E-Paper
Advertisement

After Death: మరణం తర్వాత జరిగేది ఇదే.. 3 సార్లు చనిపోయి బతికిన మహిళ ఏం చెప్పిందంటే?

After Death: మరణం తర్వాత జరిగేది ఇదే.. 3 సార్లు చనిపోయి బతికిన మహిళ ఏం చెప్పిందంటే?
Advertisement

మరణం తర్వాత ఏం జరుగుతుందనేది ఇప్పటికీ మిస్టరీనే. మరణం తర్వాత వేరో ప్రపంచానికి వెళ్తామా? లేదా చీకటి లోకంలోకి వెళ్లిపోతామా? లేదా మరేదైనా శరీరంలోకి వెళ్లిపోతామా.. ఇలా ఎన్నో సందేహాలు జనాల్లో ఉన్నాయి. అయితే, దాదాపు చావును చూసిన వచ్చిన కొందరు.. మరణం గురించి అనేక ఆసక్తికర విషయాలు చెప్పారు. తాజాగా నర్మా ఎడ్వార్డ్స్ అనే 80 ఏళ్ల పెద్దావిడ కూడా మరణం గురించి కొన్ని షాకింగ్ విషయాలు చెప్పింది. నర్మా ప్రత్యేకత ఏమిటంటే.. ఈమె ఏకంగా మూడుసార్లు చావును చూసి వచ్చింది.

ఎవరు ఈ నర్మా?

నర్మా ఎడ్వర్డ్స్.. అమెరికాలోని మేరీల్యాండ్‌లో నివసిస్తోంది. ఆమె ఓ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తోంది. ఆమె ఏకంగా మూడుసార్లు చనిపోయిందట. డాక్టర్లే ఈ విషయాన్ని కన్ఫార్మ్ చేశారట. అయితే.. ఆ మూడుసార్లు ఆమె మళ్లీ ఊపిరి పీల్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచిందట. అదంతా ఒకే.. కానీ, ఆమె ఆ మూడుసార్లు ఏం చూసిందో తెలిస్తే తప్పకుండా షాకవుతారు.

మొదటి మరణం.. 20 ఏళ్ల వయస్సులో..

Advertisement

నర్మా.. 20 ఏళ్ల వయస్సులోనే చనిపోయింది. ఆఫీసుకు వెళ్తూ మధ్య దారిలోనే కింద పడిపోయింది. ఆ తర్వాత ఆమె గుండె ఆగిపోయింది. స్థానికులు వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె కడుపులో చనిపోయిన శిశువు (పిండం)ను కనుగొన్నారు. దానివల్లే ఆమె రక్తం విషతుల్యం అయ్యిందని, అందుకే గుండె నొప్పి వచ్చి కుప్పకూలిందని డాక్టర్లు తెలిపారు. అప్పుడు తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పింది.

తెరపై జీవితం.. శరీరం కంటే ఆత్మే పెద్దదా?

‘‘అప్పుడు స్పృహ కోల్పోయాను. ఆ వెంటనే శరీరాన్ని వదిలి వెళ్లిపోతున్నట్లు అనిపించింది. ఆ తర్వాత హాస్పిటల్ సీలింగ్ నుంచి నా శరీరాన్ని నేను చూస్తున్నట్లుగా అనిపించింది. అప్పుడు నాకు ఏ నొప్పి కలగలేదు. ఆ తర్వాత ఒక చీకటి సొరంగం నుంచి అత్యంత వేగంగా.. తెల్లని వెలుగు వైపుకు వెళ్లా. అక్కడ ఒక పెద్ద తెరపై మూడు నిలువ వరుసల్లో నా జీవితం కనిపించింది. అందులో మొదటి భాగం నేను పుట్టక ముందు నా జీవితం ఎలా ప్లాన్ చేశారో కనిపించింది. రెండో దానిలో నా అసలైన జీవితం కనిపించింది. మూడో దానిలో నా జీవితం ఫలితం కనిపించింది. అందులో.. ‘‘నీవు పుట్టిన ఉద్దేశం నెరవేరలేదు’’ అనే సందేశం కనిపించింది. ఆ తర్వాత వ్యాధితో బాధపడుతోన్న మా పిన్ని కనిపించింది. తనని ముట్టుకోవద్దని తెలిపింది. ‘‘జీవితం చాలా విలువైనది.. మరణం దానికి అంతం కాదు’’ అంటూ మళ్లీ తిరిగి వెనక్కి పంపించింది. అయితే, తిరిగి శరీరంలోకి వెళ్లడం అంత ఈజీ కాదు. అది చాలా నొప్పి కలిగించింది. ఆ సమయంలో నా ఆత్మ నా శరీరం కంటే పెద్దగా అనిపించింది. మొత్తం విశ్వాన్ని ఒక టీకప్పులో బంధించారా అనే భావన కలిగింది’’ అని నర్మ వివరించింది.

శరీరానికి తిరిగి వచ్చిన తర్వాత..

Advertisement

శరీరానికి తిరిగి వచ్చిన తర్వాత.. తన ఇంద్రియాలు చాలా చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టాయని నర్మ తెలిపింది. ఆమె ఇతరుల శరీరం లోపల ఏం ఉందో చూడగలిగేదానిని అని పేర్కొంది. ఆ వ్యక్తులు నా దగ్గరకు వచ్చేప్పుడు బల్బులు పేలిపోయేవని చెప్పింది. నర్మ 2, 3 మరణాలు.. 2024లో చోటుచేసుకున్నాడు. అయితే, మూడో మరణంలో ఆమెను ఓ దేవదూత తీసుకెళ్తున్నట్లు కనిపించిందని చెప్పింది. అయితే, ప్రతిసారి తనకు ఒక సందేహం కనిపించేదని.. నీ పుట్టిన ఉద్దేశం పూర్తిగా నేరవేరలేదనేది దాని సారాంశమని పేర్కొంది. ఏది ఏమైనా మానవ పుట్టక.. మరణం చాలా చిత్రమైనవి కదూ.

Also Read: ఈ పక్షి ఉమ్ము ఖరీదు రూ.10 లక్షలకు పైనే.. లొట్టలేసుకుని మరీ తింటున్నారు!

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×