E-Paper
Advertisement

గూగుల్ మ్యాప్స్‌లో ఈ సీక్రెట్ బటన్ ఆన్ చేస్తే.. పెట్రోల్ బిల్లు సగం!

గూగుల్ మ్యాప్స్‌లో ఈ సీక్రెట్ బటన్ ఆన్ చేస్తే.. పెట్రోల్ బిల్లు సగం!
Advertisement

Google Maps Eco-Friendly Routing: రోజురోజుకూ సెంచరీ దాటి దూసుకెళ్తున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడి బడ్జెట్ తలకిందులవుతోంది. ఇలాంటి టైమ్‌లో లీటర్ పెట్రోల్ మిగిలినా పెద్ద ఊరటే. దీని కోసమే గూగుల్ మ్యాప్స్ మనకు ఒక సరికొత్త ఇంధన పొదుపు ఫీచర్‌ను పరిచయం చేసింది. అదే “ఎకో-ఫ్రెండ్లీ రూటింగ్” (Eco-Friendly Routing). చాలా మంది మ్యాప్స్‌లో కేవలం లొకేషన్ సెట్ చేసి డ్రైవింగ్ స్టార్ట్ చేస్తారు తప్ప.. ఈ హిడెన్ సెట్టింగ్‌ను అస్సలు పట్టించుకోరు. మీ ప్రయాణాన్ని స్మార్ట్‌గా మార్చే ఆ సీక్రెట్ ఫీచర్ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏంటి ఈ ‘ఎకో-ఫ్రెండ్లీ రూటింగ్’ ఫీచర్?

సాధారణంగా గూగుల్ మ్యాప్స్ మనకు ట్రాఫిక్ తక్కువగా ఉండి.. అత్యంత వేగంగా వెళ్లే రూట్ ను చూపిస్తుంది. కానీ ఈ కొత్త ఎకో-ఫ్రెండ్లీ ఫీచర్ మాత్రం తక్కువ పెట్రోల్ లేదా డీజిల్ ఖర్చయ్యే రూట్‌ను చూపిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే.. గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్సాయంతో రోడ్డుపై ఉండే ట్రాఫిక్ కొండ ప్రాంతాలు, సిగ్నల్స్ సంఖ్య, స్థిరమైన వేగంతో వెళ్లే .. వీలున్న రోడ్లను విశ్లేషిస్తుంది.ఒక్కోసారి ఫాస్టెస్ట్ రూట్ కంటే ఈ ఎకో-ఫ్రెండ్లీ రూట్ ద్వారా వెళ్లడం వల్ల 2-3 నిమిషాల సమయం ఎక్కువ పట్టవచ్చు, కానీ మీ గాడి మైలేజ్ మాత్రం అదిరిపోతుంది.

Advertisement

మీ ఇంజిన్ రకాన్ని బట్టి రూట్ మారుతుంది:
ఈ ఫీచర్‌లోని అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఇది మీ బైక్ లేదా కార్ యొక్క ఇంజిన్ టైప్ ఆధారంగా పనిచేస్తుంది.

పెట్రోల్/డీజిల్ వాహనాలు: ఇవి హైవేలపై లేదా ట్రాఫిక్ లేని రోడ్లపై ఎక్కువ మైలేజ్ ఇస్తాయి.

Advertisement

హైబ్రిడ్/ఎలక్ట్రిక్ (EV) వాహనాలు: ఇవి సిటీ ట్రాఫిక్‌లో, తరచూ బ్రేకులు వేసే స్టాప్-అండ్-గో ట్రాఫిక్‌లో రీజెనరేటివ్ బ్రేకింగ్ వల్ల ఎక్కువ ఎఫిషియన్సీని ఇస్తాయి.
గూగుల్ మ్యాప్స్ మీ వాహన రకానికి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే రూట్‌ను మాత్రమే షార్ట్‌లిస్ట్ చేసి చూపిస్తుంది.

ఈ సెట్టింగ్‌ను మొబైల్‌లో ఆన్ చేయడం ఎలా?:
మీ ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్‌లో ఈ సెట్టింగ్‌ను యాక్టివేట్ చేయడానికి ఈ కింది సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి.

1.మొదట మీ మొబైల్‌లో Google Maps యాప్ ఓపెన్ చేయండి.

2.టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న మీ ప్రొఫైల్ పిక్చర్ (Icon) పై క్లిక్ చేయండి.

3. అందులో కింద ఉన్న Settings ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.

4.ఇప్పుడు కొంచెం కిందకి స్క్రోల్ చేసి Navigation Settings లోకి వెళ్లండి.

Also Read: వర్షాకాలంలో ఏసీని ఏ టెంపరేచర్‌లో.. వాడాలో తెలుసా?

5.అక్కడ మీకు Route Options అనే సెక్షన్ కనిపిస్తుంది. అందులో “Prefer fuel-efficient routes” అనే ఆప్షన్‌ను ఆన్ (Toggle On) చేసుకోండి.

6. దాని కిందే ఉండే Engine Type పై క్లిక్ చేసి.. మీ వాహనం పెట్రోలా, డీజిలా, హైబ్రిడ్ లేదా ఈవీనా అనేది సెలెక్ట్ చేసుకోండి.

7. అంతే! మీ మ్యాజిక్ సెట్టింగ్ యాక్టివేట్ అయిపోయింది. ఇకపై మీరు ఎక్కడికైనా లొకేషన్ సెట్ చేసినప్పుడు మ్యాప్స్ పక్కన ఒక ‘చిన్న ఆకు’గుర్తు కనిపిస్తుంది. అదే పెట్రోల్ సేవ్ రూట్ అన్నమాట.

టెక్నాలజీని కేవలం దారి వెతుక్కోవడానికే కాదు, ఇలా స్మార్ట్‌గా డబ్బులు ఆదా చేసుకోవడానికి కూడా వాడొచ్చు. గూగుల్ మ్యాప్స్ లోని ఈ చిన్న చేంజ్ మీ నెలవారీ పెట్రోల్ బిల్లుపై మంచి ప్రభావం చూపిస్తుంది. పర్యావరణానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మీ మొబైల్ తీసి గూగుల్ మ్యాప్స్ సెట్టింగ్స్ మార్చేయండి.

Related News

బ్యాంక్ ఖాతాలపై హ్యాకర్ల కన్ను.. ఈ 6 VPN యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి!

వాట్సప్‌లో ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కాకుండా ఎలా ఆపాలి?

25 రోజుల బ్యాటరీ.. వాచ్ ఫీచర్లతో క్యాసియో ‘స్మార్ట్ రింగ్’ వచ్చేసింది, ధర ఎంతంటే?

ఆరేళ్ల బ్యాటరీ గ్యారెంటీతో భారత్‌లోకి వచ్చేసిన Vivo T5x 5G.. లాంచింగ్ ఆఫర్‌తో తక్కువ ధరకే పొందొచ్చు!

రీఛార్జ్ రేట్లు పెరిగినా డోంట్ కేర్.. రూ.1849కే ఏడాది పొడవునా ఎయిర్‌టెల్ ప్లాన్ ఉందిగా!

ఫోన్ వర్షంలో తడిసినా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కాపాడుకునే ‘మాస్టర్ టిప్’ ఇదిగో!

జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.55 కే 1000 పైగా ఛానెళ్లు.. ఎంచెక్కా ఫోన్‌లోనే లైవ్ టీవీ!

డెల్ నుంచి అడ్వాన్స్‌డ్ ఏఐ ల్యాప్‌టాప్‌లు వచ్చేసాయి.. 17 గంటల బ్యాటరీ లైఫ్‌తో!

Big Stories

Advertisement
×