నాగార్జున యాదవ్ ఈ మధ్యకాలంలో ఓ ఛానల్ డిబెట్ లో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో చంద్రబాబు నాయుడితో పాటు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. అలిపిరి వద్ద బాంబుబ్లాస్ట్ సంగటన నుంచి తప్పించుకున్న చంద్రబాబు ఈ సారి మాత్రం తప్పించుకోలేరు.. అతన్ని అంతమొందిస్తాము అంటూ తీవ్ర స్థాయితో మాట్లాడారు. అదేవిధంగా తెలంగాణ సీఎంను డెలవరీబాయ్ లాంటి వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఈ విషయంలో ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో నాగార్జున యాదవ్ పై అటు తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేసులు నమోదు చేశారు.
అయితే గత కొంత కాలంగా చంద్రబాబును, రేవంత్ రెడ్డిని తీవ్ర పదజాలంతో మాట్లాడిన నాగార్జున యాదవ్ గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నాడు. అయితే తాజాగా అతను బెంగళూరులో ఉన్నట్లు తెలుసుకున్న చిత్తూరు జిల్లా పోలీసులు కుప్పం తీసుకువచ్చి విచారిస్తున్న నేపథ్యంలో.. ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణా పోలీసులు కూడా అతన్ని తమ అదుపులో తీసుకురావడానికి పీటీ వారంటర్ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే నాగార్జున యాదవ్ అరెస్ట్ కు సంబంధించి పోలీసులు అధికారంగా ప్రకటించలేదు.
కొంత సమాచారం మేరకు ఆదివారం రాత్రి అతన్ని కుప్పం తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద అతనిపై గతంలో ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయో విచారించనున్నారు. అధేవిధంగా ఈ కేసుకి సంబంధించి చిత్తూరులో తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ ఫిర్యాదు చేశారు. దీంతో అతను మాట్లాడిన వీడియోలను కూడా పోలీసులకు ఇచ్చిన నేపథ్యంలో నాగార్జున యాదవ్ సాక్ష్యాధాలతో ఈ కేసులో బుక్కైన పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో తెలంగాణ పోలీసులు కూడా ఈ కేసుపై విచారిస్తున్నారు.