E-Paper
Advertisement

WhatsAppలో బిగ్ ఛేంజ్.. హ్యాకర్లకు చెక్ పెట్టేలా ‘ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్‌’తో ఫుల్ ప్రొటెక్షన్!

WhatsAppలో బిగ్ ఛేంజ్.. హ్యాకర్లకు చెక్ పెట్టేలా ‘ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్‌’తో ఫుల్ ప్రొటెక్షన్!
Advertisement

WhatsApp Security Update: ఈ రోజుల్లో వాట్సప్ లేని స్మార్ట్‌ఫోన్ చూడటం కష్టం. పర్సనల్ చాటింగ్‌ల నుంచి బిజినెస్ లావాదేవీలు, బ్యాంకింగ్ అలర్ట్స్ వరకు అన్నీ దీని ద్వారానే జరుగుతున్నాయి. అయితే మన అకౌంట్ల సెక్యూరిటీ విషయంలో వాట్సప్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇప్పటివరకు ఉన్న 6 డిజిట్ల పిన్ ప్లేస్‌లో మరింత బలమైన పాస్‌వర్డ్ సిస్టమ్‌ను తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది.

ఎందుకీ మార్పు?

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ లాగిన్ అయ్యేటప్పుడు లేదా టూ-స్టెప్ వెరిఫికేషన్ కోసం కేవలం 6 అంకెల పిన్ సరిపోతుంది. అయితే ఈ సింపుల్ నెంబర్లను హ్యాక్ చేయడం లేదా అంచనా వేయడం సైబర్ నేరగాళ్లకు పెద్ద కష్టమేమీ కాదు. అందుకే అక్షరాలు, సంఖ్యలు, స్పెషల్ క్యారెక్టర్లతో కూడిన ‘ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్’ సదుపాయాన్ని తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. దీనివల్ల ఖాతాల హ్యాకింగ్, అకౌంట్ టేకోవర్ల ముప్పు చాలావరకు తగ్గుతుంది.

Advertisement

Also Read: ఊహించని ఫీచర్లు.. ఏకంగా 8000mAh బ్యాటరీతో Oppo K15 లాంచ్, ధర ఎంతంటే?

యూజర్లకు పూర్తి స్వేచ్ఛ..

సెక్యూరిటీ పెంచడం మంచిదే అయినా.. ప్రతిసారీ పాస్‌వర్డ్ టైప్ చేయడం కాస్త విసుగ్గా అనిపించవచ్చు. అందుకే వాట్సప్ ఈ ఫీచర్‌ను అందరిపై బలవంతంగా రుద్దడం లేదు. ఇది పూర్తిగా ఒక ఆప్షనల్ ఫీచర్‌గా మాత్రమే రానుంది. కావాలనుకునే వారు దీనిని సెట్ చేసుకోవచ్చు, లేదంటే సాధారణంగానే వాడుకోవచ్చు.

ఇతర కొత్త ఫీచర్లు కూడా..

Advertisement

కేవలం పాస్‌వర్డ్ వ్యవస్థే కాకుండా.. వాట్సప్ మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్లపై పనిచేస్తోంది. ఫోన్ నెంబర్‌తో పనిలేకుండా కేవలం ‘యూజర్ నేమ్’తో చాట్ చేసే ఆప్షన్ అందుబాటులోకి రానుంది. ఐఫోన్ యూజర్ల కోసం కాలింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరిచే ఫీచర్లు కూడా రాబోతున్నాయి.

అందుబాటులోకి ఎప్పుడంటే?

ప్రస్తుతానికి ఈ పాస్‌వర్డ్ ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉంది. బీటా యూజర్లకు కూడా ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. కాబట్టి.. అధికారికంగా లాంచ్ కావడానికి మరికొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోపు మీ అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే.. ప్రస్తుతం ఉన్న టూ-స్టెప్ వెరిఫికేషన్‌ను ఆన్ చేసుకుని, రికవరీ ఈ-మెయిల్ ఐడీని యాడ్ చేసుకోవడం ఉత్తమం.

Also Read: UPI యూజర్లకు గుడ్ న్యూస్.. నెట్‌వర్క్, పిన్ లేకుండానే పేమెంట్స్.. ఫోన్ అలా ట్యాప్ చేస్తే చాలు!

Related News

కేఫ్ స్టైల్ శాండ్‌విచ్ ఇంట్లోనే.. బెస్ట్ శాండ్‌విచ్ మేకర్స్ లిస్ట్ మీకోసం

తక్కువ ధరలో బెస్ట్ ఇయర్ బడ్స్ కావాలా? వీటిపై ఓ లుక్కేయండి!

రియల్‌మీ నుంచి అదిరిపోయే టీవీ..ఆఫర్ పోతే మళ్లీ రాదు

UPI యూజర్లకు గుడ్ న్యూస్.. నెట్‌వర్క్, పిన్ లేకుండానే పేమెంట్స్.. ఫోన్ అలా ట్యాప్ చేస్తే చాలు!

ఊహించని ఫీచర్లు.. ఏకంగా 8000mAh బ్యాటరీతో Oppo K15 లాంచ్, ధర ఎంతంటే?

పవర్‌ఫుల్ ప్రాసెసర్లతో POCO F9 సిరీస్.. సర్టిఫికేషన్ సైట్లలో లీకైన వివరాలు ఇవే!

మీ ఏరియాలో Airtel బ్రాడ్‌బ్యాండ్ ఉందో? లేదో? 2 నిమిషాల్లో చెక్ చేసుకోండిలా..

Big Stories

Advertisement
×