BigTV English

WI vs SA 2nd Test Highlights: వెస్టిండీస్ తో టెస్ట్ మ్యాచ్.. దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డ్

WI vs SA 2nd Test Highlights: వెస్టిండీస్ తో టెస్ట్ మ్యాచ్.. దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డ్

South Africa Sets World Record with Victory Over West Indies: వెస్టిండీస్ జట్టు.. 1970 దశకంలో ప్రపంచ క్రికెట్ ను వణికించింది.  ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవాలంటే పేరెన్నికగన్న బ్యాటర్లు వణికిపోయేవారు. అంతేకాదు అప్పట్లో ఇన్ని సేఫ్టీ ప్యాడ్స్ కూడా బ్యాటర్లకు ఉండేవి కావు. అలాంటి సమయంలో వెస్టిండీస్ జట్టులో అరవీర భయంకరమైన ఫాస్ట్ బౌలర్లు ఉండేవారు. ఇకపోతే 1975, 1979 రెండు సార్లు వరుసగా వెస్టిండీస్ ప్రపంచకప్ గెలిచింది.


అంతే, ఆ సమయంలో కుదిరిన బలమైన జట్టు మళ్లీ సెట్ కాలేదు. అడపదడపా ఒకొక్కరుగా మెరిశారు. ఫాస్ట్ బౌలర్లలో వాల్ష్,  ఆంబ్రోస్, ప్యాటర్ సన్ లాంటి వాళ్లు వచ్చారు. బ్యాటర్లుగా బ్రియాన్ లారా, క్రిస్ గేల్, చంద్రపాల్, రిచీ రిచర్డ్ సన్ లాంటి వాళ్లు వచ్చారు. కానీ ఒక్కరుగా పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. బ్రియాన్ లారా లాంటివాళ్లు 400 పరుగులు చేసి, అలాంటి రికార్డులు చేసుకుంటూ వెళ్లిపోయారు.

ఇదంతా ఎందుకంటే ప్రపంచ క్రికెట్ లో వెస్టిండీస్ వైభవం ఇది. కానీ ఇప్పుడు ఘోరంగా ఓడిపోతూ టెస్ట్ సిరీస్ రికార్డులను ప్రత్యర్థులకు అప్పగిస్తూ చేష్టలుడిగి చూస్తోంది. విషయం ఏమిటంటే సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో ఓటమి పాలైంది. దీంతో వరుసగా ఆ జట్టుపై పది సిరీస్ లను కోల్పోయి ఒక చెత్త రికార్డు నమోదు చేసుకుంది.


Also Read: కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచార ఘటన.. స్పందించిన హర్భజన్‌ సింగ్

అంటే ఎన్నో ఏళ్లుగా  సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ లు ఆడుతూ వస్తున్న వెస్టిండీస్ జట్టు.. ఇప్పటికి కూడా ఇంకా ఆ దశ నుంచి కోలుకోలేదు. పది సిరీస్ లు ఆడినా ఒక్కటి కూడా ఆ జట్టు గెలవలలేదంటే ఆ జట్టు ఎంత దయనీయ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకన్నా ఘోరం ఏమిటంటే.. ఇదే వెస్టిండీస్ జట్టు ఇండియా, ఆస్ట్రేలియాపై కూడా 9 సిరీస్ లు ఆడింది. వాటిలో కూడా ఒక్క సిరీస్ కూడా గెలవలేదు.

వెస్టిండీస్-దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటివరకు 33 టెస్టులు జరిగాయి. ఇందులో వెస్టిండీస్ 3 మాత్రమే గెలిచింది. ఇందులో కొన్ని డ్రా అయితే, కొన్ని సౌతాఫ్రికా గెలిచింది. గుడ్డిలో మెల్ల ఏమిటంటే ఈ తాజా సిరీస్ లో ఫస్ట్ టెస్టును వెస్టిండీస్ డ్రా చేసింది. రెండో టెస్టులో కూడా బౌలర్ల ఆధిపత్యం కారణంగా వికెట్లు ధనాధన్ పడ్డాయి. అయినా సరే, వెస్టిండీస్ చివరి వరకు పోరాడింది. ఆఖరికి 40 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

రాబోవు రోజుల్లో వెస్టిండీస్ కి పునర్ వైభవం రావాలని మనం కోరుకుందాం.

Related News

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Big Stories

×