BigTV English
Advertisement

Cancer Causes Foods: ఈ ఫుడ్స్ తింటే క్యాన్సర్ ముప్పు.. ప్రమాదంలో జీవితాలు..!

Cancer Causes Foods: ఈ ఫుడ్స్ తింటే క్యాన్సర్ ముప్పు.. ప్రమాదంలో జీవితాలు..!

Cancer Causing Foods: ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు ఉన్న ఆహారం తినాలి. కానీ ప్రస్తుతం మనం తినే కూరగాయలు, పండ్లకు హానికరమైన రసాయనాలను ఉపయోగించడం వల్ల పోషకాల మాట ఏమో గానీ కొత్త కొత్త వాధ్యులు వస్తున్నాయి. వీటి వల్ల మనకు ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మన శరీరానికి బలంగా ఉండడానికి మాంసం మంచిది. అందులోప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. కానీ క్యాన్సర్ నిపుణులు మాత్రం మాంసంలో క్యాన్సర్ కు దారితీసే కార్సినోజన్ ఉంటుంది కాబట్టి మాంసాన్ని తినకపోవడం మంచిదే అని చెబుతున్నారు .


చాలా పరిశోధనల్లో ఎలాంటి ఆహారం తింటే క్యాన్సర్ వస్తుందో వివరించడం జరిగింది. అయినప్పటికీ మీరు అలాంటి ఆహారాన్ని తింటున్నట్లయితే తక్షణం వాటిని మీ ఆహారం నుంచి తొలగించండి. మన ఆరోగ్యానికి మించినది ఏది లేదు. స్టేటస్ కోసమో రుచి కోసమో కాకుండా ఆరోగ్యం కోసం తినండి. పరిశోధకులు, వైద్య నిపుణులు చెబుతున్న హానికర ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నాన్ వెజ్


ప్రస్తుతం ఆన్ లైన్ లో మాంసం అమ్మకాలు జరుగుతున్నాయి. వారు నిల్వ ఉంచిన మాంసాన్ని కస్టమర్లకు సప్లై చేస్తున్నారు. గతంలో అప్పటికప్పుడు కోసిన మాంసాన్ని కొని ఇంటికి తెచ్చుకుని వండుకుని తినేవారు. కానీ ఇప్పుడు ఫ్రైడ్ చికెన్, క్రిస్పీ చికెన్, కేఎఫ్‌సి లాంటి మాంసాన్ని కూడా విక్రయిస్తున్నారు. వీటిని నిల్వ ఉంచడానికి ఉప్పు, నైట్రేట్ వంటి రసాయనాలను ఉపయోగిస్తారు. ఇవి శరీరంలోకి వెళ్లి కాన్సర్ కు కారకం కారణం కావచ్చని ఇంగ్లాండ్‌కు చెందిన క్యాన్సర్ రీసెర్చ్ పరిశోధనలో వెల్లడైంది.

Also Read: Dates Soaked in Ghee: ఖర్జూరను నెయ్యిలో నానబెట్టి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

మద్యం

మద్యం తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని ఎంత మంది చెబుతున్నా కొందరు మాత్రం అస్సలు వినరు. అయితే బ్రిటీష్ పరిశోధకులు మాత్రం మద్యాన్ని పూర్తిగా మానేస్తే క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. మద్యం శరీరంలో సెల్స్ డ్యామేజ్ చేస్తున్నట్లు పరిశోధనల్లో కనుగొన్నారు. మద్యంతో పాటు సిగరెట్ అలవాటు ఉన్న వారు క్యాన్సర్ డేంజర్ జోన్‌లో పడ్డట్లే. ఒక వారం రోజుకో మద్యం బాటిల్ తాగితే 10 సిగరెట్లు తాగిన దానితో సమానమంటున్నారు. కేవలం మద్యం వల్ల ఆరు రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

రెడ్ మీట్

నాలుగు కాళ్లు ఉన్న వాటి మాంసాలన్నింటినీ రెడ్ మీట్ అని చెబుతారారు. మేక మాంసం, జింక మాంసం, పంది మాంసం, ఆవు మాంసం ఇవన్నీ రెడ్ మీట్ జాబితా కిందకు వస్తాయి. చికెన్ రెడ్ మీట్ అని చెప్పరు. రెడ్ మీట్ ను నిల్వ ఉంచడం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందట. క్యాన్సర్ కు రెడ్ మీట్ కు దగ్గరి సంబంధం ఉందని కూడా పరిశోధనలో వెల్లడైంది.

Also Read: బరువు పెరుగుతున్నారా? అధిక బరువు వల్ల వచ్చే అనారోగ్య సమస్యలివే.. !

చెక్కర, వేపుడు పదార్థాలు

బేకరీ ఫుడ్స్ ఎంత తినకుండా ఉంటే అంత మంచిది. వీటిని జంక్ ఫుడ్స్ అని కూడా అంటారు. 13 రకాల క్యాన్సర్లు వీటి వల్ల వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బేకరీ ఐటమ్స్ తరచూ తినకుండా ఎప్పుడో ఒకసారి తింటే రిస్క్ తగ్గే అవకాశం ఉంటుంది .ఫైబర్ కంటెంట్ వీటిలో ఉండక పోవడం వల్ల జీర్ణ వ్యవస్థను ఇవి దెబ్బతీస్తాయి. అంతే కాకుండా కాన్సర్ రావడానికి కారణం అవుతాయి.

Related News

Soaked Almonds: డైలీ 5 నానబెట్టిన బాదంలను 30 రోజులు తింటే.. ఈ సమస్యలన్నీ దూరం !

Money Plant: ఇంటి అందానికి మాత్రమే కాదండోయ్.. ఈ ప్లాంట్ వెనుకున్న అసలు కారణాలు ఇవే!

Squats Benefits: రోజూ 30 గుంజీలు తీయాల్సిందే.. ఎందుకో తెలిస్తే ఆపకుండా చేసేస్తారు!

Moringa Oil Benefits: సౌందర్య పోషణలో మునగ నూనె.. అందాన్ని రెట్టింపు చేయడంలో తోడ్పాటు!

Winter Skincare: చలికాలంలో చర్మాన్ని.. కాపాడుకోండిలా !

Diabetes And Stroke: రక్తంలో చక్కెర పెరుగుదల.. మెదడును ఎలా ప్రభావితం చేస్తుంది?

Banana: రోజూ 2 అరటిపండ్లు తింటే.. ఎన్ని ప్రయోజనాలుంటాయో తెలుసా ?

Kitchen tips: వంట చేస్తున్నప్పుడు కళాయి మూతపై నీరు ఎందుకు పోయాలి?

Big Stories

×