BigTV English

Citadel: Honey Bunny Teaser: సిటాడెల్ టీజర్.. సమంత యాక్షన్ అదరగొట్టేసింది అంతే

Citadel: Honey Bunny Teaser: సిటాడెల్ టీజర్.. సమంత యాక్షన్  అదరగొట్టేసింది అంతే

Citadel: Honey Bunny Teaser:బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, సమంత జంటగా రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ. అమెజాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్ ను నిర్మించింది. హాలీవుడ్ రూసో బ్రదర్స్ తెరకెక్కిన సిటాడెల్ కు రీమేక్ గా హిందీలో ఈ సిరీస్ తెరకెక్కింది.


ఒరిజినల్ సిటాడెల్ లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించగా.. హిందీలో ఆ పాత్రలో సమంత మెరిసింది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ టీజర్ ను మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేశారు.

టీజర్ మొత్తాన్ని యాక్షన్ సీన్స్ తో నింపేశారు. డైలాగ్స్ లేకుండా ఒక సాంగ్ తో టీజర్ ను కవర్ చేశారు. వరుణ్ ధావన్, సమంత యాక్షన్ సీక్వెన్స్ అదరగొట్టారు. హనీ గా సామ్.. బన్నీగా వరుణ్ కనిపించారు. లేడీ స్పై గా సామ్ అద్భుతంగా కనిపించింది. గన్స్, ఫైట్స్ తో ఫ్యామిలీ మ్యాన్ లో రాజీని గుర్తుచేసింది. అంతేనా వరుణ్ తో ముద్దు సన్నివేశాల్లో కూడా నటించినట్లు తెలుస్తోంది.


రాజ్ అండ్ డీకే నుంచి మరో హిట్ సిరీస్ రానుందని టీజర్ చూసి చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సిరీస్ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సిరీస్ నవంబర్ 7 నుండి అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సిరీస్ తో సామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Big Stories

×