E-Paper
Advertisement

Unihertz Jelly Max: ప్రపంచపు అతిచిన్న 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 100MP కెమెరా దీని సొంతం..!

Unihertz Jelly Max: ప్రపంచపు అతిచిన్న 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 100MP కెమెరా దీని సొంతం..!
Advertisement

Unihertz Jelly Max: స్మార్ట్‌ఫోన్ ప్రపంచం గత కొన్నేళ్ల నుంచి క్రమ క్రమంగా అత్యంత పెద్దదిగా మారిపోయింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలోనూ ఒకటి లేదా రెండు స్మార్ట్‌‌ఫోన్లు దర్శనమిస్తున్నాయి. అదే క్రమంలో ఫోన్ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కంపెనీలు సైతం కొత్త కొత్త మొబైల్స్‌పై ఫోకస్ పెడుతున్నాయి. ఇందులో భాగంగానే వినియోగదారుల సేఫ్టీ, టేస్ట్‌కు తగ్గట్టుగా మొబైల్స్‌ను తయారు చేసి ఆకట్టుకుంటున్నాయి. అందులోనూ ఇప్పుడంతా 5జీ మయమైపోయింది. దేశ వ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులో ఉండటంతో ప్రతి మొబైల్ కంపెనీ 5జీ నెట్‌వర్క్‌తో ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి.

ఇప్పటికే ఎన్నో స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తమ ఫోన్లను మార్కెట్‌లో లాంచ్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నాయి. తాజాగా మరొక కొత్త కంపెనీ గ్లోబల్ మార్కెట్‌లో దర్శనమిచ్చింది. అదే ‘Unihertz Jelly Max’ (యునిహెర్ట్జ్) స్మార్ట్‌ఫోన్. ఇది ప్రపంచంలోనే అతి చిన్న 5G ఫోన్‌గా గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయింది. కేవలం $199 (భారతీయ కరెన్సీ ప్రకారం రూ.16, 600) ప్రారంభ ధరతో ప్రారంభించింది. ఇది ట్రాన్షపరెంట్ బ్యాక్ ప్యానెల్, పవర్ఫుల్ ఫీచర్లతో మార్కెట్‌లోకి వచ్చింది.

Advertisement

Unihertz Jelly Max 5జీ ఫోన్ 128.7 మి.మీ పొడవు.. 62.7 మిమీ వెడల్పు, 16.3 మిమీ మందాన్ని కలిగి ఉంది. ఇక యునిహెర్ట్జ్ జెల్లీ మాక్స్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. జెల్లీ మ్యాక్స్ 5.05-అంగుళాల స్క్రీన్, 720 x 1520 పిక్సెల్స్ రిజల్యూషన్, LCD డిస్‌ప్లేతో పాటు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్‌ను కలిగి ఉంది. చిన్న పరిమాణం ఉన్నప్పటికీ.. ఫోన్ 180g వద్ద ఆశ్చర్యకరంగా భారీగా ఉంది. ఇది iPhone 13 mini కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది.

Also Read: గోట్ సేల్ అదిరిపోయింది.. నథింగ్ ఫోన్‌పై ఏకంగా రూ.15000 డిస్కౌంట్..!

Advertisement

ఈ ఫోన్ శక్తివంతమైన MediaTek డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది దాని మునుపటి ఫోన్‌లో కనుగొనబడిన Helio G99 నుండి అప్‌గ్రేడ్ అయింది. ఈ ప్రాసెసర్ భారీ 12GB LPDDR5 RAM + 256GB UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఇది రోజువారీ పనులకు, కొన్ని గేమింగ్‌లకు, సున్నితమైన పనితీరుకు బాగా ఉపయోగపడుతుంది. ఫోటోల విషయానికొస్తే.. జెల్లీ మాక్స్ వెనుక ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ప్రధాన సెన్సార్ 100MP, 8MP టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది.

జెల్లీ మ్యాక్స్‌లో 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4000mAh బ్యాటరీ అమర్చబడింది. ఇది కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌కు ఆకట్టుకుంటుంది. ఇది కేవలం 20 నిమిషాల్లో బ్యాటరీని 90% వరకు ఛార్జింగ్ చేస్తుంది. ఈ సరికొత్త ఫోన్ Android 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. కనెక్టివిటీ విషయానికొస్తే.. ఇందులో 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల కోసం NFC, ఇన్‌ఫ్రారెడ్ పోర్ట్‌ సహా అనేక రకాల కనెక్టివిటీ ఎంపికలను కలిగి ఉంది. ఇందులో సేఫ్టీ కోసం వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. కాగా ఈ యునిహెర్ట్జ్ ఈ ఏడాది అక్టోబర్ నుండి డెలివరీ చేస్తుందని భావిస్తున్నారు.

Related News

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

Big Stories

Advertisement
×