BigTV English

Actress snigdha: నాని నా షేపులు చూసి అలా అన్నాడు.. పీరియడ్ టైమ్ లో మూడ్ స్వింగ్స్..

Actress snigdha: నాని నా షేపులు చూసి అలా అన్నాడు.. పీరియడ్ టైమ్ లో మూడ్ స్వింగ్స్..

Actress snigdha: నటి స్నిగ్ద  గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2011 లో నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది చిత్రం ద్వారా స్నిగ్ద టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. టామ్ బాయ్ లా నానికి ఫ్రెండ్ గా నటించి మెప్పించింది. ఈ సినిమాతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ తరువాత స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా కనిపించింది. మేం వయసుకు వచ్చాం, రొటీన్ లవ్ స్టోరీ, జత కలిసే, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, దమ్ము సినిమాలు స్నిగ్దకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టాయి. స్నిగ్ద కేవలం నటి మాత్రమే కాదు సింగర్ కూడా.


ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ఇండస్ట్రీలో స్నిగ్ద  ఒక అబ్బాయి. ఆమె  లుక్ మొత్తం అలానే ఉంటుంది. నడక, నడవడిక.. చివరికి అబ్బాయిల్లానే హెయిర్ కూడా. ఇక తన జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటన వలన స్నిగ్ద ఇలా మారిపోయింది. ఎన్నో ఇంటర్వ్యూలలో ఆమె  తన చిన్నతనంలో జరిగిన ఒక చేదు ఘటనను బయటపెట్టింది.

” నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఇందిరా పార్క్ లో ఆడుకుంటున్నాను.. ఆ సమయంలోనే ఒకడు.. నన్ను  ఈడ్చుకుంటూ పొదల చాటుకు తీసుకెళ్లాడు. లైంగికంగా వేధించాడు. అది రేప్ అటెంప్ట్ అనే చెప్పాలి.  ఆ ఘటన నుంచి కోలుకోవడానికి నాకు పదేళ్లు పట్టింది. ఇప్పుడు కూడా రాత్రిపూట.. నా బెడ్ పై మా నాన్న పడుకున్నా.. మామ పడుకున్నా భయంతో చచ్చిపోతాను. వాళ్ళు నా మీద ప్రేమతోనే ఉంటారు. కానీ, నాకు జరిగిన ఆ ఘటన నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది” అంటూ తెలిపింది. ఆ భయంతోనే ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది.


ఇక  దీంతో స్నిగ్ద నిజంగానే మగాడిగా మారిపోయిందని, ఆమె ముఖంపై మీసాలు, గడ్డాలు రావాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తుందని కూడా వార్తలు వచ్చాయి . తాజాగా ఆ వార్తలకు స్నిగ్ద ఫుల్ స్టాప్ పెట్టింది. తన ముఖంపై వచ్చే హెయిర్ ఎలా వస్తుంది.. ? ఎందుకు వస్తుంది.. ? అనేది కూడా తనకు తెలియదు అని తెలిపింది. అంతే కాకుండా అందరి అమ్మాయిలా పీరియడ్స్ టైమ్ లో తనకు మూడ్ స్వింగ్స్ రావు అని తెలిపింది.

Game Changer: నానా హైరానా వీడియో సాంగ్.. శంకర్ మార్క్ విజువల్స్ మావా.. సినిమాలో ఉండి ఉంటేనా..

” అలా మొదలైంది తరువాత నాకు ఫెషీయల్ హెయిర్ వచ్చింది.  నాకు PCOD వచ్చింది. స్పోర్ట్స్ ఆడడం, దీక్ష సమయంలో పీరియడ్స్ రాకుండా టాబ్లెట్స్ వేసుకోవడం. వాటివలన PCOD ఎక్కువ అయ్యింది. అది తగ్గడానికి నేను కోర్స్ వాడాను. ఇక ఆ సమయంలో షూటింగ్ ఉండడం వలన రకరకాల ప్రదేశాలకు వెళ్తాము. అక్కడ పార్లర్ ఉండదు. అంత టైమ్ కూడా ఉండదు. దీంతోస్టార్టింగ్ లో  రేజర్ తో క్లిన్ చేశా. దానివలన ఇంకా ఎక్కువ వచ్చేసాయి.  ఇక గీక్కోవడం తప్ప ఇంకేం చేయలేము” అని చెప్పుకొచ్చింది.

అబ్బాయిలా మారడానికే ఇవన్నీ జరుగుతున్నాయా ఏంటి.. ? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు స్నిగ్ద  మాట్లాడుతూ.. ” అదే నాకు అర్ధం కావడం లేదు. నా ఫ్రెండ్స్ కూడా అదే అడుగుతారు. ఎలారా ఇంత పర్ఫెక్ట్ గా సైడ్ లాక్స్  వస్తాయి నీకు అని.. నాని అడుగుతూ ఉంటారు.. ఒరేయ్ కరెక్ట్ గా నీకు ఆ షేపులు ఎలా వస్తాయిరా అని.  చూడడానికి ఇంత పర్ఫెక్ట్  సైడ్ లాక్స్ ఎలా వస్తాయి అనేది నాకు తెలియదు. వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అందరూ నన్ను అబ్బాయి అనుకుంటారు. నా బాడీ లాంగ్వేజ్ వలన  కావచ్చు.. పెరిగిన వాతావరణం వలన కావచ్చు. ఇలాంటివన్నీ యాడ్ అయ్యి  నేను అబ్బాయిగా మారాను అని అనుకోవచ్చు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×