భూమి తిరగడం చాలా ముఖ్యం. మనుషుల జాతి అంతరించిపోకుండా ఉండాలంటే భూమి తన చుట్టు తాను తిరుగుతూ.. సూర్యుని చుట్టూ కూడా తిరగాల్సిందే. ప్రస్తుతం భూమి భ్రమణ వేగం పెరుగుతోంది. అంటే రాబోయే కాలంలో రోజులు తగ్గే అవకాశం ఉంది. ఒక్కసారి ఆలోచించండి… భూమి 5 సెకన్ల పాటూ తిరగకుండా ఆగిపోతే ఏమవుతుంది. ఇదే ప్రశ్న శాస్త్రవేత్తలను అడిగితే భయంతో వణికిపోతారు. ఎందుకంటే భూమి 5 సెకన్ల పాటు తిరగడం ఆగిపోతే మనుషుల జాతే అంతరించిపోవచ్చు.
భూమి ఎప్పుడు ఏర్పడింది?
భూమి సుమారు 400 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. దుమ్ము, వాయువు, మేఘాలు ఢీకొనడం వల్ల భూమి ఏర్పడిందని చెప్పుకుంటారు.ఆ ఢీకొట్టే ప్రక్రియలోనే భూమిలో పై వాతావరణాన్ని సృష్టించే భ్రమణ వేగం లభించిందని అంటారు. అంటే భూమి ఇలా తిరుగుతూ ఉండడం వల్లే మనం జీవించగలుగుతున్నాం. మనుషులు జీవించే వాతావరణము ఏర్పడుతోంది. అయితే భూమి తిరగడం ఆపివేస్తే అది విధ్వంసానికే కారణం అవుతుంది. ఎక్కువసేపు అవసరం లేదు.. కేవలం 5 సెకన్ల పాటు భూమి తిరగడం ఆగిపోయినా చాలు… మన జాతి అంతరించిపోతుంది.
భూమి ఆగిపోతే జరిగేది ఇదే
భూమి తిరగడం ఆగిపోయిన తర్వాత గాలులు గంటకు 1670 కిలోమీటర్ల వేగంతో వేస్తాయి. ఈ గాలి వల్ల తుఫానులు, వరదలు వస్తాయి. భూమి పై పెద్ద విధ్వంసమే జరుగుతుంది. గంటకు 511 కిలోమీటర్ల వేగంతో సుడిగాలులు, తుఫాన్లు వస్తాయి. భూమి తిరగడం ఆగిపోయిన వెంటనే భూమిపై ఉన్న నీరు, ఎత్తైన భవనాలు కాగితంలా పైకి ఎగరడం మొదలవుతాయి. ఏ ఒక్కరూ కూడా ప్రాణాలను కాపాడుకోలేరు.
భూమి తిరగడం ఆగిపోతే సముద్రపు నీరు ధృవాలవైపుకు దూసుకొస్తుంది. భయంకరమైన సునామీ ఏర్పడుతుంది. భూమి తిరగడం ఆగిపోతే నెట్వర్క్ లు, విద్యుత్తు, యంత్రాలు, అన్నీ నాశనం అయిపోతాయి. మానవాళికి అదే చివరి రోజు కూడా కావచ్చు. కాబట్టి భూమి ఎప్పటికీ ఆగిపోకూడదు. తన చుట్టూ, సూర్యుడు చుట్టూ తిరుగుతూనే ఉండాలి. అప్పుడే మనుషులు జీవించేందుకు కావలసిన వాతావరణం స్థిరంగా ఉంటుంది.