BigTV English

Vivo V40e Launched: వివో టైం ఆగయా.. కిర్రాక్ ఫీచర్లతో బ్లాక్ బస్టర్ స్మార్ట్‌ఫోన్, అదిరిపోయిందంతే!

Vivo V40e Launched: వివో టైం ఆగయా.. కిర్రాక్ ఫీచర్లతో బ్లాక్ బస్టర్ స్మార్ట్‌ఫోన్, అదిరిపోయిందంతే!

Vivo V40e price:  వివో కంపెనీ తన లైనప్‌లో ఉన్న ఫోన్లను వరుసగా లాంచ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. కొత్త కొత్త మోడళ్లను దేశీయ మార్కెట్‌లో పరిచయం చేస్తూ సత్తా చాటుతోంది. ఇందులో భాంగంగానే ఇవాళ అంటే సెప్టెంబర్ 25న తన లైనప్‌లో ఉన్న మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. Vivo V40e స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో రిలీజ్ చేసింది. ఈ కొత్త ఫోన్ MediaTek డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. అలాగే 80W వైర్డ్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.


ఈ మొబైల్ 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. అదే సమయంలో 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతుతో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో వస్తుంది. అలాగే స్మార్ట్‌ఫోన్ సేఫ్టీ కోసం ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ అందించబడింది. ఇది రెండు కలర్‌ ఆప్షన్లతో పాటు రెండు స్టోరేజ్ వేరియంట్‌లో వస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్‌ ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Vivo V40e Specifications


Vivo V40e స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల పూర్తి-HD+ (1,080 x 2,392 పిక్సెల్‌లు) 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అలాగే ప్రత్యేక ఫీచర్‌ను కలిగి ఉంది. ఇందులో వెట్ టచ్ ఫీచర్‌ ఉంది. అంటే తడి చేతులతో స్క్రీన్ వినియోగించినా ఏం కాదు. Vivo V40e స్మార్ట్‌ఫోన్ 4nm MediaTek డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో 8GB LPDDR4X RAM + 256GB వరకు UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వచ్చింది.

Also Read: అమెజాన్ ఆఫర్ల జాతర.. ఐక్యూ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు, వదిలారో మళ్లీ రావు!

ఇది ఆండ్రాయిడ్ 14-ఆధారిత FuntouchOS 14పై పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే.. Vivo V40e ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మద్దతుతో 50-మెగాపిక్సెల్ Sony IMX882 ప్రైమరీ సెన్సార్, ఆరా లైట్ యూనిట్‌తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

ఇక ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 50 మెగాపిక్సెల్ సెన్సార్ అందించబడింది. అయితే ముందు, వెనుక కెమెరాలు రెండూ 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. ఈ ఫోన్‌లో AI ఎరేజర్, AI ఫోటో ఎన్‌హాన్సర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. Vivo V40e స్మార్ట్‌ఫోన వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్‌ కోసం IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. దీంతో పాటు మరెన్నో అధునాతన ఫీచర్లు ఈ ఫోన్‌లో అందించారు.

Vivo V40e Price

భారతదేశంలో Vivo V40e రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ. 28,999 గా ఉంది. అదే సమయంలో 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 30,999 ధరగా కంపెనీ నిర్ణయించింది. ఇది మింట్ గ్రీన్, రాయల్ బ్రాంజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్‌ను అక్టోబర్ 2 నుండి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, మెయిన్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుక్కోవచ్చు. దీనికోసం వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్, వివో అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోన్‌ను ముందుగా బుక్ చేసుకోవచ్చు. దీనిపై భారీ బ్యాంక్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా 6 నెలల వరకు నో కాస్ట్ EMI ఆప్షన్ లేదా ఫ్లాట్ 10 శాతం ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. అదే సమయంలో HDFC, SBI కార్డ్ హోల్డర్లు ఫ్లాట్ 10 శాతం తక్షణ తగ్గింపును పొందుతారు.

Related News

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls| స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Big Stories

×