TGPSC Group-1: తెలంగాణలో గ్రూప్-1 నియామకాల ప్రక్రియపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో గ్రూప్-1 అభ్యర్థులకు.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)కు కొంత ఊరట లభించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం నియామకాలు కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గ్రూప్-1 నియామకాలపై స్టే ఇవ్వాలని కోరుతూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, కోర్టు గ్రూప్-1 నియామక ప్రక్రియకు తాత్కాలిక నిలుపుదల ఇవ్వడానికి నిరాకరిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
గ్రూప్-1 ఫలితాల ప్రక్రియపై లేదా నియామక పత్రాలు అందించే విషయంపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం జరుగుతున్న నియామకాల ప్రక్రియ మొత్తం తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈలోగా హైకోర్టు డివిజన్ బెంచ్ గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పాటించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. తెలంగాణ గ్రూప్-1 నియామకాల ప్రక్రియ గత కొన్నేళ్లుగా వివిధ కారణాల వల్ల తరచుగా వివాదాలు, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే.
గ్రూప్-1 ఫలితాల ప్రక్రియకు సంబంధించి హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించడంపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును కోరారు. హైకోర్టులో వివాదం కొనసాగుతున్నందున, తుది తీర్పు వచ్చే వరకు నియామకాలను నిలిపివేయాలని వారు అభ్యర్థించారు. దీనికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
ALSO READ: Weather News: భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, అక్కడక్కడ పిడుగుల వర్షం..?
సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించడం వల్ల TGPSCకి, గ్రూప్-1 పరీక్షల్లో విజయం సాధించిన 563 మంది అభ్యర్థులకు పెద్ద ఊరట లభించిందనే చెప్పవచ్చు. హైకోర్టులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ గతంలో స్టే విధించి, నియామక ప్రక్రియ చేపట్టవచ్చని అనుమతించిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు నిర్ణయం హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులను సమర్థించినట్టుగా ఉంది. ఫలితంగా.. గ్రూప్-1 నియామకాల ప్రక్రియ ప్రస్తుతం నిర్వీరామంగా కొనసాగడానికి మార్గం సుగమమైంది.
ALSO READ: SSC Constable: ఇంటర్ క్వాలిఫికేషన్‌తో 7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల