Rohit Sharma : టీమిండియా వన్డే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏదైనా సాధించాలంటే పట్టుబట్టి మరి దాన్ని దక్కించుకుంటాడు. అలాంటి రోహిత్ శర్మ దాదాపు పది కేజీలు తగ్గినట్లు తెలుస్తోంది. తాజాగా అతని లుక్స్ చూస్తే ఇదే అర్థమవుతుంది. 10 కేజీలు తగ్గిన రోహిత్ శర్మ ఓ ఈవెంట్ కు వచ్చిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇందులో ఓ బిజినెస్ మ్యాన్ తరహాలో రోహిత్ శర్మ మెరిశాడు. అంతేకాదు గతంలో కంటే చాలా స్లిమ్ గా ఉన్నాడు. ఈ ఫోటోలు బయటకు వచ్చాయి.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ అక్టోబర్ 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీని పీకి పరేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి, గిల్ కు కెప్టెన్సీ అప్పగించింది. దీంతో ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో సాధారణ ప్లేయర్ లాగానే బరిలోకి దిగుతాడు రోహిత్ శర్మ. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం నేపథ్యంలో రోహిత్ శర్మ చాలా డిసప్పాయింట్ అయినట్లు ఉదయం నుంచి తెగ వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మ కొత్త గెటప్ లో కనిపించాడు. సూట్ బూటు వేసుకొని ఓ బిజినెస్ మ్యాన్ లాగా కనిపించాడు. సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ 2025 ఈవెంట్ తాజాగా ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా ఆ రోహిత్ శర్మ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. రోహిత్ శర్మతో పాటు సంజు అలాగే శ్రేయాస్ అయ్యారు కూడా అటెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో అందరూ సింపుల్గా వస్తే రోహిత్ శర్మ మాత్రం, అదిరిపోయే ఫిట్నెస్ లుక్ లో కనిపించాడు. అతని లుక్ చూస్తే, దాదాపు పది కిలోలు తగ్గినట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియాతో సిరీస్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్
టీమిడియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ ని తొలగించారు. దీంతో తీవ్రంగా డిసప్పాయింట్ అయిన రోహిత్ శర్మ, రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడట. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ పూర్తయిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి తీసేయకముందే, తాము రిటైర్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారట. మరి దీనిపై ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది. కానీ 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ వరకు రోహిత్, కోహ్లీ ఉండాల్సిందేనని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ROHIT – SHREYAS – SANJU IN A FRAME DURING CEAT AWARDS…!!!!
– The Trio of Destruction 💥 pic.twitter.com/PYwDYLQvJz
— Johns. (@CricCrazyJohns) October 7, 2025
ROHIT SHARMA IS LOOKING FIT & SHARP IN CEAT AWARDS…!!! 🔥 pic.twitter.com/emS8OfXfNp
— Johns. (@CricCrazyJohns) October 7, 2025