E-Paper
Advertisement

ప్రపంచంలో ఫస్ట్ ట్రిలియనీర్‌.. ఎలాన్ మస్క్ గురించి షాకింగ్ విషయాలు, ఆ ఇల్లు వెనుక ఏం జరిగింది?

ప్రపంచంలో ఫస్ట్ ట్రిలియనీర్‌.. ఎలాన్ మస్క్ గురించి షాకింగ్ విషయాలు,  ఆ ఇల్లు వెనుక ఏం జరిగింది?
Advertisement

Elon Musk: ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌ ఎలాస్ మస్క్ గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అపార సంపద ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత జీవనశైలి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టెక్సాస్‌లోని ఓ సాధారణ సీదా ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అసలు ఏం జరిగింది?

ప్రపంచంలో ఫస్ట్ ట్రిలియనీర్‌.. ఎలాన్ మస్క్ గురించి షాకింగ్ విషయాలు

Advertisement

స్పేస్‌ఎక్స్ ఐపీఓ తర్వాత ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్ అయ్యారు ఎలాన్ మస్క్. అపారమైన సంపద ఉన్నప్పటికీ, అతడు టెక్సాస్‌లోని ఒక చిన్న ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. విలాసాల కంటే పనికే ప్రాధాన్యత ఇచ్చే ఆయన, తన నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్నారు.

ఫార్చ్యూన్ మ్యాగజైన్ కథనం మేరకు.. అతని ఇంటి విలువ కేవలం 50 వేల డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో కేవలం రూ.40 లక్షలు మాత్రమే. ఆరేళ్ల కిందట టెక్సాస్‌కు మకాం మార్చిన తర్వాత మస్క్ కాలిఫోర్నియాలోని తన ఆస్తులను అమ్మేశారు. ప్రధాన నివాసం స్పేస్‌ ఎక్స్ నుంచి అద్దెకు తీసుకున్న 50 వేల డాలర్ల ఇళ్లలని ఐదేళ్ల కిందట ఎక్స్‌ లో పోస్ట్ చేసిన సంగతి తెల్సిందే.

Advertisement

ఎలాన్ మస్క్ ఇల్లు ఖరీదు కేవలం 40 లక్షలు మాత్రమే

బాక్సబుల్ స్టార్టప్ నిర్మించిన ఇల్లు కేవలం 20×20 అడుగుల విస్తీర్ణంలో ఉండనుంది. అందులో లివింగ్ ఏరియా, బెడ్‌ రూమ్, కిచెన్, బాత్‌రూమ్ ఉంటాయి. మస్క్‌కు సంబంధించిన కంపెనీల పేరు మీద ఆస్టిన్‌లో 6 నుంచి నుంచి 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్విమ్మింగ్ పూల్స్‌తో కూడిన మూడు విలాసవంతమైన గృహాలు ఉన్నాయన్నది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం.

మస్క్ ఎప్పుడు తన కంపెనీలకు దగ్గరగా ఉండటానికి ఆయన మొగ్గుచూపుతారు. టెస్లా ఉత్పత్తిలో సమస్యలు వచ్చినప్పుడు ఆయన కాలిఫోర్నియా ఫ్యాక్టరీలో నిద్రపోయేవారు. మస్క్ జీవిత చరిత్ర రచయిత వాల్టర్ ఐజాక్సన్.. మస్క్ నివసించే ఇంటి ఫొటోను పంచుకున్నారు. రెండు గదులున్న ఇంట్లోని ఓ టేబుల్ వద్ద కూర్చుని మస్క్ ఫోన్ కాల్స్ చేస్తుంటారని తెలిపారు.

ALSO READ: వన్ ప్లస్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్.. ఫీచర్లు తెలిస్తే కొనకుండా ఉండలేరంతే !

మస్క్ తల్లి కొడుకు ఇంటి గురించి కొన్ని విషయాలు చెప్పారు. ఫ్రిజ్‌లో ఆహారం ఉండదు, గ్యారేజ్‌లో పడుకున్నాను.. బాత్రూంలో ఒకే టవల్ ఉందని, ఎలాన్ కోసం వదిలేశానని, ఇది పెద్ద విషయమేమీ కాదని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మస్క్ గురించి నెటిజన్స్ రకరకాలు‌గా కామెంట్స్ చేస్తున్నారు.

50 వేలు జీతం పెరిగితే ఖరీదైన ఇంట్లోకి వెళ్లిపోతామని, అలాంటిది మొదటి ట్రిలియనీర్ ఈ విధంగా ఉండడం తాము ఎప్పుడూ చూడలేదని అంటున్నారు.  ఇలా ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు కేవలం ప్రచార వ్యూహంగా ఈ విధంగా చేస్తున్నారని అంటున్నారు. ప్రజల మనిషిగా కనిపించడానికి ట్రిక్స్ అని అంటున్నవాళ్లూ లేకపోలేదు. కంపెనీల ద్వారా ఆస్తులు కొంటూ సంపదను పోగేస్తున్నారని అంటున్నారు.

Related News

బ్యాంక్ ఖాతాలపై హ్యాకర్ల కన్ను.. ఈ 6 VPN యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి!

వాట్సప్‌లో ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కాకుండా ఎలా ఆపాలి?

25 రోజుల బ్యాటరీ.. వాచ్ ఫీచర్లతో క్యాసియో ‘స్మార్ట్ రింగ్’ వచ్చేసింది, ధర ఎంతంటే?

ఆరేళ్ల బ్యాటరీ గ్యారెంటీతో భారత్‌లోకి వచ్చేసిన Vivo T5x 5G.. లాంచింగ్ ఆఫర్‌తో తక్కువ ధరకే పొందొచ్చు!

రీఛార్జ్ రేట్లు పెరిగినా డోంట్ కేర్.. రూ.1849కే ఏడాది పొడవునా ఎయిర్‌టెల్ ప్లాన్ ఉందిగా!

ఫోన్ వర్షంలో తడిసినా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కాపాడుకునే ‘మాస్టర్ టిప్’ ఇదిగో!

జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.55 కే 1000 పైగా ఛానెళ్లు.. ఎంచెక్కా ఫోన్‌లోనే లైవ్ టీవీ!

డెల్ నుంచి అడ్వాన్స్‌డ్ ఏఐ ల్యాప్‌టాప్‌లు వచ్చేసాయి.. 17 గంటల బ్యాటరీ లైఫ్‌తో!

Big Stories

Advertisement
×