BigTV English

Ujjaini Mahankali Rangam : తెలంగాణ భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత

Ujjaini Mahankali Rangam : తెలంగాణ భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత

Ujjaini Mahankali Rangam Bhavishyavani(Telangana news live): సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆషాఢ బోనాల జాతర మహోత్సవాలు రెండోరోజు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల జాతరలో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. సకలదేవతల పూజలతో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.


ఈ ఏడాది బోనాలను సంతోషంగా అందుకున్నానని తెలిపారు. భక్తులందరినీ తన వద్దకు రప్పించుకున్నానన్నారు. ఏ ఆపద రాకుండా తనను కొలిచినవారికి అండగా నిలుస్తానని అభయమిచ్చారు. మామూలు బోనమైనా, మట్టిబోనమైనా, స్వర్ణబోనమైనా.. ఆ బోనాన్ని ఎవరు ఎత్తుకుని తీసుకొచ్చినా తనకు సంతోషమేనన్నారు. ఇలా చేయాలి, అలా చేయాలన్నవి పెట్టుకోవద్దన్నారు మాతంగి స్వర్ణలత.

ఈ ఏడాది కోరినన్ని వర్షాలు పడుతాయని, పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయని రంగం భవిష్యవాణిలో వినిపించారు. అందరూ సంతోషంగా జీవించాలని అన్నారు. ఏది ఎంతవరకు కావాలో అంతవరకే కోరుకోవాలని చెప్పారు. కష్టంలేకుండా తన దర్శనం జరిగితే.. భక్తులు సోమరిపోతులవుతారని అన్నారు. భక్తులకు ఎలాంటి రోగాలు సోకకుండా కాపాడుతానన్నారు. పంటలు పండించేందుకు మందులను వాడటం తగ్గిస్తే.. వ్యాధులు రాకుండా ఉంటాయని సెలవిచ్చారు మాతంగి స్వర్ణలత. 5 వారాలపాటు పప్పు, బెల్లంతో నైవేద్యం సమర్పించి పూజలు చేయాలని చెప్పారు. ఈ రంగం కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. భవిష్యవాణి ముగిసిన అనంతరం.. అమ్మవారి ఊరేగింపు ఘట్టం ప్రారంభమైంది.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×