BigTV English

Vivo X Fold 3 Pro Launch: వివో నుంచి తొలి మ.. మ.. మ.. మడతపెట్టే ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..?

Vivo X Fold 3 Pro Launch: వివో నుంచి తొలి మ.. మ.. మ.. మడతపెట్టే ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..?

Vivo X Fold 3 Pro Launch: చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో త్వరలో తన కొత్త ఫోల్డింగ్ ఫోన్‌ను భారతదేశంలోకి తీసుకురానుంది. ‘వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో’ని భారతదేశంలో విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తుంది. కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. కంపెనీ ఈ బ్రాండ్‌ని మార్చి 2024లో చైనాలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు త్వరలో భారత్‌కు తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


అయితే దీనిపై కంపెనీ ఎలాంటి సమాచారం అందించలేదు. అందుకున్న సమాచారం ప్రకారం.. Vivo ఈ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే నెలలో అంటే జూన్ 2024లో భారతదేశంలో లాంచ్ చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కంపెనీ ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేస్తే.. ఇదే వివో మొదటి ఫోన్ అవుతుంది. ఈ ఫోన్‌కి సంబంధించిన పూర్తి సమాచారం గురించి తెలుసుకుందాం.

Vivo X Fold 3 Pro Specifications


కంపెనీ చైనాలో ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆరిజిన్ OS తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ 8.03 అంగుళాల ప్రైమరీ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది AMOLED ప్యానెల్‌తో వస్తుంది. అలాగే ఈ ఫోన్‌లోని కవర్ డిస్‌ప్లే 6.53 అంగుళాలు.. ఇది AMOLEDతో కూడా వస్తుంది. ఈ రెండు స్క్రీన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తాయి.

Also Read: బ్యాటరీతో వివో నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లు.. మే 20న లాంచ్!

ఈ స్మార్ట్‌ఫోన్ 16 GB RAM + 1 TB స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో Vivo V3 చిప్ సెట్ అందించారు. ఈ పరికరం కార్బన్ ఫైబర్ కీలుతో వస్తోంది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీని ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్‌‌తో వస్తుంది. అలాగే ఈ ఫోన్ సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

అలాగే కంపెనీ దీని బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా భారీ లెవెల్లో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా ఇప్పుడు కంపెనీ ఈ అన్ని ఫీచర్లతో ఈ ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేయనుందని టెక్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. దీనిపై త్వరలో కంపెనీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసే అవకాశం ఉంది.

Tags

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×