Melbon H9 Smartwatch: ప్రస్తుత కాలంలో స్మార్ట్ వాచ్ అనేది.. కేవలం టైం చూడటానికి మాత్రమే కాకుండా, మన ఆరోగ్యాన్ని, ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ఒక ముఖ్యమైన గాడ్జెట్‌గా మారిపోయింది. అయితే.. మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్‌వాచ్ కొనాలంటే ..వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ, మీ బడ్జెట్‌కు ఏమాత్రం భారం కాకుండా కేవలం రూ.902 ధరలోనే.. అద్భుతమైన ఫీచర్లతో లేటెస్ట్ మోడల్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. బ్లూటూత్ కాలింగ్, హెల్త్ ట్రాకింగ్, స్టైలిష్ గ్రే స్ట్రాప్‌తో వస్తున్న.. ఈ వాచ్ పూర్తి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఏదైనా గాడ్జెట్ కొనేటప్పుడు ముందుగా దాని లుక్ , డిజైన్‌ను పరిశీలిస్తాము.ఈ మోడల్ స్మార్ట్‌వాచ్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, ప్రీమియం లుక్‌తో కనిపిస్తుంది. దీనికి అందించిన గ్రే కలర్ స్ట్రాప్ యూత్, పెద్ద వారు.. ఇద్దరికీ బాగా నప్పుతుంది. ఇది ఫ్రీ సైజ్ కావడం వల్ల ఎవరి మణికట్టుకైనా ఈజీగా, సౌకర్యవంతంగా ఉంటుది. అంతే కాకుండా ఇది తక్కువ బరువు ఉండటం వల్ల రోజంతా చేతికి ధరించినా ఎలాంటి ఇబ్బంది కలగదు. మీ మూడ్ లేదా మీరు వేసుకునే డ్రెస్ తగ్గట్టుగా మార్చుకోవడానికి ఇందులో మల్టిపుల్ వాచ్ ఫేసెస్ అవకాశం ఉంది.
రూ.1,000 లోపు ధరలో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ రావడం అనేది.. ఈ వాచ్‌కు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్. ఈ స్మార్ట్ వాచ్‌లో బిల్ట్-ఇన్ మైక్రోఫోన్, స్పీకర్ ఉన్నాయి. మీ స్మార్ట్ ఫోన్‌ను బ్లూటూత్ ద్వారా వాచ్‌కు కనెక్ట్ చేయడం వల్ల, ఫోన్ జేబులో ఉన్నా సరే.. నేరుగా వాచ్ నుంచే కాల్స్ మాట్లాడొచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు, ప్రయాణాల్లో.. ఉన్నప్పుడు లేదా వ్యాయామం చేసే సమయంలో.. ఫోన్ తీయాల్సిన అవసరం లేకుండానే కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడేందుకు ఇది ఎంతో ఉపయోగ పడుతుంది.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వాచ్‌లో కీలకమైన హెల్త్ సెన్సార్లను ఇచ్చారు.
హార్ట్ రేట్ మానిటర్: ఇది మీ గుండె స్పందనను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది.
SpO2 మానిటర్: రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను పరీక్షించుకోవడానికి ఇందులో SpO2 సెన్సార్ అందుబాటులో ఉంది.
స్లీప్ మానిటర్ : మీరు రాత్రిపూట ఎంతసేపు నిద్ర పోతున్నారు, మీ నిద్ర నాణ్యత ఎలా ఉంది అనే వివరాలను ఇది విశ్లేషిస్తుంది.
రోజూ వాకింగ్, రన్నింగ్ లేదా జిమ్ చేసేవారి కోసం ఇందులో.. అద్భుతమైన ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. మీరు వేసే అడుగులు, ఖర్చు చేసిన కేలరీలు, ప్రయాణించిన దూరాన్ని ఇది ఖచ్చితంగా లెక్కిస్తుంది. అలాగే.. మీ ఫోన్‌కు వచ్చే వాట్సాప్ మెసేజ్‌లు, ఎస్ఎంఎస్, ఇతర సోషల్ మీడియా నోటిఫికేషన్లను నేరుగా వాచ్ స్క్రీన్‌పైనే చూసుకోవచ్చు.
సాధారణ వాడకంలో.. ఈ స్మార్ట్‌వాచ్ మంచి బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు రకాల స్మార్ట్ ఫోన్‌లకు ఇది సపోర్ట్ చేస్తుంది.
మీరు రూ.1,000 లోపు బడ్జెట్‌లో ..ఒక మంచి స్మార్ట్‌వాచ్ కొనాలని చూస్తున్నట్లయితే..రూ.902 ధరలో.. లభిస్తున్న ఈ మోడల్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. తక్కువ ధరలోనే బ్లూటూత్ కాలింగ్, హార్ట్ రేట్, SpO2, స్లీప్ మానిటర్ ,స్టైలిష్ గ్రే స్ట్రాప్ వంటి ఫీచర్లు కోరుకునే వారికి ఇది ఖచ్చితంగా ‘వాల్యూ ఫర్ మనీ’ గ్యాడ్జెట్.