E-Paper
Advertisement

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!
Advertisement

Affordable Stay at Railway Stations: తరచుగా రైల్వే స్టేషన్ కు వెళ్లిన తర్వాత ట్రైన్ ఆలస్యం అనే మాట వింటుంటాం. అలాంటి సమయంలో ప్లాట్ ఫారమ్ మీదే గంటల తరబడి వెయిట్ చేయాల్సి రావచ్చు. చాలా మంది  రైలు కోసం గంటల తరబడి స్టేషన్‌ లో వేచి ఉండాల్సి వచ్చిన సందర్భాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ప్లాట్‌ ఫారమ్‌ మీద  కూర్చోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రైలు ఆలస్యం అయితే  ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. అయితే, చాలా మంది ప్రయాణికులకు తెలియని ఓ ఉపయోగకరమైన సదుపాయం భారతీయ రైల్వే అందిస్తోంది. అదే ఐఆర్‌సీటీసీ రిటైరింగ్ రూమ్స్.

ఇంతకీ ఐఆర్‌సీటీసీ రిటైరింగ్ రూమ్స్ అంటే ఏంటి?

రిటైరింగ్ రూమ్స్ అనేవి రైల్వే స్టేషన్లలోనే అందుబాటులో ఉంటాయి. ఈ గదులను ప్రయాణికులు తక్కువ ఖర్చుతో బుక్ చేసుకుని రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. రైలు ప్రయాణం చేసే వారికి ఇది ఎంతో ఉపయోగపడే సౌకర్యం. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ప్రయాణించే వారు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నవారికి ఈ సదుపాయం మరింత సౌకర్యంగా ఉంటుంది.

జస్ట్ రూ. 200కే ఏసీ రూమ్

Advertisement

రిటైరింగ్ రూమ్స్‌ లో సాధారణ గదులతో పాటు ఏసీ గదులు, డార్మిటరీలు కూడా అందుబాటులో ఉంటాయి. డార్మిటరీ బెడ్స్ సాధారణంగా రూ.100 నుంచి ప్రారంభమవుతాయి. అలాగే , గదులు సుమారు రూ.200 నుంచి లభిస్తాయి. స్టేషన్, రూమ్ మోడల్, డిమాండ్‌ ను బట్టి ధరల్లో కొంత మార్పు ఉంటుంది.

12 గంటల నుంచి 2 రోజుల వరకు బుక్ చేసుకోచ్చు!

ఈ గదులను 12 గంటల నుంచి గరిష్టంగా రెండు రోజుల వరకు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కన్ఫర్మ్ అయిన టికెట్, ఆర్‌ఏసీ టికెట్ ఉన్న ప్రయాణికులు మాత్రమే ఈ సదుపాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌ సైట్, యాప్ ద్వారా సులభంగా ఆన్‌ లైన్‌ లో బుకింగ్ చేసుకోవచ్చు. రాత్రి సమయంలో రైలు ఆలస్యం అయినా, తెల్లవారుజామున రైలు ఉన్నా, మధ్యలో కొన్ని గంటలు విశ్రాంతి అవసరమైనా ఈ గదులు బుక్ చేసుకోవడం మంచిది. స్టేషన్ బయట హోటల్ కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. అలాగే అదనపు ఖర్చు కూడా తగ్గుతుంది.

Advertisement

వాస్తవానికి చాలా మంది ప్రయాణికులు ఈ సదుపాయం గురించి తెలియక ప్లాట్‌ ఫారమ్‌ పై గంటల తరబడి వేచి ఉంటారు. కానీ, ముందుగానే రిటైరింగ్ రూమ్ బుక్ చేసుకుంటే సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు. ముఖ్యంగా ఎండాకాలంలో, ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితుల్లో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ మీరు వెళ్లే రైలు ఆలస్యం అయినప్పుడు, స్టేషన్‌లో ఎక్కువ సమయం గడపాల్సి వచ్చినప్పుడు ప్లాట్‌ ఫారమ్‌ మీద ఇబ్బంది పడకుండా రైల్వే రిటైరింగ్ రూమ్స్‌ ను వాడుకోవడం మంచిది. తక్కువ ఖర్చుతో మంచి సౌకర్యాన్ని పొందుతూ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుకోవచ్చు.

Read Also: కన్ఫర్మ్ టిక్కెట్ ఉన్నా నో సీట్.. రైల్వేకు దిమ్మతిరిగే షాకిచ్చిన వినియోగదారుల కమిషన్!

Related News

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

అజంతా To ఎల్లోరా.. 6 రోజుల క్రేజీ టూర్.. ధర మరీ ఇంత తక్కువా?

జపాన్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీ నుంచి ఒసాకాకు నాన్‌స్టాప్ విమానాలు!

సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులకు అలర్ట్.. అక్టోబర్ 24 వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్!

ఇండియన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగింది.. కానీ, వీసా ఫ్రీ దేశాలు తగ్గాయ్!

రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఆఫ్‌లైన్ టిక్కెట్లకూ ఇన్సూరెన్స్.. రూ. 10 లక్షల బీమా కవరేజ్!

విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు.. పవర్ బ్యాంకులపై DGCA నిషేధం! ఇంకా ఏంటంటే..

Big Stories

Advertisement
×