Vivo T5: చైనాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థ వివో తమ పాపులర్ T సిరీస్‌లో మరో సరికొత్త Vivo T5 స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. మిడ్‌రేంజ్ బడ్జెట్‌లో పవర్‌ఫుల్ బ్యాటరీ, అద్భుతమైన వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లతో రోజువారీ అవసరాలకు సరిపోయేలా ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు. ముఖ్యంగా ఈ ఫోన్ ఫీచర్లు టెక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీనిలోని 7200mAh భారీ బ్యాటరీ. రోజంతా ఫోన్ వాడినా ఛార్జింగ్ అయిపోతుందనే భయం ఉండదు. దీనికి తోడు 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీనివల్ల ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. ఎక్కువ సమయం ఛార్జర్‌కు కనెక్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే యూజర్లు తమ పనులను హ్యాపీగా చేసుకోవచ్చు.
Also Read: మీ పర్సనల్ డేటా లీక్ అవ్వకుండా.. సూపర్ స్పీడ్‌తో పనిచేసే బెస్ట్ బ్రౌజర్లు ఇవే!
వివో T5 ఫోన్‌కు IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. దీంతో ధూళి, నీటి నుంచి పూర్తి రక్షణ లభిస్తుంది. ఈ ఫోన్ మరో ప్రత్యేకత ఏమిటంటే.. దీని సాయంతో నీటి అడుగున కూడా ఫొటోలు తీసుకోవచ్చు. సాధారణ స్మార్ట్‌ఫోన్‌లు పాడైపోయే ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా ఈ ఫోన్ అద్భుతంగా పనిచేస్తుంది.
ఫొటోల కోసం ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 2MP డెప్త్ సెన్సార్‌ను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. దీనిలో 120Hz రీఫ్రెష్ రేట్ గల 6.75 ఇంచుల HD ప్లస్ స్క్రీన్‌ను ఇచ్చారు. ఇది 1250 నిట్స్ బ్రైట్‌నెస్‌ను ఇస్తుంది కాబట్టి.. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6 సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ డివైజ్, మల్టీటాస్కింగ్ కోసం 8GB RAM, 256GB స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ.. ఫోన్ బరువు కేవలం 219 గ్రాములు మాత్రమే ఉండటం విశేషం. ప్రస్తుతం ఇది బ్లాక్, గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.