BigTV English

Agent: ఇదేందయ్యా ఇది.. ఏజెంట్ ఓటీటీ కాకుండా.. అలానా

Agent: ఇదేందయ్యా ఇది.. ఏజెంట్ ఓటీటీ కాకుండా.. అలానా

Agent: అక్కినేని అఖిల్, సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామ్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య ఏజెంట్.. గతేడాది రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది.


సరిగ్గా ఎడిట్ చేయకుండా.. ఎలా పడితే అలా రిలీజ్ చేయడంతో పాటు కథ కూడా ప్రేక్షకులకు నచ్చకపోవడంతో ఏజెంట్ రిలీజ్ అయిన వారం రోజులకే క్లోజ్ అయ్యింది. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీ బాట పడుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే.

ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను సోనీ లివ్ సొంతం చేసుకుంది. మరో వారం రోజుల్లో స్ట్రీమింగ్ అనుకొనేలోపు ఈ సినిమా వివాదాల బారిన పడింది. నిర్మాతల వివాదాల వలన ఏజెంట్.. ఓటీటీకి రాకుండా పోయింది. ఎప్పుడు ఓటీటీకి వస్తుందని రిలీజ్ డేట్ ప్రకటించినా.. అది రాకుండానే పోతుంది.


ఇక ఎట్టకేలకు ఏజెంట్ కు మోక్షం దొరికింది. కానీ, ఓటీటీలో కాదు ఏకంగా టీవీలో ప్రసారం కానుంది. జూలై 28 న ఈ సినిమా గోల్డ్ మైన్స్ టెలీఫిల్న్స్ ఛానెల్ లో ప్రసారం కానుంది. అయితే కేవలం ఈ సినిమా హిందీలోనే స్ట్రీమింగ్ కానుంది. దీంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో కూడా రిలీజ్ చేయాలనీ కోరుతున్నారు. మరి ఈ సినిమా టీవీలో రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.

ఇక ఈ సినిమా తరువాత ఇప్పటివరకు అఖిల్ తన తదుపరి ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు. అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం అఖిల్ ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో అఖిల్ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

Related News

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Big Stories

×