Kamran Akmal On Vaibhav: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026 ) సందర్భంగా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi ) డబుల్ సెంచరీ చేయడంపై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ (Kamran Akmal On Vaibhav) కీలక వ్యాఖ్యలు చేశాడు. 52 బంతుల్లో 200 పరుగులు సాధించడం అంటే మామూలు విషయం కాదని మెచ్చుకున్నాడు. తన శత్రుదేశం అయినప్పటికీ అతన్ని పొగడకుండా ఉండలేకపోతున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
యూఏఈ ఇలాంటి పసికూనపై ట్రైలర్ మాత్రమే చూపించాడని… ఫైనల్స్ లో పాకిస్తాన్ కు సినిమా చూపిస్తాడేమో అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వైభవ్ సూర్యవంశీని తలుచుకుంటే వెన్నులో వణుకు పుడుతోందని వెల్లడించాడు. తమ పాకిస్తాన్ బౌలర్లు రేపు ఫైనల్స్ లో వైభవ్ సూర్యవంశీని ఎలా ఎదుర్కొంటారనే భయం ఇప్పటినుంచే స్టార్ట్ అయిందని స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఇండియన్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రకృతి సృష్టించిన అద్భుతమంటూ పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ వెల్లడించాడు. అతన్ని ఎంత బాగా వాడుకుంటే అంత మంచిదని… మరో 10 ఏళ్ల పాటు టీమిండియాలో పాతుకుపోయే వ్యక్తి అంటూ వ్యాఖ్యానించాడు. ఒకప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ ను చూసామని.. ఇప్పుడు అతని కంటే భయంకరమైన ఆటగాడు వైభవ్ రూపంలో ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ఒకే ఇన్నింగ్స్ లో 28 సిక్సర్లు బాదడం అంటే ఏ మాత్రం నమ్మశక్యంగా లేదని తెలిపారు.
లిస్ట్ ఏ క్రికెట్ లో ఇంత భయంకరమైన ఇన్నింగ్స్ తాను ఎప్పుడూ చూడలేదని.. అతడు సాధించిన రికార్డులను ఎవరు బ్రేక్ చేయలేరని తెలిపాడు పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్. ఇక ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో టీమిండియా, పాకిస్తాన్ తలపడడం గ్యారెంటీ అన్నాడు. బంగ్లాపై పాకిస్తాన్… శ్రీలంకపై టీమిండియా సెమీ ఫైనల్స్ లో గెలుస్తాయని అంచనా వేశాడు. ఆదివారం రోజున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్ జరుగుతుందని.. ఆ సమయంలో వైభవ్ ను త్వరగా ఔట్ చేసేలా పాకిస్తాన్ బౌలర్లు రంగం సిద్ధం చేసుకోవాలని కోరాడు. ప్లాన్ లేకుండా వస్తే, ప్యాంట్లు తడిపేస్తాడని హెచ్చరించాడు. పాకిస్తాన్ పై వైభవ్ సూర్యవంశీకి పెద్దగా రికార్డులు లేకపోయినా, అతడు టచ్ లోకి వస్తే ఆపడం ఎవడి తరం కాదని వార్నింగ్ ఇచ్చాడు.