BigTV English

Vivo X200: పిచ్చెక్కించే ఫొటోల ఫోన్.. వివో అంటే ఆ మాత్రం ఉంటుంది మరి..!

Vivo X200: పిచ్చెక్కించే ఫొటోల ఫోన్.. వివో అంటే ఆ మాత్రం ఉంటుంది మరి..!

Vivo X200 Launch Soon: టెక్ బ్రాండ్ వివోకి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. కొత్త కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తూ సామాన్య, మధ్యతరగతి వినియోగదారులను ఆకట్టుకుంటుంది. తక్కువ ధరలో అధిక ఫీచర్లు గల ఫోన్లను తీసుకొస్తూ ప్రత్యేకంగా నిలుస్తుంది. ముఖ్యంగా వివో ఫోన్‌ కెమెరా సెన్సార్‌లకు బాగా ప్రాచూర్యం పొందింది. తక్కువ ధరలో ఫోన్‌ను అందించి కెమెరా పరంగా అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ఏడాది ప్రారంభంలో Vivo X100 స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. దీన్ని MediaTek Dimensity 9300 SoC ప్రాసెసర్, Zeiss బ్రాండెడ్ కెమెరాలతో భారతదేశంలో రిలీజ్ చేసింది.


దీనికి ఫోన్ ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఇప్పుడు Vivo X100 ఫోన్‌కి అప్డేట్ వెర్షన్‌తో వచ్చేందుకు సిద్ధమైంది. అదే Vivo X200 స్మార్ట్‌ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన వివరాలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి. లీక్‌ల ప్రకారం త్వరలో రాబోయే X సిరీస్ స్మార్ట్‌ఫోన్ దాని మునుపటి ఫోన్ మాదిరిగానే 50-మెగాపిక్సెల్ ప్రధాన సోనీ కెమెరాతో వస్తుంది. ఇది 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

తాజాగా మరోసారి Vivo X200 ఫోన్ కీ స్పెసిఫికేషన్‌లు బయటపెట్టబడ్డాయి. తాజా సమాచారం ప్రకారం.. Vivo X200 స్మార్ట్‌ఫోన్ 50 మెగాపిక్సెల్ Sony కస్టమైజ్‌డ్ సూపర్-లార్జ్ బాటమ్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే 3x మిడ్-రేంజ్ టెలిఫోటో లెన్స్‌తో ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్‌తో వస్తుంది. Vivo X200లోని పెద్ద బ్యాటరీపై అధిక సాంద్రత కలిగిన సిలికాన్‌ను ఉపయోగిస్తుందని వివో చెప్పబడింది.


Also Read: వివో నుంచి బడ్డెట్ ఫోన్.. ఆగస్టు 7 న లాంచ్.. ధర ఎంతంటే?

కానీ ఎక్కడా కూడా బ్యాటరీ సామర్థ్యం గురించి ప్రస్తావించలేదు. Vivo X200, Vivo X200 Pro రెండూ మీడియా టెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌ను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ప్రో మోడల్ అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని సమాచారం. కాగా ఈ Vivo X200 ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, కెమెరా ఫీచర్ల వివరాలు లీక్ అయ్యాయి. కానీ ధర లాంచ్ సమాచారం బయటకు రాలేదు.

ఇక ఈ ఏడాది ప్రాంరభంలో లాంచ్ అయిన Vivo X100 ధర, స్పెసిఫికేషన్లు విషయానికొస్తే.. భారతదేశంలో Vivo X100 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 63,999గా ఉంది. Vivo X100 స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల AMOLED 8T LTPO కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 16GB వరకు LPDDR5X RAM + Vivo V2 చిప్‌తో MediaTek డైమెన్సిటీ 9300 SoCపై నడుస్తుంది. దీని మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ Sony IMX920 VCS బయోనిక్‌ను కలిగి ఉంటుంది. అలాగే 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 64మెగాపిక్సెల్ Zeiss సూపర్-టెలిఫోటో కెమెరాతో వస్తుంది. ఇది 32-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది.ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Related News

Youtube Ad free: యూట్యూబ్‌లో యాడ్స్ తో విసిగిపోయారా?.. ఈ సింపుల్ ట్రిక్ తో ఉచితంగా యాడ్స్ బ్లాక్ చేయండి

iPhone 16 vs Pixel 10: రెండూ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు.. ఏది బెస్ట్?

itel ZENO 20: రూ.5999కే స్మార్ట్ ఫోన్.. 5,000mAh భారీ బ్యాటరీతో ఐటెల్ జెనో 20 లాంచ్

New Realme Smartphone: మార్కెట్లో ఎప్పుడూ లేని బ్యాటరీ పవర్! రాబోతున్న రియల్‌మీ బిగ్ సర్‌ప్రైజ్

Google Pixel 10 Pro Fold vs Galaxy Z Fold 7: ఏ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ లో ఏది బెటర్?

Blind Man AI Glasses: ఏఐ గ్లాసెస్‌తో కంటి చూపు లేని వ్యక్తికి ఉద్యోగం.. అదెలాగంటే?

Big Stories

×