BigTV English

Lice Remedies: తల పేలతో నిండిపోయిందా? ఈ ఇంటి చిట్కాలు పాటించండి, పూర్తిగా పోతాయి

Lice Remedies: తల పేలతో నిండిపోయిందా? ఈ ఇంటి చిట్కాలు పాటించండి, పూర్తిగా పోతాయి

స్కూల్ కెళ్లే పిల్లలకు తలలో పేలు అధికంగా కనిపిస్తాయి. వర్షాకాలంలోనే ఈ పేలు గుడ్లను పెట్టి తమ సంతతిని వృద్ధి చేస్తాయి. కాబట్టి వానాకాలంలోనే పేలు కూడా అధికంగా కనిపిస్తాయి. అలాగే పేలు పెట్టిన గుడ్లు వెంట్రుకలపై అధికంగా ఉంటాయి. ఆ గుడ్ల నుంచి పేను పిల్లలు బయటకు వచ్చి విపరీతంగా తిరుగుతాయి. ఈ పేలు, పేల గుడ్లు చర్మం నుండి రక్తాన్ని పీల్చేస్తాయి. అక్కడ చర్మాన్ని గోకినట్టు చేస్తాయి. దీనివల్ల సమస్య పెరిగిపోతుంది. పాలను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. అది తలపై ఉన్న చర్మాన్ని పాడు చేస్తుంది. కాబట్టి కొన్ని ఇంటి చిట్కాలు ద్వారా పేలను తొలగించుకోవచ్చు. అక్కడున్న చర్మాన్ని కాపాడుకోవచ్చు. దీనికోసం ఏం చేయాలో తెలుసుకోండి.


ఉల్లిపాయ రసం
ప్రతి ఇంట్లోనూ ఉల్లిపాయలు ఉంటాయి. ఉల్లిపాయల నుంచి తీసే రసంతో పేలను, నిట్స్ ను తొలగించుకోవచ్చు. ఉల్లిపాయ రసాన్ని తలలోని మాడుకు తగిలేలా బాగా పట్టించాలి. అలాగే ఉల్లిపాయ ముద్దను కూడా తలకు కొంతవరకు పట్టించాలి. అలా అరగంట పాటు వదిలేయాలి. తర్వాత షాంపూ తో శుభ్రం చేసుకోవాలి. వారానికి నాలుగు సార్లు ఇలా చేస్తే పేలు తొలగిపోతాయి.

వెల్లుల్లి
వెల్లుల్లిలో కూడా బలమైన పేలను తొలగించే లక్షణాలు ఉన్నాయి. వెల్లుల్లి మిక్సీలో వేసి పేస్టులా చేయండి. దానిలో నిమ్మరసం కలపండి. ఈ మొత్తం మిశ్రమంలో గోరువెచ్చటి నీటిని కూడా వేయండి. ఇప్పుడు ఆ నీటితో మాడు మొత్తాన్ని తడపండి. వెల్లుల్లి పేస్టుని పేలు అధికంగా ఉన్నచోట రాయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మీ జుట్టును శుభ్రం చేసుకోండి. చాలావరకు పేలు తొలగిపోయే అవకాశం ఉంది.


టీ ట్రీ ఆయిల్
టీ ట్రీ ఆయిల్ మార్కెట్లలో లభిస్తుంది. పేలను వదిలించుకోవడానికి టీ ట్రీ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. రాత్రిపూట ఈ నూనెతో బాగా మసాజ్ చేసి అలా వదిలేయండి. ఉదయం పూట లేచాక తలకు స్నానం చేయండి. ఇలా వారంలో మూడు, నాలుగు సార్లు చేయడం వల్ల పేలు తొలగిపోయే అవకాశం ఎక్కువ.

వేపాకులు
వేప ఆకులను మిక్సీలో వేసి మెత్తగా నూరి పేస్టులా చేయాలి. దీన్ని తలకు బాగా పట్టించాలి. ఒక అరగంట పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత తేలిక పాటి షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే త్వరగా పేల బాధ తొలగిపోతుంది.

కర్పూరం
ప్రతి ఇంట్లోనూ కర్పూరం ఉంటుంది. కొబ్బరి నూనెలో కర్పూరం పొడిని వేసి బాగా కలపండి. ఆ కర్పూరం నుంచి వచ్చే ఘాటు వాసనను పేలు భరించలేవు. ఆ మొత్తం మిశ్రమాన్ని తలకు బాగా పట్టించండి. ఒక గంట పాటు అలా వదిలేయండి. తర్వాత జుట్టును శుభ్రం చేసుకోండి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే పేలు తొలగిపోవడం ఖాయం. బయట దొరికే రసాయనాలు వాడే బదులు ఇలా ఇంటి చిట్కాలను పాటిస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్టులు రాకుండా ఉంటాయి.

Related News

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Heart Health: హార్ట్ ఎటాక్స్ రాకూడదంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే ?

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Big Stories

×