BigTV English

Vivo Y18i Launched: రూ.7,999 లకే వివో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఫీచర్లు అదిరిపోయాయ్ బాబోయ్..!

Vivo Y18i Launched: రూ.7,999 లకే వివో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఫీచర్లు అదిరిపోయాయ్ బాబోయ్..!

Vivo Y18i Price: Vivo కంపెనీకి దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. కెమెరా, బ్యాటరీ, ఫీచర్ల విషయంలో ఈ కంపెనీ ఫోన్లు మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. అంతేకాకుండా సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో ఫోన్లను లాంచ్ చేస్తూ వివో దేశీయ మార్కెట్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ కంపెనీ ఫోన్లు కొనేవారి సంఖ్య అధికం కావడంతో వివో తరచూ ఏదో ఒక కొత్త టెక్నాలజీతో కొత్త మొబైళ్లను లాంచ్ చేస్తుంది. కంపెనీ తన లైనప్‌లో ఉన్న మరో చౌక మోడల్‌ను తాజాగా భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ మేరకు Vivo Y18i పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ Vivo Y18i స్మార్ట్‌ఫోన్ 6.56 అంగుళాల HD + LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ Unisoc T612 ప్రాసెసర్‌తో అమర్చబడింది. ఆండ్రాయిడ్ 14లో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్‌తో వస్తుంది. Vivo Y18i ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు, దాని ధర మొదలైన వాటి గురించి ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం.


Vivo Y18i Price

Vivo Y18i ధర విషయానికొస్తే ఈ ఫోన్ ఒకే వేరియంట్‌లో లాంచ్ అయింది. అందులో 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ.7,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. Vivo అధికారిక వెబ్‌సైట్‌తో సహా ఆఫ్‌లైన్ రిటైలర్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్ సేల్‌కు అందుబాటులో ఉంటుంది.


Vivo Y18i Specifications

Vivo Y18i స్మార్ట్‌ఫోన్ 6.56 అంగుళాల HD + LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1612 × 720 పిక్సెల్‌ల రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 528 నిట్స్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 14 ఆధారిత Funtouch OS 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో Unisoc T612 ప్రాసెసర్ ఉంది. Vivo Y18i ఫోన్ 15W ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Also Read: దూకుడు పెంచిన వివో.. కొత్త సిరీస్‌ నుంచి మూడు ఫోన్లు..!

దీనికి IP54 రేటింగ్ ఇవ్వబడింది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ స్పేస్ బ్లాక్, జెమ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. కెమెరా సెటప్ విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో f/2.2 ఎపర్చరుతో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా,  f/3.0 ఎపర్చర్‌తో 0.08-మెగాపిక్సెల్ సహాయక (auxiliary) కెమెరా ఉంది. ముందు భాగంలో f/2.2 ఎపర్చర్‌తో కూడిన 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించబడింది.

కనెక్టివిటీ విషయానికొస్తే.. ఇందులో డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4G, బ్లూటూత్ 5.0, USB టైప్ C పోర్ట్, FM సపోర్ట్ వంటివి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇ-కంపాస్ సెన్సార్ వంటివి ఉన్నాయి. అందువల్ల అతి తక్కువ ధరలో ఒక మంచి ఫోన్‌ను కొనుక్కోవాలని ఎప్పట్నుంచో భావిస్తున్న వారికి ఇది బెస్ట్‌ ఫోన్‌గా చెప్పుకోవచ్చు.

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×