BigTV English

RGV: ఆమెను గెలిపించండి అంటూ వర్మ అభ్యర్థన..కప్పు గ్యారెంటీయేనా..?

RGV: ఆమెను గెలిపించండి అంటూ వర్మ అభ్యర్థన..కప్పు గ్యారెంటీయేనా..?

RGV.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)కు ఎంత మంచి పేరు ఉందో అందరికీ తెలిసిందే. శివ, క్షణక్షణం లాంటి అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రాంగోపాల్ వర్మ , ఈ మధ్యకాలంలో అడల్ట్ చిత్రాలు చేస్తూ.. తన పరువు తానే పోగొట్టుకుంటున్నారు. అయినా సరే ఈయన క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. ముఖ్యంగా సెలబ్రిటీలలో ఈయనకున్న వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు


నాలుగో వారం ఎలిమినేట్ కానున్న సోనియా..

ఈ నేపథ్యంలోనే తన శిష్యులను ఎంతోమందిని బిగ్ బాస్ లోకి పంపించి వారికి అండగా నిలిచారు రాంగోపాల్ వర్మ. గతంలో అరియానా, అషు రెడ్డి లాంటి తారలు కూడా వర్మ స్కూల్ నుంచి వచ్చినవారే. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 లోకి కూడా వర్మ హీరోయిన్ సోనియా అడుగుపెట్టింది. తనదైన ఆట తీరుతో మాట తీరుతో అందరిని ఆశ్చర్యపరుస్తూ లేడీ శివంగిగా దూసుకుపోతోంది. అయితే ఈ వారం సోనియా ఎలిమినేట్ కాబోతోంది అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సోనియాకు డైరెక్టర్ వర్మ సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


ఓటు వేసి గెలిపించండి అంటూ వర్మ అభ్యర్థన..

RGV: Varma's request to win her..is it a cup guarantee..?
RGV: Varma’s request to win her..is it a cup guarantee..?

రాంగోపాల్ వర్మ తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో సోనియాతో దిగిన ఫోటో ని షేర్ చేస్తూ.. ధైర్యానికి, ఆటిట్యూడ్ కి నిదర్శనం అయిన సోనియా బిగ్ బాస్ లో చాలా బాగా ఆడుతోంది. దయచేసి మీరు కూడా ఈ హాట్ బ్యూటీ కి సపోర్ట్ చేసి ఆమెకు ఓట్లు వేయాలని కోరుతున్నాను అంటూ వర్మ కోరాడు. మరి ఆర్జీవి సపోర్టు సోనియాకు ఏ విధంగా కలిసి వస్తుందో చూడాలి. మొత్తానికైతే రాంగోపాల్ వర్మ సోనియాను ఇంకా హౌస్ లోనే ఉంచాలని చూస్తున్నారు. మరి వర్మ కోరిక మేరకు అభిమానులు ఓటేస్తారా లేకపోతే ఆమె ఆటిట్యూడ్ తట్టుకోలేక బయటకు గెంటేస్తారా అన్నది తెలియాలంటే ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే.

వర్మ హీరోయిన్ గా గుర్తింపు..

ఇక సోనియా విషయానికి వస్తే.. ఈమె పూర్తి పేరు సోనియా ఆకుల. 1987 మే 31న పెద్దపల్లిలో జన్మించిన ఈ తెలంగాణ అమ్మాయి.. చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉన్నా లోపల మాత్రం చాలా మాస్ అనే చెప్పాలి. నటిగా రాణించాలని ఎన్నో కలలు కంది. ప్రస్తుతం ఈమె వయసు 37 సంవత్సరాలు. 2019లో జార్జిరెడ్డి సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన సోనియా, ఈ సినిమాతో పర్వాలేదు అనిపించుకుంది. జార్జి రెడ్డి నిజ జీవిత కథగా ఈ సినిమాను తెరకెక్కించారు. అనంతరం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్ సినిమాలో కూడా నటించింది. 2020లో కరోనా వైరస్ ప్రపంచాన్ని స్తంభింప చేసిన విషయం తెలిసిందే. ఈ కాన్సెప్ట్ తో దర్శకుడు వర్మ కరోనా వైరస్ టైటిల్ తో మూవీ చేయగా.. ఈ సినిమాకి పెద్దగా ఆదరణ లభించలేదు. ఇప్పుడు బిగ్ బాస్ షో తో ప్రేక్షకులలో మంచి ఆదరణ తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తోంది సోనియా.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×