BigTV English

OTT Movie : భార్య పక్కనుండగా మరో అమ్మాయితో… తండ్రి కళ్ళ ముందే ఆ పని… అవార్డుల పంట పండేంతగా ఏముందంటే?

OTT Movie : భార్య పక్కనుండగా మరో అమ్మాయితో… తండ్రి కళ్ళ ముందే ఆ పని… అవార్డుల పంట పండేంతగా ఏముందంటే?

OTT Movie : ఫ్యామిలీలో రకరకాల సమస్యలు వస్తుంటాయి. అయితే వీటిలో ముఖ్యంగా డబ్బు, అక్రమ సంబంధాల వల్ల పెద్ద సమస్యలు వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, అక్రమ సంబంధం వల్ల ఒక ఫ్యామిలీ ఏ విధంగా ఇబ్బందులు పడుతుందనేది చూపిస్తుంది. ఇందులో కొడుకు, కోడలిని మోసం చేస్తున్నాడని ఒక తండ్రి తెలుసుకుంటాడు. తన కోడలికి న్యాయం చేసే ప్రయత్నంలో భాగంగా, ఈ కథ ఎమోషనల్ గా నడుస్తుంది. ఈ సినిమా 2023లోనే వచ్చినా, రెండేళ్ళ తరువాత రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అవార్డులను కూడా గెలుచుకుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో

‘ఏ లిటిల్ ప్రేయర్’ (A Little Prayer) 2023లో వచ్చిన అమెరికన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. అంగస్ మెక్‌లాచ్లన్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో డేవిడ్ స్ట్రాథాయిర్న్, విల్ పుల్లెన్, జేన్ లెవీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా IMDbలో 7.3/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

బిల్ అనే వ్యక్తి రిటైర్డ్ లైఫ్ ని గడుపుతుంటాడు. ప్రస్తుతం తన భార్య వెనిడాతో నార్త్ కరోలినాలో ప్రశాంతంగా జీవిస్తుంటాడు. వాళ్లకు డేవిడ్, గెయిల్ అనే ఇద్దరు పిల్లలు ఉంటారు. డేవిడ్ తన భార్య జేన్‌తో, పిల్లలతో హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తాడు. కానీ డేవిడ్ జీవితంలో ఏదో సమస్య ఉందని బిల్ ఫీల్ అవుతాడు. ఒక రోజు డేవిడ్ వేరే అమ్మాయితో అఫైర్ నడుపుతున్నట్టు బిల్‌కు తెలుస్తుంది. ఈ షాక్ నుంచి కోలుకుని, జేన్‌ను కాపాడాలని అనుకుంటాడు.  ఈ విషయాన్ని డేవిడ్‌ను డైరెక్ట్‌గా అడగకుండా, ముందుగా జేన్‌తో డిస్కషన్ చేస్తాడు.


డేవిడ్ మోసం గురించి జేన్ తెలుసుకుని చాలా బాధపడుతుంది. కానీ ఆమె డేవిడ్‌ను వదులుకోలేక పోతోంది. జేన్‌కు బిల్ ధైర్యం చెబుతూ, ఆమెకు  అండగా నిలుస్తాడు. ఈ మధ్యలో ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు వస్తాయి. గెయిల్ కూడా డేవిడ్ బిహేవియర్ గురించి డౌట్‌ పడతారు. బిల్ తన కొడుకు డేవిడ్‌ను మార్చడానికి ట్రై చేస్తాడు. కానీ డేవిడ్ తన తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇక ఈ ఫ్యామిలిలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఈ కథ ఒక ఎమోషనల్ టచ్ తో ముగుస్తుంది. చివరికి డేవిడ్‌ తన అఫైర్ ను వదులుకుంటాడా ? తన భార్యతో కలసి జీవిస్తాడా ? డేవిడ్‌ ఈ మ్యాటర్ ని సాల్వ్ చేస్తాడా ? అనే విషయాలను, ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : తమ్ముడి ముందే అక్కను దారుణంగా… మేనల్లుడి రివేంజ్ కి గూస్ బంప్స్ … క్లైమాక్స్ అరాచకం

Related News

OTT Movie : డెడ్ బాడీ తలలో క్యాప్సిల్… హింట్ ఇచ్చి మరీ చంపే కిల్లర్… నిమిషానికో ట్విస్ట్ మావా

OTT Movie : ఆన్లైన్ లో రీసెల్లింగ్… అర్ధరాత్రి వింత సంఘటనలు… మాస్క్ మ్యాన్ మిస్టరీతో మతిపోగోట్టే సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : వృద్ధాప్యంలో వింత కోరికలు… ఈ గ్రాండ్ మా గారడీ యమా కామెడీ గురూ… 20 ఏళ్ల తరువాత వచ్చిన సీక్వెల్

OTT Movie : ఓటీటీలో స్పైన్ చిల్లింగ్ రియల్ స్టోరీ… ఒక్కో సీన్ కు తడిచిపోవాల్సిందే… సింగిల్ గా చూసే దమ్ముందా ?

Kotha Lokah OTT: ‘కొత్త లోక’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Janhvi kapoor: ఓటీటీలోకి జాన్వీ కపూర్ కొత్త మూవీ.. ట్విస్ట్ ఏంటంటే?

OTT Movie : భార్య ఉండగా ఇదెక్కడి దిక్కుమాలిన పని… మొగుడు మగాడే కాదని తెలిస్తే… సింగిల్ గా చూడాల్సిన మూవీ మావా

Big Stories

×