Moto G35 5G : Moto G35 5G ఫస్ట్ సేల్ ఈ రోజు మెుదలైంది. మరి తాజాగా లాంఛ్ అయిన ఈ మెుబైల్.. ధర, డీల్స్, ఆఫర్స్, డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయి.. ఈ స్మార్ట్ ఫోన్ ఏ ఈ కామర్స్ లో అందుబాటులో ఉందో ఓ లుక్కేయండి.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Moto… డిసెంబర్ 12న Moto G35 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది. ఇక ఈ రోజు నుండి ఫ్లిప్‌కార్ట్‌లో ఫస్ట్ సేల్‌ను ప్రారంభించింది మెటో. ప్రీమియం వేగన్ లెదర్ డిజైన్, 50MP కెమెరాతో పాటు ఎన్నో ఫీచర్లతో వచ్చేసిన ఈ మెుబైల్… ఫస్ట్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. ఇక కొనుగోలుదారులు నో కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, డీల్‌లు, డిస్కౌంట్‌లు వంటి ఎన్నో ప్రయోజనాలు సైతం పొందే అవకాశం ఉంది.
Moto G35 5G ధర –
Moto G355G మెుబైల్ 4GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.9999గా ఉంది. యాక్సిస్ బ్యాంక్ 5 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తోంది. కొత్తగా లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ పై నెలకు రూ. 650 EMI కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్, మోటో అధికారిక వెబ్‌సైట్ లో ఈ మెుబైల్ అందుబాటులో ఉంది.
Moto G35 5G స్పెసిఫికేషన్‌లు –
Moto G35 5G మెుబైల్ ఫీచర్స్ అదిరిపోయేలా ఉన్నాయి. 6.7 అంగుళాల FHD+ డిస్‌ప్లేతో 60Hz 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 1000నిట్స్ బ్రైట్‌నెస్, విజన్ బూస్టర్‌తో లాంఛ్ అయింది. ఇందులో 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB RAM + 128GB స్టోరేజ్ లో Unisoc T760 చిప్‌సెట్ వచ్చేసింది.
వినియోగదారులు 8GB వరకు RAMను పొడిగించే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌లో రన్ అవుతుంది. అయితే, కంపెనీ OS అప్‌గ్రేడ్‌లు, రెండు సంవత్సరాల భద్రతా ప్యాచ్‌లను సైతం అందించింది.
కెమెరా ఫీచర్ల విషయానికొస్తే… స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్‌తో డ్యూయల్ కెమెరా సిస్టమ్ ను అందిస్తుంది. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉండగా ప్రైమరీ కెమెరా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో పనిచేస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 5,000mAh బ్యాటరీ ఉంది.
Moto G35తో వచ్చే ఇతర ఫీచర్లు సైతం లేటెస్ట్ మెుబైల్స్ లో ఉన్నట్లే ఉన్నాయి. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ కోసం IP52 రేటింగ్ కూడా ఉంది. ఇక 185 గ్రాముల బరువు, 7.79mm మందంతో డాల్బీ అట్మాస్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. Moto G35 థింక్‌షీల్డ్ ప్రొటెక్షన్ తో వచ్చేసింది.
కిడ్స్ సేఫ్టీకి సంబంధించి సేఫ్ ప్లేస్ ను సైతం సృష్టించే అవకాశం ఉంది. ఇక ఇంకెందుకు ఆలస్యం తక్కువ ధరకే టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే టెక్ ప్రియులు ఈ మెుబైల్ ను కచ్చితంగా ట్రై చేసేయండి.
ALSO READ : మీ వంట మరింత రుచిగా.. ఏఐ చెఫ్స్ వచ్చేశాయ్!