BigTV English

Vivo Y37 & Y37M Mobiles Launch: వివో నుంచి మరో రెండు ఫోన్లు లాంచ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..!

Vivo Y37 & Y37M  Mobiles Launch: వివో నుంచి మరో రెండు ఫోన్లు లాంచ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..!

Y37 and Y37m Mobiles Launching from Vivo: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివోకు మార్కెట్‌లో సూపర్ డూపర్ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌కు తగ్గట్టుగానే కంపెనీ కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ తన హవా చూపిస్తోంది. తాజాగా మరో రెండు ఫోన్లను కంపెనీ రిలీజ్ చేసింది. Vivo Y37, Vivo Y37m పేర్లతో Vivo తన కొత్త స్మార్ట్‌ఫోన్‌లను చైనాలో విడుదల చేసింది. Vivo Y37, Y37m రెండు స్మార్ట్‌ఫోన్లు 6.56 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. Vivo Y37, Vivo Y37m స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు, ధర వివరాల గురించి తెలుసుకుందాం.


Vivo Y37 and Vivo Y37m Price

Vivo Y37 స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 1199 యువాన్ (సుమారు రూ.13,788) ధరతో లాంచ్ అయింది. అదే సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 1499 యువాన్ (సుమారు రూ.17,213)లతో రిలీజ్ అయింది. అలాగే టాప్ వేరియంట్ 8GB ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1799 యువాన్ (సుమారు రూ.రూ.20,725)గా నిర్ణయించబడింది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 1,999 యువాన్ (సుమారు రూ.22,979), అలాగే 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 2,099 యువాన్ (సుమారు రూ.24,151)గా కంపెనీ నిర్ణయించింది.


ఇక Vivo Y37m వేరియంట్ల విషయానికొస్తే.. దీని 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 999 యువాన్ (సుమారు రూ.11,531), 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 1,499 యువాన్ (సుమారు రూ.17,213), 8GB ర్యామ్ + 256 స్టోరేజ్ వేరియంట్ ధర 1999 యువాన్ (సుమారు రూ. 22,979)గా కంపెనీ నిర్ణయించింది. కాగా ఈ రెండు Vivo స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి.

Also Read: సామాన్యుల ఫోన్ వచ్చేసింది.. 50MP కెమెరాతో చాలా చౌక ధరలో లాంచ్ అయిన ఐక్యూ 5జీ ఫోన్..!

Vivo Y37 and Vivo Y37m Specifications

Vivo Y37, Y37m రెండు స్మార్ట్‌ఫోన్‌లు 6.56-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తాయి. రెండు స్మార్ట్‌ఫోన్‌లు Mali-G57 GPUతో ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో అమర్చబడి ఉన్నాయి. ఇది 4GB, 6GB లేదా 8GB LPDDR4X డ్యూయల్ ఛానల్ RAM, 128GB లేదా 256GB ఇంబిల్ట్ eMMC5.1 స్టోరేజ్‌ని కలిగి ఉన్నాయి. Y37 12GB RAMకి కూడా మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 14 ఆధారంగా OriginOS 14లో పని చేస్తాయి.

కెమెరా సెటప్ విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌ల వెనుక భాగంలో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G, డ్యూయల్ నానో SIM స్లాట్, 2.4G/5G Wi-Fi, బ్లూటూత్ 5.4, USB టైప్ C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Tags

Related News

OnePlus 24GB RAM Discount: వన్ ప్లస్ 24GB RAM ఫోన్‌పై భారీ తగ్గింపు.. రూ.33000 వరకు డిస్కౌంట్

Youtube Ad free: యూట్యూబ్‌లో యాడ్స్ తో విసిగిపోయారా?.. ఈ సింపుల్ ట్రిక్ తో ఉచితంగా యాడ్స్ బ్లాక్ చేయండి

iPhone 16 vs Pixel 10: రెండూ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు.. ఏది బెస్ట్?

itel ZENO 20: రూ.5999కే స్మార్ట్ ఫోన్.. 5,000mAh భారీ బ్యాటరీతో ఐటెల్ జెనో 20 లాంచ్

New Realme Smartphone: మార్కెట్లో ఎప్పుడూ లేని బ్యాటరీ పవర్! రాబోతున్న రియల్‌మీ బిగ్ సర్‌ప్రైజ్

Google Pixel 10 Pro Fold vs Galaxy Z Fold 7: ఏ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ లో ఏది బెటర్?

Big Stories

×