E-Paper
Advertisement

వన్ ప్లస్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్.. ఫీచర్లు తెలిస్తే కొనకుండా ఉండలేరంతే !

వన్ ప్లస్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్.. ఫీచర్లు తెలిస్తే కొనకుండా ఉండలేరంతే !
Advertisement

OnePlus Nord Buds 4 India launch: బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు అందించే ఆడియో డివైజ్‌లకు డిమాండ్ ఎప్పుడూ ఎక్కువే. దీనిని అందిపుచ్చుకోవడానికి ప్రముఖ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ తన సరికొత్త ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్ OnePlus Nord Buds 4 ఇండియా లాంచ్‌ను టీజ్ చేసింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లో దీనికి సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్ కూడా లైవ్ అయింది. సరికొత్త డిజైన్, ఆకట్టుకునే కలర్ ఆప్షన్లతో రాబోతున్న ఈ ఇయర్‌బడ్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

డిజైన్ , కలర్ ఆప్షన్లు ఎలా ఉండబోతున్నాయి?
కంపెనీ షేర్ చేసిన అధికారిక టీజర్ ప్రకారం.. వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 సరికొత్త సిగ్నేచర్ సియాన్/టీల్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి రానుంది.

Advertisement

ఇన్-ఇయర్ డిజైన్: ఇవి సిలికాన్ ఇయర్ టిప్స్‌తో కూడిన ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంటాయి.

షార్ట్ స్టెమ్స్: మునుపటి మోడల్స్ మాదిరిగానే చిన్న కాడలు , ఛార్జింగ్ కోసం పోగో పిన్ కనెక్టర్లు ఇందులో ఉన్నాయి.

Advertisement

పెబుల్ షేప్ కేస్: దీని ఛార్జింగ్ కేస్ గుండ్రంగా.. జేబులో సులభంగా ఇమిడిపోయే పెబుల్ ఆకారంలో ఉండబోతోంది. అలాగే వాల్యూమ్ కంట్రోల్స్ కోసం దీనిపై ప్రత్యేక టచ్-సెన్సిటివ్ ఏరియా (Slide to control volume) ఉండనున్నట్లు తెలుస్తోంది.

లీకైన అద్భుతమైన ఫీచర్లు:
ఈ బడ్జెట్ సెగ్మెంట్ ఇయర్‌ బడ్స్‌లో వన్‌ప్లస్ ఈసారి ఊహించని హార్డ్‌వేర్ ఫీచర్లను చేర్చునున్నట్లు టెక్ వర్గాల సమాచారం.

డ్యూయల్ డ్రైవర్ సెటప్: సాధారణంగా ఈ ధరలో సింగిల్ డ్రైవర్స్ మాత్రమే ఉంటాయి. కానీ Nord Buds 4 లో 11mm వూఫర్ , 6mm ట్వీటర్‌తో కూడిన డ్యూయల్ డ్రైవర్ సెటప్ ఉండే అవకాశం ఉంది. ఇది బేస్, ట్రెబుల్‌ను అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తుంది.

Hi-Res ఆడియో & LHDC 5.0: హెచ్‌డి ఆడియో స్ట్రీమింగ్ కోసం ఇందులో LHDC 5.0 కోడెక్ సపోర్ట్ మరియు 3D స్పాషియల్ ఆడియో ఫీచర్ ఉండబోతోంది. దీని వల్ల సినిమా చూస్తున్నప్పుడు లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు థియేటర్ లాంటి ఫీలింగ్ కలుగుతుంది.

కనెక్టివిటీ: తాజా బ్లూటూత్ 6.1 టెక్నాలజీతో ఇది మరింత వేగంగా, స్థిరంగా డివైజ్‌లకు కనెక్ట్ అవుతుంది.

యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) & బ్యాటరీ:
బయటి శబ్దాలు వినిపించకుండా ఉండేందుకు ఇందులో.. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఉంటుంది. కాల్స్ మాట్లాడే సమయంలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను ఫిల్టర్ చేయడానికి మల్టిపుల్ మైక్స్,ఏఐ క్లియర్ కాల్ అల్గారిథమ్ సహాయ పడతాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. కేస్‌తో కలిపి దాదాపు 36 గంటల నుంచి 40 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది.

Also Read: ఫోన్ స్టోరేజ్ నిండిపోయిందా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో నిమిషాల్లో ఖాళీ

ధర, లాంచ్ వివరాలు:
ఈ ఏడాది మార్చిలో లాంచ్ అయిన ప్రీమియం వెర్షన్ ‘OnePlus Nord Buds 4 Pro’ ధర రూ.3,999 గా ఉంది. కాబట్టి.. ఈ స్టాండర్డ్ వెర్షన్ అయిన OnePlus Nord Buds 4 అంతకంటే తక్కువ ధరకే లభించనుంది. లీక్స్ ప్రకారం దీని ధర దాదాపు రూ.2,999 నుంచి రూ.3,499 మధ్యలో ఉండే అవకాశం ఉంది. రాబోయే OnePlus Nord N6 స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఈ ఇయర్‌బడ్స్ కూడా ఈ జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో అధికారికంగా మార్కెట్లోకి విడుదల కానున్నాయి.

రూ.3,000 బడ్జెట్‌లో మంచి బ్రాండ్ వాల్యూ, డ్యూయల్ డ్రైవర్ సౌండ్ క్వాలిటీ, లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీని కోరుకునే ఆడియో ప్రియులకు OnePlus Nord Buds 4 ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది. అమెజాన్‌లో దీని మైక్రోసైట్ ఇప్పటికే లైవ్ అయినందున, రాబోయే రోజుల్లో మరిన్ని అధికారిక స్పెసిఫికేషన్లు వెల్లడి కానున్నాయి.

Related News

బ్యాంక్ ఖాతాలపై హ్యాకర్ల కన్ను.. ఈ 6 VPN యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి!

వాట్సప్‌లో ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కాకుండా ఎలా ఆపాలి?

25 రోజుల బ్యాటరీ.. వాచ్ ఫీచర్లతో క్యాసియో ‘స్మార్ట్ రింగ్’ వచ్చేసింది, ధర ఎంతంటే?

ఆరేళ్ల బ్యాటరీ గ్యారెంటీతో భారత్‌లోకి వచ్చేసిన Vivo T5x 5G.. లాంచింగ్ ఆఫర్‌తో తక్కువ ధరకే పొందొచ్చు!

రీఛార్జ్ రేట్లు పెరిగినా డోంట్ కేర్.. రూ.1849కే ఏడాది పొడవునా ఎయిర్‌టెల్ ప్లాన్ ఉందిగా!

ఫోన్ వర్షంలో తడిసినా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కాపాడుకునే ‘మాస్టర్ టిప్’ ఇదిగో!

జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.55 కే 1000 పైగా ఛానెళ్లు.. ఎంచెక్కా ఫోన్‌లోనే లైవ్ టీవీ!

డెల్ నుంచి అడ్వాన్స్‌డ్ ఏఐ ల్యాప్‌టాప్‌లు వచ్చేసాయి.. 17 గంటల బ్యాటరీ లైఫ్‌తో!

Big Stories

Advertisement
×