E-Paper
Advertisement

వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఇంతకంటే..మంచి హెడ్‌ఫోన్స్ ఉంటాయా?

వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఇంతకంటే..మంచి హెడ్‌ఫోన్స్ ఉంటాయా?
Advertisement

Jabra Evolve 3 85 review: ప్రస్తుత కాలంలో ఆఫీస్ మీటింగ్‌లు, వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం నాణ్యమైన హెడ్‌ఫోన్స్ తప్పని సరిగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆడియో బ్రాండ్ జబ్రా తన కొత్త ‘జబ్రా ఎవాల్వ్ 3 85’ హెడ్‌ ఫోన్స్‌ను మార్కెట్లోకి తెచ్చింది. కేవలం ఆఫీస్ కాల్స్ కోసమే కాకుండా..మ్యూజిక్ వినడానికి, ప్రయాణాల్లో ఉపయోగించడానికి కూడా ఇవి ఎంతో అనుకూలంగా ఉన్నాయి. అద్భుతమైన నాయిస్ క్యాన్సిలేషన్, బెస్ట్ బ్యాటరీ లైఫ్‌తో వస్తున్న ఈ ప్రీమియం హెడ్‌ఫోన్స్ పూర్తి రివ్యూ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రొఫెషనల్ ఆడియో డివైజ్‌ల తయారీలో జబ్రా సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా కార్పొరేట్ ఉద్యోగులు, రిమోట్ వర్కర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ‘ఎవాల్వ్’ సిరీస్‌కు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఆ సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ మోడల్ కేవలం ఒక వర్క్ హెడ్‌సెట్‌గా మాత్రమే కాకుండా,..ఆల్-రౌండ్ ప్రీమియం హెడ్‌ఫోన్స్‌గా యూజర్లను ఆకట్టుకుంటోంది.

పూర్తి ఫీచర్లు:

డిజైన్,కంఫర్ట్:

Advertisement

జబ్రా ఎవాల్వ్ 3 85 చూడటానికి చాలా స్టైలిష్‌గా, ప్రీమియం లుక్‌తో కనిపిస్తుంది. సాధారణంగా ఆఫీస్ హెడ్‌సెట్‌లకు బయటకు కనిపించే పెద్ద బూమ్ మైక్ ఉంటుంది. కానీ ఈ మోడల్‌లో.. అవసరమైనప్పుడు బయటకు తీసి, పని అయిపోయాక హెడ్‌ ఫోన్‌లో దాచే విధంగా ‘హైడబుల్ బూమ్ ఆర్మ్’డిజైన్‌ను ఇచ్చారు. దీని వల్ల మీరు బయట ప్రయాణించేటప్పుడు లేదా సంగీతం వినేటప్పుడు సాధారణ లైఫ్‌స్టైల్ హెడ్‌ఫోన్స్‌లా వీటిని వాడుకోవచ్చు. ఇయర్ కప్స్‌పై మెమరీ ఫోమ్ కుషన్లు ఉండటం వల్ల గంటల తరబడి పెట్టుకున్నా చెవులకు ఎలాంటి నొప్పి లేదా ఇబ్బంది కలగదు.

మైక్రోఫోన్ ,కాల్ క్వాలిటీ:

ఈ హెడ్‌ఫోన్స్ ప్రధాన బలం దీని మైక్రో ఫోన్ టెక్నాలజీ. ఇందులో.. ఏకంగా 10 మైక్రోఫోన్‌లను ఉపయోగించారు. మీరు రద్దీగా ఉండే ప్రదేశంలో ఉన్నా లేదా ఇంట్లో పిల్లల అల్లరి మధ్య మీటింగ్‌లో ఉన్నా, ఎదుటి వారికి మీ గొంతు మాత్రమే స్పష్టంగా వినిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ ఏఐ సహాయంతో ఇది సమర్థవంతంగా ఫిల్టర్ చేస్తుంది. మైక్రో సాఫ్ట్ టీమ్స్, జూమ్ వంటి ప్లాట్‌ ఫామ్‌లకు ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.

యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, సౌండ్ క్వాలిటీ:

Advertisement

జబ్రా ఎవాల్వ్ 3 85లో అడ్వాన్స్‌డ్ డిజిటల్ హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. ఇది చుట్టుపక్కల ఉండే.. ఏసీ సౌండ్స్, ట్రాఫిక్ లేదా ఆఫీస్ గోలను పూర్తిగా నియంత్రిస్తుంది. అలాగే..అవసరమైనప్పుడు చుట్టు పక్కల మాటలు వినడానికి ‘హియర్ త్రూ’మోడ్ కూడా ఉంది. ఇక సౌండ్ క్వాలిటీ.. విషయానికి వస్తే, ఇందులోని 40mm స్పీకర్లు చాలా రిచ్ ఆడియోను అందిస్తాయి. కేవలం ..వాయిస్ కాల్స్ మాత్రమే కాకుండా, సినిమాలు చూసేటప్పుడు, పాటలు వినేటప్పుడు కూడా మంచి బేస,క్లారిటీ లభిస్తుంది.

బ్యాటరీ లైఫ్,కనెక్టివిటీ:

బ్యాటరీ విషయంలో ఈ హెడ్‌ ఫోన్స్ అద్భుతంగా పనిచేస్తాయి. దీనిని ఒక్క సారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, ANC ఆఫ్‌లో ఉన్నప్పుడు సుమారు 37 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అత్యవసర సమయాల్లో.. కేవలం 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 8 గంటల పాటు ఉపయోగించుకోవచ్చు. బాక్స్‌తో.. పాటు ఛార్జింగ్ స్టాండ్ కూడా లభిస్తుంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.3 సపోర్ట్ ఉంది. ఒకే సారి ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ రెండింటికీ కనెక్ట్ చేసుకునే మల్టీపాయింట్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఇందులో ఉంది. హెడ్‌ఫోన్స్ పక్కన ఉండే ‘బిజీ లైట్’మీరు కాల్‌లో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా వెలుగుతూ ఇతరులకు సిగ్నల్ ఇస్తుంది.

ధర:

జబ్రా ఎవాల్వ్ 3 85 ధర కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ.. అది అందించే ఫీచర్లు, బిల్డ్ క్వాలిటీ, క్వాలిటీతో పోలిస్తే పూర్తి న్యాయం చేస్తుంది. రోజు వారీ ఆఫీస్ మీటింగ్‌లు ఎక్కువగా ఉండే.. వారికి, కస్టమర్ సపోర్ట్ జాబ్స్ ,ప్రయాణాలు ఎక్కువగా చేసే వారికి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్.

Related News

మోటరోలా మాస్టర్ స్ట్రోక్.. ఏకంగా రూ.6,000 తగ్గింపుతో 7000mAh బ్యాటరీ ఫోన్ భారత్‌లో లాంచ్!

ఐఫోన్ డేటా ఆండ్రాయిడ్‌లోకి మార్చడం ఇంత ఈజీనా? కేబుల్‌తో పనిలేకుండా సేఫ్‌గా ట్రాన్స్‌ఫర్ చేయండిలా!

రూ.20 వేల నుంచే బెస్ట్ పర్ఫార్మెన్స్.. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో టాప్-5 శాంసంగ్ ఫోన్లు ఇవే!

2027లో యాపిల్ సంచలనం.. ఒకేసారి మార్కెట్లోకి రాబోతున్న 6 కొత్త గాడ్జెట్స్ ఇవే!

భూమికి కవల గ్రహం.. శుక్రుడిపై ఒక రోజు గడిపారో.. మీకు కనిపించే వింతలు ఇవే!

హోటల్‌లో అడుగుపెట్టగానే ఈ పని చేయండి.. సీక్రెట్ కెమెరాలు ఉన్నాయో లేదో తెలిసిపోతుంది!

5G ఫోన్ వాడుతున్నా ఇంకా 4G సిగ్నలే వస్తోందా? ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

Big Stories

Advertisement
×