫోన్ రాత్రిపూట లేదా చీకటిలో అద్భుతంగా ఫోటోలను క్యాప్చర్ చేయగలదు. కాగా Armor 27T Pro ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G చిప్‌సెట్ అందించబడింది.

అంతేకాకుండా ఇది 24GB వరకు RAM మద్దతును కలిగి ఉంది. ఈ ఫోన్ ముఖ్యంగా దాని బ్యాటరీ సామర్థ్యం కారణంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ఫోన్‌లో దాదాపు 10600mAh బ్యాటరీ ఉంది. ఇది సాధారణంగా మార్కెట్‌లో లభించే స్మార్ట్‌ఫోన్‌ల కంటే రెండింతలు ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాదు 120W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్, 33W డాక్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంది. ఈ ఫోన్‌కి చాలా ధృడమైన బాడీని అందించారు.

ఫోన్ IP68/IP69K రేటింగ్, MIL-STD-810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. అందువల్ల ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెంట్ మాత్రమే కాదు.. హై ప్రెజర్ జెట్‌లను, విపరీతమైన టెంపరేచర్లను కూడా తట్టుకోగలదు. అలాగే దీని బ్యాటరీ మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ నుండి 55 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలలో పని చేస్తుంది. అందువల్ల ఒక మంచి ఫోన్ కోసం చూస్తున్నవారికి ఇది బెస్ట్‌గా చెప్పుకోవచ్చు.

Related News

Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

GPT-5 Backlash: జిపిటి-5 వద్దు రా బాబు.. చాట్ జిపిటి కొత్త వెర్షన్‌పై యూజర్ల అసంతృప్తి

Vivo Y400 vs iQOO Z10R vs OnePlus Nord CE 5: రూ.25,000 లోపు బడ్జెట్ లో ఏది బెస్ట్?

iPhone 17 Pro GPT-5: ఐఫోన్ 17 ప్రోలో చాట్ జిపిటి-5.. ఆపిల్ సంచలన ప్రకటన

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Big Stories

×