E-Paper
Advertisement

వాట్సప్ అకౌంట్ బ్యాన్ ఎందుకు అవుతుంది? రివ్యూ రిక్వెస్ట్ పెట్టి మళ్లీ పొందడం ఎలా?

వాట్సప్ అకౌంట్ బ్యాన్ ఎందుకు అవుతుంది? రివ్యూ రిక్వెస్ట్ పెట్టి మళ్లీ పొందడం ఎలా?
Advertisement

WhatsApp Account Recovery: ఈ రోజుల్లో వాట్సాప్ మన రోజువారీ జీవితంలో ఒక భాగమైపోయింది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం, ముఖ్యమైన సమాచారాన్ని షేర్ చేసుకోవడం.. ఇలా ఎన్నో పనులకు వాట్సప్‌పైనే ఆధారపడుతున్నాం. అలాంటి అకౌంట్ ఒక్కసారిగా బ్యాన్ అయితే పరిస్థితి ఏంటి? పాత చాట్స్, గ్రూపులతో పాటు మన రోజువారీ పనులకూ ఇబ్బంది ఎదురవుతుంది. అయితే వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందని వెంటనే కంగారుపడి కొత్త నంబర్ తీసుకోవాల్సిన పనిలేదు. కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా అకౌంట్‌పై రివ్యూ కోరే అవకాశం ఉంది. అసలు బ్యాన్ అయిన అకౌంట్‌ను తిరిగి పొందాలంటే ఏం చేయాలి? వాట్సప్‌లో రివ్యూ రిక్వెస్ట్ ఎలా పంపాలి? ఇప్పుడు తెలుసుకుందాం.

వాట్సాప్ బ్యాన్ అయితే ఏమవుతుంది?

అకౌంట్ బ్యాన్ అయినప్పుడు వాట్సప్ ఓపెన్ చేయగానే This account can’t use WhatsApp అనే మెసేజ్ కనిపిస్తుంది. దాని కింద బ్యాన్ వివరాలు, తర్వాత ఏం చేయాలో సూచనలు ఉంటాయి. అక్కడే Request review బటన్ కూడా కనిపించవచ్చు. బ్యాన్ ఉన్నంత వరకు ఇతరులు మీకు వ్యక్తిగతంగా లేదా గ్రూపుల్లో మెసేజ్‌లు పంపలేరు. 30 రోజుల పాటు అకౌంట్ అందుబాటులో లేకపోతే వాట్సప్ మిమ్మల్ని గ్రూపుల నుంచి తొలగించవచ్చు. పాత చాట్‌లో మీకు మెసేజ్ పంపేవారికి వాట్సప్‌కు ఆహ్వానించే సూచన కనిపించవచ్చు.

రివ్యూ కోసం ఎలా పంపాలి?

Advertisement

స్క్రీన్‌పై Request review బటన్ కనిపిస్తే దానిపై ట్యాప్ చేయండి. తర్వాత రివ్యూ ఎందుకు కోరుతున్నారో తెలిపే కొన్ని కారణాలు కనిపిస్తాయి. వాటిలో మీ సమస్యకు సరిపోయే కారణాన్ని ఎంచుకుని, మళ్లీ Request review బటన్ నొక్కాలి. రిక్వెస్ట్ పంపుతున్నట్లు మెసేజ్ కనిపించిన తర్వాత, అకౌంట్ రివ్యూ కోసం వేచి ఉండాలి. ఆ తర్వాత స్క్రీన్‌పై గడియారం గుర్తు కనిపిస్తే మీ అప్పీల్ పరిశీలనలో ఉందని అర్థం.

Also Read: మోటరోలా మాస్టర్ స్ట్రోక్.. ఏకంగా రూ.6,000 తగ్గింపుతో 7000mAh బ్యాటరీ ఫోన్ భారత్‌లో లాంచ్!

రివ్యూ ఫలితం ఎప్పుడు వస్తుంది?

Advertisement

వాట్సప్ 24 గంటల్లో రివ్యూ ఫలితం చెబుతామని పేర్కొంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఎక్కువ సమయం పట్టవచ్చు. రివ్యూ పూర్తయినప్పుడు ఫోన్‌కు నోటిఫికేషన్ వస్తుంది. బ్యాన్ తొలగిస్తే Verify account ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకుని మీ మొబైల్ నంబర్‌తో మళ్లీ లాగిన్ అవ్వాలి. అప్పీల్ తిరస్కరణకు గురైతే యాప్‌లో చూపించే సూచనలను అనుసరించాలి. ఒక అకౌంట్‌కు ఒకేసారి ఒక అప్పీల్ మాత్రమే పంపగలరు. కాబట్టి.. మళ్లీ మళ్లీ రిక్వెస్ట్ పంపి త్వరగా ఫలితం వస్తుందని ఆశించకండి.

యాప్‌ను తొలగించకూడదు:

బ్యాన్ వచ్చిన వెంటనే వాట్సప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయకండి. అలా చేస్తే ఫోన్‌లో సేవ్ అయిన లోకల్ బ్యాకప్ పోయే అవకాశం ఉంది. గతంలో గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌లో బ్యాకప్ ఉంటే తర్వాత చాట్స్‌ను తిరిగి పొందవచ్చు. అందుకే రివ్యూ ఫలితం వచ్చే వరకు యాప్‌ను అలాగే ఉంచడం మంచిది. Request review బటన్ కనిపించకపోతే.. యాప్‌లోని సహాయ సూచనలను పరిశీలించండి. కొత్త నంబర్‌తో అకౌంట్ ప్రారంభించే ముందు పాత అకౌంట్‌పై అందుబాటులో ఉన్న సహాయ మార్గాలను ప్రయత్నించండి.

Also Read: ఐఫోన్ డేటా ఆండ్రాయిడ్‌లోకి మార్చడం ఇంత ఈజీనా? కేబుల్‌తో పనిలేకుండా సేఫ్‌గా ట్రాన్స్‌ఫర్ చేయండిలా!

Tags

Related News

రూ.902కే స్మార్ట్‌వాచ్..తక్కువ ధరకే పిచ్చెక్కించే ఫీచర్లు!

మోటరోలా మాస్టర్ స్ట్రోక్.. ఏకంగా రూ.6,000 తగ్గింపుతో 7000mAh బ్యాటరీ ఫోన్ భారత్‌లో లాంచ్!

వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఇంతకంటే..మంచి హెడ్‌ఫోన్స్ ఉంటాయా?

ఐఫోన్ డేటా ఆండ్రాయిడ్‌లోకి మార్చడం ఇంత ఈజీనా? కేబుల్‌తో పనిలేకుండా సేఫ్‌గా ట్రాన్స్‌ఫర్ చేయండిలా!

రూ.20 వేల నుంచే బెస్ట్ పర్ఫార్మెన్స్.. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో టాప్-5 శాంసంగ్ ఫోన్లు ఇవే!

2027లో యాపిల్ సంచలనం.. ఒకేసారి మార్కెట్లోకి రాబోతున్న 6 కొత్త గాడ్జెట్స్ ఇవే!

భూమికి కవల గ్రహం.. శుక్రుడిపై ఒక రోజు గడిపారో.. మీకు కనిపించే వింతలు ఇవే!

Big Stories

Advertisement
×