BigTV English

Vivo X200 Series: వివో దూకుడు.. వరుసగా మూడు ఫోన్లు.. కెమెరాలు మాత్రం పిచ్చెక్కించాయ్..!

Vivo X200 Series: వివో దూకుడు.. వరుసగా మూడు ఫోన్లు.. కెమెరాలు మాత్రం పిచ్చెక్కించాయ్..!

Vivo X200 Series: Vivo సామాన్యులకు అందుబాటు ధరలో కొత్త కొత్త ఫోన్లను అందిస్తూ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. అదే సమయంలో ప్రీమియం ఫోన్లు కూడా విడుదల చేస్తుంది. ఇప్పటికీ ఎన్నో మోడళ్లను మార్కెట్‌లో లాంచ్ చేసి గుర్తింపు అందుకుంది. అంతేకాకుండా ఇతర బ్రాండెడ్ ఫోన్లకు గట్టి పోటీగా నిలిచింది. ముఖ్యంగా వివో ఫోన్లు దాని కెమెరా క్వాలిటీకి ప్రజాదరణ పొందాయి. త్వరలో వివో తన లైనప్‌లో ఉన్న ఓ కొత్త సిరీస్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. అదే Vivo X200 సిరీస్.


ఈ సిరీస్‌ను అక్టోబర్‌లో చైనాలో లాంచ్ చేయబోతుంది. ఈ సిరీస్‌లో మొత్తం మూడు మోడళ్లు ఉన్నాయి. అందులో Vivo X200, Vivo X200+, Vivo X200 Pro వంటివి ఉన్నాయి. అయితే కంపెనీ Vivo X200 Mini పేరుతో ఒక కాంపాక్ట్ మోడల్‌ను విడుదల చేయవచ్చని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే IMEI డేటాబేస్‌లో ఇప్పటివరకు మూడు మోడల్‌లు మాత్రమే కనిపించాయి.

కాగా Vivo X200 సిరీస్ గురించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. ఇప్పుడు ఓ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ నుండి Vivo X200 గురించిన కొత్త సమాచారాన్ని చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Weiboలో షేర్ చేశారు. దాని ప్రకారం.. Vivo X200లో MediaTek డైమెన్షన్ 9400 ప్రాసెసర్ అందించబడుతుందని చెబుతున్నారు. ఈ ఫోన్ 6.3-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని చెప్పబడింది. ఇది 1.5K రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుందని కూడా తెలిపారు.


Also Read: రూ.7,999 లకే వివో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఫీచర్లు అదిరిపోయాయ్ బాబోయ్..!

ఫోన్‌లో పెద్ద 50-మెగాపిక్సెల్ సెన్సార్‌తో పాటు చిన్న పెరిస్కోప్ కెమెరా కూడా ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఫోన్ ప్రైమరీ కెమెరా సోనీ సెన్సార్‌తో ఉంటుందని గతంలో ఒక లీక్‌లో చెప్పబడింది. Vivo X200 ఫోన్ 5500 లేదా 5600 mAh బ్యాటరీని కలిగి ఉంటుందని చెప్పబడింది. ఇది వైర్డు, వైర్‌లెస్ ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేయగలదని తెలిపారు. సేఫ్టీ కోసం ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ని అందించినట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ తాజా Android 15లో రన్ అవుతుందని చెప్పబడింది.

ఇక Vivo X200+ విషయానికొస్తే.. ఈ ఫోన్ IMEI డేటాబేస్‌లో గుర్తించబడింది. V2415 మోడల్ నంబర్‌తో దర్శనమిచ్చింది. ఇది ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో పోటీని మరింత పెంచుతుందని.. హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌గా చెప్పబడింది.  X200,  X200+, X200 Pro వంటి మూడు మోడళ్లను కంపెనీ ఈ సిరీస్‌లో లాంచ్ చేస్తుంది. Vivo X200+ స్పెసిఫికేషన్‌ల గురించి ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. Vivo X200 Pro ఫోన్ ఇంతకు ముందు కూడా లీక్‌లలో కనిపించింది. ఈ ఫోన్ మోడల్ నంబర్ V2413తో కనిపించింది.

Vivo X200 Pro ఫోన్‌ 200-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉన్నట్లు లీక్‌లు చెబుతున్నాయి. ఇలాంటి లెన్స్ Vivo X100 అల్ట్రాలో కూడా ఉంది. X200 ప్రోలో 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కూడా చూడవచ్చు. ఈ ఫోన్ 6.7 అంగుళాల 1.5K డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

Related News

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Gaming Phone: 16GB ర్యామ్, 120W ఛార్జింగ్ గల రియల్‌మి గేమింగ్ ఫోన్.. అమెజాన్ ఫెస్టివల్‌లో ₹18,000 ధర తగ్గింపు!

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Big Stories

×