E-Paper
Advertisement

రూ.2,000 కోట్ల క్లబ్‌పై రామాయణ కన్ను.. సాధ్యమేనా?

రూ.2,000 కోట్ల క్లబ్‌పై రామాయణ కన్ను.. సాధ్యమేనా?
Advertisement

Ramayana Box Office:‘రామాయణ’..’రామాయణ’..’రామాయణ’..ఇపుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే తెగ డిబేట్లు నడుస్తున్నాయి.ఇప్పటికే రూ.1,700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు రూ.2,000 కోట్ల బెంచ్ మార్క్ ని టచ్ చేస్తుందా లేదా అన్న క్యూరియాసిటీ ఆడియన్స్ లో పెరిగిపోయింది.

రణ్‌బీర్ కపూర్, యష్, సాయిపల్లవి లాంటి స్టార్ క్యాస్టింగ్, నితేష్ తివారీ దర్శకత్వం, నమిత్ మల్హోత్రా భారీ స్పాన్ లో సినిమాని తీసిన తీరు,అన్నీ కలిసి సినిమాకి వరల్డ్ వైడ్ గా అదిరిపోయే రెస్పాన్స్ ని తీసుకొచ్చింది.అలా కేవలం ఒక్క ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడం ఇక్కడ విశేషం.

Advertisement

ఇక ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ 19 రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1,700 కోట్ల గ్రాస్ వసూలు చేసిందన్న టాక్ వినిపిస్తుంది.ఇందులో ఒక్క ఇండియా నుంచే రూ.1,1OO కోట్ల పై చిలుకు వసూల్లని కొల్లగొట్టగా ఓవర్సీస్‌లో దాదాపు రూ.500 కోట్లపై చిలుకు వసూలు చేసిందని సమాచారం.ముఖ్యంగా ఈ సినిమాకి హిందీ బెల్ట్ బాగా ప్లస్ అయిందని చెప్పాలి.ఇక తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లోనూ సాలిడ్ వసూల్లని రాబట్టి సత్తా చాటింది.

అయితే రూ.2,000 కోట్ల క్లబ్‌లో చేరాలంటే ఈ సినిమా ఇంకా రూ.265 కోట్లు వసూలు చేయాలి.కాని ప్రస్తుతం రాబడుతున్న వసూల్లని చూస్తే మాత్రం 2,000 కోట్లకు వెళ్లడం మాత్రం కాస్త కష్టమనే చెప్పాలి.. ఎందుకంటే మూడు వారాలు పూర్తవుతున్న థియేటర్ లో ఆక్యూపెన్సి తగ్గడం సహజం.

Advertisement

అయినా సరే, రామాయణం లాంటి కథకు ఉన్న క్రేజ్, సినిమాలోని గ్రాండ్ విజువల్స్, ముఖ్యంగా యష్ పోషించిన పాత్రపై ఉన్న క్యూరియాసిటీ లాంగ్ రన్‌లో సినిమాకు బాగా హెల్ప్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉందని చెప్పాలి. గతంలో దంగల్, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, పుష్ప 2 లాంటి సినిమాలు గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర మన సత్తా ఏంటో చూపించాయి కూడా.

ఇప్పుడు రామాయణ కూడా ఆ లిస్ట్‌లో చేరేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. రాబోయే రోజుల్లో ఇండియాతో పాటు ఓవర్సీస్‌లోనూ ఇదే జోరు కొనసాగితే రూ.2,000 కోట్ల రికార్డును అందుకోవడం అసాధ్యమేమీ కాదు. మరి ఈ సినిమా రూ.1,800 కోట్ల దగ్గరే ఆగిపోతుందా, లేక మరో రూ.200 కోట్లకు పైగా రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టిస్తుందా అన్నది మరికొద్ది రోజులు ఆగితే కాని తెలిసేలా లేదు !

ALSO READ:నర్సన్నా.. నన్ను కూడా సీఎం చేస్తావా? శర్వానంద్ కామెంట్స్ వైరల్!

Tags

Related News

నర్సన్నా.. నన్ను కూడా సీఎం చేస్తావా? శర్వానంద్ కామెంట్స్ వైరల్!

శోభిత షేర్ చేసిన ఫొటోకు నెటిజన్లు ఫిదా.. క్యాప్షన్ కూడా అంతే స్పెషల్!

సొగసుల సుందరి కాజల్.. 40ల్లో కూడా హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తూ!

కాక వెనక్కి.. విశ్వంభర ముందుకు.. సంక్రాంతికి చిరు సర్‌ప్రైజ్!

అంచనాలు పెంచేస్తున్న వృషకర్మ.. ట్రైలర్‌తో అసలు విషయం బయటపడనుందా?

కాయదు లోహర్ ప్రేమలో పడిందా..? అస్సలు నిజం ఏంటంటే..?

ఫరియా అబ్దుల్లా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Big Stories

Advertisement
×