BigTV English
Advertisement

Vodafone Idea 5G : వొడాఫోన్-ఐడియా 5G సర్వీసెస్ ప్రారంభం.. కొన్ని నగరాల్లో మాత్రమే!

Vodafone Idea 5G : వొడాఫోన్-ఐడియా 5G సర్వీసెస్ ప్రారంభం.. కొన్ని నగరాల్లో మాత్రమే!

Vodafone Idea 5G : వొడాఫోన్ ఐడియా ఎట్టకేలకు భారత్లో తన 5G సేవలను మెుదలుపెట్టింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత టెలికాం దిగ్గజం 17 లైసెన్స్ ప్రాంతాలలో తన 5G సేవలను ప్రవేశపెట్టింది.


వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు 5G సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తన 5G సేవలను 3.3 GHz, 26 GHz స్పెక్ట్రమ్‌లో అమలు చేసింది. కాగా ఇండియాలో ఉన్న వినియోగదారులందరూ ఈ సేవలను ఆస్వాదించలేరు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

నిజానికి వొడాఫోన్ ఐడియా 5G స్పెక్ట్రమ్‌లో జాయిన్ అయిన రెండేళ్ల తర్వాత సేవల రోల్ అవుట్ ప్రారంభమైంది. ఇక ప్రముఖ టెలికాం సంస్థలైన Vodafone Idea, Airtel, Jio సైతం ఈ పోటీలో పాల్గొనగా.. జియో, ఎయిర్టెల్ పోటీలో నెగ్గి 2022లోనే తమ సేవలను ప్రారంభించారు. ఇక తాజాగా వొడాఫోన్ ఐడియా ప్రారంభించి ఈ సేవలు 17 నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి.


వొడాఫోన్ ఐడియా 5G సేవలు ప్రారంభమైన నగరాలు –

రాజస్థాన్ : జైపూర్ (గెలాక్సీ సినిమా సమీపంలో, మానసరోవర్ ఇండస్ట్రియల్ ఏరియా, RIICO)

హర్యానా : కర్నాల్ (HSIIDC, ఇండస్ట్రియల్ ఏరియా, సెక్టార్-3)

కోల్‌కతా : సెక్టార్ V, సాల్ట్ లేక్

కేరళ : త్రిక్కకర, కక్కనాడ్

UP తూర్పు : లక్నో (విభూతి ఖండ్, గోమతీనగర్)

UP వెస్ట్ : ఆగ్రా (JP హోటల్ దగ్గర, ఫతేబాద్ రోడ్)

మధ్యప్రదేశ్ : ఇండోర్ (ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్, పరదేశిపుర)

గుజరాత్ : అహ్మదాబాద్ (దివ్య భాస్కర్ దగ్గర, కార్పొరేట్ రోడ్, మకర్బా, ప్రహ్లాద్‌నగర్)

ఆంధ్రప్రదేశ్ : హైదరాబాద్ (ఐద ఉపల్, రంగారెడ్డి)

పశ్చిమ బెంగాల్ : సిలిగురి (సిటీ ప్లాజా సెవోక్ రోడ్)

బీహార్ : పాట్నా (అనిషాబాద్ గోలంబర్)

ముంబై : వర్లీ, మరోల్ అంధేరి ఈస్ట్

కర్ణాటక : బెంగళూరు (డైరీ సర్కిల్)

పంజాబ్ : జలంధర్ (కోట్ కలాన్)

తమిళనాడు : చెన్నై (పెరుంగుడి, నెసపాక్కం)

మహారాష్ట్ర : పూణే (శివాజీ నగర్)

ఢిల్లీ : ఓఖ్లా ఇండస్ట్రియల్ ఏరియా (ఫేజ్ 2, ఇండియా గేట్, ప్రగతి మైదాన్)

ఇక బీహార్ మినహా పైన పేర్కొన్న అన్ని రాష్ట్రాలు, వాటి నగరాల్లో వొడాఫోన్ ఐడియా 2.6GHz స్పెక్ట్రమ్ బ్యాండ్‌ను ప్రారంభించింది. ఇక ఈ టెలికాం సంస్థ న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2024 లో త్వరలోనే తన 5G సేవలను ప్రారంభించనున్నట్టు తెలిపింది. అనంతరం ఇప్పుడు భారత్ లోనే మూడో అతిపెద్ద సర్వీస్ ప్రొవైడర్ గా అవతరించి.. తన 5జీ సేవలను తీసుకొచ్చింది.

నీకు ఇప్పటివరకు ఇండియాలో జియో,  ఎయిర్టెల్ మాత్రమే 5జీ సేవలను అందిస్తుండగా.. ఒకదానికొకటి పోటీ పడుతూ ఈ రెండు ప్రైవేట్ టెలికాం సంస్థలు విపరీతంగా ధరలను పెంచేశాయి. ఈ రెండు సంస్థలు రీఛార్జ్ ప్లాన్లను ఎప్పటికప్పుడు పెంచేయడంతో వినియోగదారుల సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిఎస్ఎన్ఎల్ తన 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురాగా.. ఇప్పుడు వోడాఫోన్స్ సైతం సేవలను విస్తరించింది. ఇక చూడాలి ఈ సంస్థ తన వినియోగదారులకు అందుబాటు ధరలోనే రీఛార్జ్ ప్లాన్స్ తీసుకువస్తూందా.. లేక మిగిలిన టెలికాం సంస్థలను ఫాలో అవుతుందో!

ALSO READ : మెటో G35 5జీ ఫస్ట్ సేల్ ఈ రోజే! ధర, డిస్కౌంట్, డీల్‌ వివరాలివే 

Related News

2025 Yamaha RX 100: యమహా ఆర్ఎక్స్100 లెజెండ్‌ పవర్‌ఫుల్‌ రీ ఎంట్రీ.. ఇప్పుడు కొత్త స్టైల్‌తో..

AI Professionals-Women: ఏఐ రంగంలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్.. తాజా నివేదికలో కీలక విషయాలు

Samsung’s New 5G: శామ్‌సంగ్‌ నుంచి మరో సర్‌ప్రైజ్.. బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్ల ఫోన్‌

Vibe Coding: డెవలపర్ల కొంపముంచుతున్న కృత్రిమ మేధ.. అసలేమిటీ వైబ్‌కోడింగ్?

Meta Fake Ads Revenue: మోసపూరిత యాడ్స్‌తో లక్షల కోట్లు సంపాదించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. ఒక్క ఏడాదిలోనే

Amazon Offer on Smart Tvs: రూ.50 వేల టీవీ కేవలం రూ16 వేలకే.. అమెజాన్‌ సేల్‌లో టీవీలపై భారీ ఆఫర్‌

Smartphones comparison: పిక్సెల్ 10 ప్రో vs గెలాక్సీ S25 అల్ట్రా vs ఐఫోన్ 17 ప్రో.. ఎవరిది అసలైన టాప్­ఫ్లాగ్‌షిప్?

iphones Stolen: ఒకే నగరంలో 80000 ఐఫోన్లు దొంగతనం.. పోలీసులు ఏం చెబుతున్నారంటే

Big Stories

×