BigTV English

Hi-Tech City: హైటెక్ సిటీ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా..? సైబర్ టవర్స్  ప్రత్యేకత తెలిస్తే  ఆశ్చర్యపోతారు.

Hi-Tech City: హైటెక్ సిటీ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా..? సైబర్ టవర్స్  ప్రత్యేకత తెలిస్తే  ఆశ్చర్యపోతారు.

Hi-Tech City: హైటెక్‌ సిటీ అసలు పేరేంటో తెలుసా..? సైబర్‌ టవర్స్‌ ను హైటెక్‌ సిటీ అని ఎందుకు పిలవాల్సి వస్తుందో తెలుసా..? అసలు ఆ పేరులో ఉన్న అర్థం ఏంటో తెలుసా..? హైదరాబాద్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రూపు రేఖలనే మార్చేసిన హైటెక్‌ సిటీ ప్రత్యేకలు ఏంటో తెలుసా..? సైబర్‌ టవర్స్‌ నిర్మాణంలో ఉన్న స్పెషాలిటీ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.


వందల సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్‌ లో ఒకప్పుడు  చార్మినార్‌ అంటే ఎంతో ఫేమస్‌. భాగ్యనగరానికి చార్మినార్‌ ఐకానిక్‌గా నిలిచింది. ఎవరైనా హైదరాబాద్ వెల్లొచ్చామని చెబితే చార్మినార్‌ చూసొచ్చారా..? అనేంతలా హైదరాబాద్‌ సంస్కృతిలో పాతుకుపోయింది చార్మినార్‌. అంటువంటి చార్మినార్‌ చరిష్మాను తలదన్నే రీతిలో మాదాపూర్‌ దగ్గరలో పురుడుపోసుకున్నవే మనం ఇప్పుడు హైటెక్‌ సిటీగా పిలుస్తున్న సైబర్‌ టవర్స్‌. హైటెక్‌ సిటీ కి ఎంత పాపులారిటీ పెరిగిపోయిందంటే.. అంతకుముందు చార్మినార్‌ చూశారా అని అడిగే వాళ్లే హైటెక్‌ సిటీ చూశారా..? అనేంతలా ఫేమస్‌ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇప్పటి జనరేషన్స్‌లో చాలా మందికి హైటెక్‌ సిటీ తెలుసు కానీ చార్మినార్‌ తెలియకపోవడం గమనార్హం. అందుకే హైదరాబాద్‌ అంటే హైటెక్‌ సిటీ.. హైటెక్‌ సిటీ అంటే హైదరాబాద్ అనేంతలా మారిపోయాయి పరిస్థితులు .

సైబర్‌ విప్లవంలో హైదారబాద్ రూపురేఖలను మార్చేసింది హైటెక్‌ సిటీ. అందుకే దానికి అంత క్రేజ్‌. అయితే హైటెక్‌ సిటీ అనేది పేరు కాదు. షార్ట్‌ కట్‌ నేమ్‌. అవును మాదాపూర్‌ దగ్గర నిర్మించిన  సైబర్‌ టవర్స్‌కు పెట్టిన పేరు చాలా పెద్దదిగా ఉంటుంది. అంత పేరును ప్రతి సారి పిలవడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అదే పేరును షార్ట్‌ కట్‌ లో హైటెక్‌ సిటీగా పిలుస్తున్నారు. అయితే హైటెక్‌ సిటీ అంటే ‘హైదరాబాద్‌ ఇన్మఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇంజనీరింగ్ కన్సల్టేషన్స్‌ సిటీ’ ( Hyderabad information technology and engeeniring consultations city)  ఇదే పేరును షార్ట్‌ కట్‌లో  హైటెక్‌ సిటీ (HI TECH CITY) గా పిలుస్తున్నాం.. ఇదే పేరు చాలా ఫేమస్‌ అయింది.


సైబర్‌ టవర్స్‌ ప్రత్యేకలు:

  • 1998 నవంబర్‌ 28న హైటెక్‌ సిటీని అప్పటి మన ప్రధాని ఆటల్‌ బీహారీ వాజ్‌పేయ్‌ చేతుల మీదుగా ప్రారంభించబడింది.
  • హైటెక్‌ సిటీ నిర్మాణం మొత్తం 67 ఎకరాలో విస్తరించి ఉంటుంది.
  • కంన్‌స్ట్రక్షన్‌ మొదలు పెట్టిన 14 నెలల్లోనే సైబర్‌ టవర్‌ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభమైంది.
  • అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌ కీర్తిపతాను ఎగురవేసిన హైటెక్‌ సిటీ ప్రత్యేకలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
  • ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచిన పెద్ద పెద్ద ఐటీ కంపెనీలన్నీ తమ సేవలను హైటెక్‌ సిటీ కేంద్రంగా అందిస్తున్నాయి.
  • ఇప్పటికీ ఐటీ రంగానికి మరో సిలికాన్‌ సిటీగా నిలిచింది హైటెక్‌ సిటీ.
  • ఐటీకి కేరాఫ్‌ అడ్రస్‌ గా ఉన్న బెంగుళూరుకు ధీటుగా ఐటీ సేవలు అందిస్తున్నాయి మన హైటెక్‌ సిటీలోని  సైబర్‌ టవర్స్‌.
  • ఎన్నో లక్షల మంది ఔత్సాహికులను ఐటీ నిపుణులుగా మారుస్తుంది.
  • మన దేశంలోని ఉద్యోగులే కాకుండా విదేశాలకు చెందిన వ్యక్తులు కూడా ఇక్కడ ఐటీ నిపుణులుగా పని చేస్తున్నారు.
  • అనేక అంతర్జాతీయ సదస్సులకు వేదికగా మారింది హైటెక్‌ సిటీ.
  • ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందిన ప్రాంతంగా హైటెక్‌సిటీ గుర్తింపు తెచ్చుకుంది.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

Related News

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls| స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Big Stories

×