E-Paper
Advertisement

నిస్ప‌క్ష‌పాత‌మే ఊపిరిగా.. జ‌నామోద‌మే వార‌ధిగా.. బిగ్ టీవీ గ్రాండ్ రీ-లాంచ్‌!

నిస్ప‌క్ష‌పాత‌మే ఊపిరిగా.. జ‌నామోద‌మే వార‌ధిగా.. బిగ్ టీవీ గ్రాండ్ రీ-లాంచ్‌!
Advertisement

BIG TV Re-Launch: తెలుగు మీడియా రంగంలో బిగ్గెస్ట్ ఛేంజ్ దిశగా ఇకపై బిగ్ టీవీ (BIG TV) అడుగులు వేయనుంది. పార్టీలు, నాయకుల తరపున కాకుండా ప్రజల పక్షాన నిలిచే అసలైన మీడియా సంస్థగా అవతరించబోతోంది. మీడియా పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తి, అసహనాన్ని పారద్రోలి.. ‘ఇది కదా మీడియా నుంచి తాము కోరుకుంది’ అనేలా ఇకపై బిగ్ టీవీలో ప్రసారాలు ఉండబోతున్నాయి. ఇన్నాళ్లు మీడియాలో వస్తున్న ఏకపక్ష కథనాలు, మూసధోరణి వార్తలకు చెల్లుచీటి పలుకుతూ.. విభిన్నమైన రీతిలో, తెలుగు ప్రజలు కోరుకున్న విధంగా ‘బిగ్ టీవీ 2.0’ రాబోతోంది. ‘Without Fear Or Favour’ నినాదంతో తెలుగు మీడియా రంగంపై చెరగని ముద్రను వేసేందుకు ఆదివారం నుంచి తన సరికొత్త, వినూత్న ప్రయాణాన్ని మెుదలు పెట్టబోతోంది.

ఆదివారం నుంచే కొత్త ప్రయాణం

మీడియా రంగంలో బిగ్ టీవీ ఏది చేసినా సంచలనమే. దశాబ్దాల కాలంగా ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో పాతుకుపోయిన ఛానెళ్లను తట్టుకొని.. వెన్నం విజయ్ స్థాపించిన బిగ్ టీవీ అతి తక్కువ కాలంలోనే తెలుగు ప్రజల్లో ఆదరాభిమానాలు సంపాదించింది. పెద్ద పెద్ద మీడియా సంస్థలకు సాధ్యం కానీ రికార్డులను.. అతి కొద్ది కాలంలోనే తన పేరిట లిఖించుకుంది. తెలుగు ప్రజలు చూపిన ప్రేమ, ఆధరణను ఇప్పుడు మరో స్థాయికి తీసుకెళ్లబోతోంది బిగ్ టీవీ. సరికొత్త టెక్నాలజీతో వార్తలు, కథనాలు ప్రసారం చూసేందుకు వడి వడిగా అడుగులు వేస్తోంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి బిగ్ టీవీ సరికొత్తగా, మునుపెన్నడూ ఏ ఛానెళ్లలోనూ చూడని ఆధునిక సాంకేతికతతో వార్తలను ప్రసారం చేయబోతోంది.

బిగ్ టీవీ చీఫ్ ఎడిటర్ మాటల్లో..

Advertisement

‘ఇన్నాళ్లు మీ ఆలోచనలను వారెవరో ప్రభావితం చేశారు. మీరు ఎలా ఉండాలో వారే డిసైడ్ చేశారు. ఇకపై వాటికి బిగ్ టీవీ ముగింపు పలకబోతోంది’ అంటూ ఇకపై బిగ్ టీవీ ప్రయాణం ఏ విధంగా ఉండనుందో చీఫ్ ఎడిటర్ అశోక్ వేములపల్లి చెప్పకనే చెప్పారు. ప్రజలు ఎలాగైతో ఆలోచిస్తున్నారో అదే విధంగా వార్తల ప్రసారం ఉండబోతుందని స్పష్టం చేశారు. గత 20 ఏళ్ల మీడియా అనుభవంలో ఇవాళ బిగ్ టీవీ తీసుకొస్తున్న ఛేంజెస్ ఎప్పుడు ఎక్కడా చూడలేదని ఆయన పేర్కొనడం.. బిగ్ టీవీలో రాబోతున్న గొప్ప మార్పులకు అద్దం పడుతోంది.

ప్రజల తరపున మేమున్నాం

పార్టీలకు ప్రతినిధులు, నాయకులకు పీఆర్ (Public Relations) లు ఉన్నట్లుగానే ప్రజల గొంతుకగా ఇకపై బిగ్ టీవీ ఉండబోతుంది. బిగ్ టీవీ 2.0లో ప్రజల కేంద్రంగానే వార్తలు ఉండబోతున్నాయి. రాబోయో కొద్ది గంటల్లో అధికారానికి నిజమైన ప్రతిపక్షంగా బిగ్ టీవీ మారబోతోంది. ‘Without Fear OR Favour’ నినాదానికి పూర్తిగా కట్టుబడుతూ ప్రజల్లోని ప్రతీ ప్రశ్న.. బిగ్ టీవీ స్క్రీన్ పై చర్చకు రానుంది.

Advertisement

Also Read: బొద్దింక‌ల చేత‌జిక్కి … చేతులు కాలాక ఆకులు.. బద్నాం చేసిన పంతం..!

మీ నమ్మకాన్ని నిజం చేస్తాం

తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీని లక్షలాది మంది ప్రజలు ఆదరిస్తున్నారు. టీవీల ద్వారా వాళ్ల ఇళ్లలోకి ఆహ్వానిస్తారు. అయితే వారి అంచనాలు, ఆకాంక్షలు, నమ్మకాన్ని అందుకోవడంలో ప్రస్తుత మీడియా సంస్థలు ఎక్కడో వెనకడుగు వేశాయని చెప్పవచ్చు. అయితే ఆ నమ్మకాన్ని తిరిగి పొందే విధంగా ఇకపై బిగ్ టీవీలో వార్తా ప్రసారాలు ఉండనున్నాయి. నిజాలను ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా నిక్కచ్చిగా ప్రజల ముందు ఉంచేందుకు బిగ్ టీవీ 2.0 రాబోతోంది. తెరవెనుక ఉన్న అక్రమార్కులు, అవినీతి పరులను తవ్వితీసి మరి ప్రజల ముందు ఉంచేందుకు బిగ్ టీవీ రెడీ. మరి ఆదరించడానికి మీరు సిద్ధమేనా..!

Also Read: లవర్‌తో తోటి ఉద్యోగి ఫ్రెండ్ షిప్.. కట్ చేస్తే దారుణ హత్య.. ఇలా ఉన్నారేంట్రా బాబు!

Related News

మగపిల్లలే కాదు.. ఆడపిల్లలు కూడా…బిగ్ బాస్ ఝాన్సీ ఎమోషనల్!

‘వీసా స్కామ్ ‘.. మీడియాతో నందన కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే?

స్టేజ్ పై గొడవపడ్డ కృష్ణ భగవాన్, యమునా?

దిష్టి పెట్టకండి.. లావైపోతా.. అనసూయ వీడియో వైరల్!

బిగ్‌బాస్ ఓటింగ్.. ఎలిమినేషన్ కి దగ్గరగా ఆ ఇద్దరే!

బిగ్ బాస్ కి టాలెంట్ అక్కర్లేదా.. రిజెక్ట్ చేయడంతో నిజాలు బయటపెట్టిన రాజకుమారి!

బిగ్‌బాస్ హౌస్ గోడ దూకి పారిపోయిన కంటెస్టెంట్.. వీడియో వైరల్!

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి శృతి స్ట్రాంగ్ వార్నింగ్.. బాధపడ్డ మనోజ్.. గుణ దెబ్బకు రోహిణి అవుట్..

Big Stories

Advertisement
×