WhatsApp New Feature: వాట్సాప్ రోజురోజుకు కొత్త ఫీచర్‌లను పరిచయం చేస్తూ, యూజర్లకు మరింత కొత్త అనుభవాన్ని అందిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల Meta కంపెనీ WhatsApp స్టేటస్ కోసం ఓ కొత్త మ్యూజిక్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా, యూజర్లు తమ స్టేటస్ లకు మ్యూజిక్ క్లిప్‌లను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది Instagram స్టోరీ మ్యూజిక్ ఫీచర్ మాదిరిగా ఉంటుందని చెప్పవచ్చు.
మరింత ఆహ్లాదకరంగా
WhatsApp స్టేటస్ ఎల్లప్పుడూ స్నేహితులు, కుటుంబ సభ్యులతో మీ జీవితంలోని ముఖ్యమైన క్షణాలను పంచుకోవడానికి ఉపయోగపడే ఫీచర్. ఇప్పుడు, మ్యూజిక్ యాడ్ చేయడం ద్వారా మీ స్టేటస్‌ను మరింత ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చని మెటా వెల్లడించింది.
ఫీచర్ ప్రత్యేకతలు
WhatsApp మ్యూజిక్ స్టేటస్: యూజర్లు తమ స్టేటస్ అప్‌డేట్‌లకు 15 సెకన్ల పాటు క్లిప్‌ను యాడ్ చేసుకోవచ్చు. (ఫోటోల కోసం), 60 సెకన్ల పాట క్లిప్‌ను యాడ్ చేసుకోవచ్చు. (వీడియోల కోసం).
ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్: స్టేటస్‌లో పంచుకున్న సంగీతం పూర్తిగా ప్రైవేట్. అంటే, ఈ పాటలను కేవలం మీ పరిచయ వ్యక్తులు మాత్రమే చూడగలరు, WhatsApp స్వయంగా వీటిని చూడదు.
మ్యూజిక్ లైబ్రరీ: యాప్‌లో లైసెన్స్ పొందిన పాటల లైబ్రరీ అందుబాటులో ఉంటుంది. అయితే, కొన్ని పాటలు అందుబాటులో లేకపోవచ్చు.
ప్లేస్‌మెంట్ కంట్రోల్: మ్యూజిక్ స్టిక్కర్‌ను స్టేటస్‌లో ఎక్కడ పడితే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు.
ఇన్‌స్టాగ్రామ్ మ్యూజిక్ ఫీచర్‌లాగా: స్టేటస్‌కు పాటలను యాడ్ చేయడం Instagram స్టోరీ మ్యూజిక్ ఫీచర్‌ను గుర్తు చేస్తుంది, అయితే WhatsApp గోప్యతను కాపాడేలా దీన్ని రూపొందించింది.
Read Also: Gold Vs Silver: బంగారంను మించిపోయిన వెండి..ఈ టైంలో 99 వేలకు …
స్టేటస్‌కు మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలంటే..
-WhatsApp ఓపెన్ చేయండి Updates’ (అప్‌డేట్స్) ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
-‘Add Status’ (అడ్ స్టేటస్) అని కనిపించే కెమెరా ఐకాన్‌పై క్లిక్ చేయండి
-మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటో లేదా వీడియో ఎంచుకోండి లేదా కొత్తదాన్ని క్లిక్ చేయండి.
-పైన కనిపించే మ్యూజిక్ ఐకాన్‌పై నొక్కండి – ఇది పాటల లైబ్రరీకి లింక్ చేస్తుంది
-ఆ క్రమంలో మీకు నచ్చిన పాటను ఎంచుకోండి. అందులో మీకు కావాల్సిన భాగాన్ని సెలెక్ట్ చేసుకోండి.
-15 సెకన్ల పాట క్లిప్‌ను (ఫోటో స్టేటస్ కోసం) లేదా 60 సెకన్ల పాట క్లిప్‌ను (వీడియో స్టేటస్ కోసం) ఎంచుకోండి.
-స్టేటస్‌లో పాటను ఎక్కడ ప్లేస్ చేయాలో ఎడిట్ చేయండి.
-‘Post’ (పోస్ట్) బటన్ నొక్కి, మీ మ్యూజిక్ స్టేటస్‌ను పబ్లిష్ చేయండి.
WhatsApp మ్యూజిక్ ఫీచర్ అందుబాటులో ఎక్కడ?
WhatsApp ఈ కొత్త మ్యూజిక్ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసింది. కొంతమంది యూజర్లకు ఇది ఇప్పటికే అందుబాటులో ఉండగా, మరికొందరికి త్వరలోనే రానుంది. మీకు ఇంకా ఈ ఫీచర్ కనిపించకపోతే, WhatsApp అప్డేట్ చేసుకోండి.
ఇతర ఫీచర్‌లతో పోల్చితే?
WhatsAppలో కొత్తగా వచ్చిన మ్యూజిక్ స్టేటస్ ఫీచర్ Instagram మ్యూజిక్ స్టోరీస్‌కు దగ్గరగా ఉంటుంది. అయితే, ఇందులో ఉన్న ప్రధాన తేడా గోప్యత (Privacy). Instagramలో షేర్ చేసే పాటలు అందరికీ కనిపిస్తాయి, కానీ WhatsAppలో మాత్రం మీ కాంటాక్ట్స్ మాత్రమే చూడగలరు. ఇది ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వల్ల సాధ్యమైంది.