OTT Movie : ఈ రోజుల్లో సోషల్ మీడియా వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. వ్యాపాపరాలతో మొదలు పెడితే ఫ్రెండ్ షిప్, ప్రేమ కూడా ఒక్క క్లిక్ తో దొరుకుతోంది. అయితే ఎంత మంచి ఉందో, అంతే చెడు కూడా జరుగుతోంది. ఎంతో మంది వీటి బారిన పడి దారుణంగా మోసపోతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఒక జపాన్ మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ కథ ఒక ఆన్‌లైన్ రీసెల్లర్ చుట్టూ తిరుగుతుంది. అతను చేసే మోసాల వల్ల, స్టోరీ రివేంజ్ థ్రిల్లర్ లా మారుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
‘క్లౌడ్’ (Cloud) 2024లో వచ్చిన జపాన్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. కియోషి కురోసావా దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో ర్యోసుకే యోషియా (మాసాకి సుడా) ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా 1 గంట 54 నిమిషాల నిడివితో IMDbలో 6.4/10 రేటింగ్ పొందింది. ఇది 2024 సెప్టెంబర్ 27న జపాన్‌లో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా MUBIలో స్ట్రీమింగ్ అవుతోంది.
ర్యోసుకే ఒక ఆన్‌లైన్ రీసెల్లర్, అంటే వస్తువులు చీప్‌గా కొని, ఆన్‌లైన్‌లో ఎక్కువ రేటుకు అమ్మి డబ్బు సంపాదిస్తుంటాడు. అతనికి గొడ్డులా కష్టపడటం ఇష్టం ఉండదు. ఈజీ మనీ కోసం రీసెల్లింగ్ చేస్తాడు. కానీ అతను కొన్నిసార్లు కస్టమర్స్‌ను మోసం కూడా చేస్తుంటాడు. దీంతో వాళ్ల రివ్యూస్‌ను ఇగ్నోర్ చేస్తాడు. దీని వల్ల ఆన్‌లైన్‌లో కస్టమర్స్ అతనిపై కోపంతో నెగెటివ్ రివ్యూస్, ట్రోలింగ్ స్టార్ట్ చేస్తారు. మొదట అతను ఈ గొడవలను సీరియస్‌గా తీసుకోడు. కానీ తర్వాత ఈ ఆన్‌లైన్ ట్రబుల్ రియల్ లైఫ్‌లోకి వస్తుంది. అతనికి విచిత్రమైన మెసేజెస్, బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తాయి. ఇప్పుడు ర్యోసుకే ఆన్‌లైన్ మోసాల వల్ల పెద్ద ప్రమాదంలో పడతాడు. ఎవరో అతన్ని ఫాలో చేస్తున్నట్టు ఫీల్ అవుతాడు. దీంతో అతనికి భయం మొదలవుతుంది. కానీ ఎవరినీ నమ్మకుండా ఒంటరిగా ఉంటాడు.
ఈ సమయంలో అతను సానో అనే మిస్టీరియస్ వ్యక్తిని కలుస్తాడు. సానో అతనికి హెల్ప్ చేయాలని అనుకుంటాడు. కానీ అతనికి కూడా ఏవో సమస్యలు ఉంటాయి. ర్యోసుకే తన రీసెల్లింగ్ బిజినెస్‌ను అలాగే కొనసాగిస్తుంటాడు. కానీ ఆన్‌లైన్ హేట్ అతని లైఫ్‌ను డేంజర్‌లోకి పడేస్తుంది. ఇప్పుడు ఈ సినిమా సస్పెన్స్‌తో, డార్క్ మూమెంట్స్‌తో నడుస్తుంది. ఆన్‌లైన్ వరల్డ్ ఎలా భయంకరంగా మారుతుందో చూపిస్తుంది. ర్యోసుకే ఆన్‌లైన్ కోపం వల్ల రియల్ లైఫ్‌లో డేంజర్‌లో చిక్కుకుంటాడు. సానోతో కలిసి అతను ఈ బెదిరింపులను ఎదుర్కొంటాడు. కానీ ఎండింగ్ చాలా షాకింగ్ ట్విస్టులతో టెన్షన్ పెట్టిస్తుంది. ఈ ట్విస్టులు ఏమిటి ? ర్యోసుకే ఈ సమస్య నుంచి బయట పడతాడా ? అతన్ని ఫాలో చేస్తుంది ఎవరు ? అనే విషయాలను, ఈ జపాన్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : ఇదేం సినిమా గురూ… మనుషులపై పగబట్టి మారణకాండ సృష్టించే గాలి… మతిపోగోట్టే సై-ఫై థ్రిల్లర్