Ugadi Investment: ఉగాది పండుగ అంటే కొత్త ఆరంభాలకు ప్రతీక. ఈ శుభ సందర్భంగా, మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. ఈ క్రమంలో మీ కుటుంబంలో 5 ఏళ్ల పాపకు ఉగాది కానుకగా మంచి భవిష్యత్తును అందించాలనుకుంటే సుకన్య సమృద్ధి యోజన (SSY) స్కీం బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ స్కీం ప్రత్యేకంగా బాలికల కోసం రూపొందించబడింది. దీనిలో అధిక వడ్డీ రేటు, పన్ను మినహాయింపులు, ఆర్థిక భద్రత లభిస్తుంది.
భవిష్యత్ అవసరాల కోసం
మీ పాప చిన్న వయస్సులో ఈ ఖాతాను ప్రారంభించడం వల్ల మంచి వృద్ధి రేటు లభిస్తుంది. ఈ స్కీం ద్వారా వచ్చే మొత్తాన్ని మీ పిల్లల చదువు, వివాహం వంటి భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ స్కీంలో 5 ఏళ్ల వయస్సున్న పాప కోసం ప్రతి సంవత్సరం రూ. 1,50,000 ఇన్వెస్ట్ చేస్తే, చివరకు ఎంత మొత్తం వస్తుందనే విషయాలను తెలుసుకుందాం.
ప్రతి ఏడాది
-ఉదాహరణకు మీ ఐదేళ్ల చిన్నారి పేరుతో SSY ఖాతా ప్రారంభించి, ప్రతి ఏడాది రూ. 1,50,000 ఇన్వెస్ట్ చేస్తే, 21 సంవత్సరాల తర్వాత ఎంత మొత్తం వస్తుందో చూద్దాం.
-ఇన్వెస్ట్ చేసే కాలం: 15 సంవత్సరాలు (అంటే 5 ఏళ్ల వయస్సు నుంచి 20 ఏళ్ల వయస్సు వరకు).
-మొత్తం పెట్టుబడి: 15 × 1,50,000 = రూ. 22,50,000.
-వడ్డీ రేటు: 8.2% (అందుబాటులో ఉన్న రేటును ఆధారంగా తీసుకుంటే)
Read Also: Gold Vs Silver: బంగారంను మించిపోయిన వెండి..ఈ టైంలో 99 వేలకు .
మెచ్యూరిటీ సమయానికి మొత్తం
15 సంవత్సరాల పాటు డబ్బు ఇన్వెస్ట్ చేసిన తర్వాత, మెచ్యూరిటీ సమయానికి మొత్తం సుమారు రూ. 69,27,578 లభిస్తుంది. ఇది వడ్డీ రేటు 8.2% గా ఉంటే లెక్క. భవిష్యత్తులో రేటు పెరిగితే మొత్తం కూడా పెరుగుతుంది.
సుకన్య సమృద్ధి యోజన ముఖ్య విశేషాలు
-ప్రారంభించగలిగే వయస్సు: బాలిక 10 సంవత్సరాల లోపు ఉండాలి.
-ఇన్వెస్ట్‌మెంట్ వ్యవధి: 15 సంవత్సరాలు (పిల్లల భవిష్యత్తు భద్రతకు దీర్ఘకాల పెట్టుబడి).
-మెచ్యూరిటీ వ్యవధి: 21 సంవత్సరాలు (అంటే ఖాతా ప్రారంభించిన 21 సంవత్సరాల తర్వాత మొత్తం డ్రా చేసుకోవచ్చు).
-వడ్డీ రేటు: ప్రస్తుతం 8.2% (2025 మార్చి ప్రకారం), ఇది ప్రభుత్వంతో మారవచ్చు.
-పన్ను మినహాయింపు: 80C సెక్షన్ కింద ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది.
-కనిష్ట, గరిష్ట పెట్టుబడి: కనిష్ట రూ. 250, గరిష్ట రూ. 1,50,000.
-వడ్డీ గణన: Compounded annually (అంటే ప్రతి సంవత్సరం వడ్డీ పెరుగుతుంది).
SSY ఖాతా ప్రారంభించే విధానం
-బ్యాంక్ లేదా పోస్టాఫీస్ కు వెళ్లి ఫారం తీసుకోవాలి.
-బాలిక పుట్టిన సర్టిఫికేట్, తల్లిదండ్రుల KYC డాక్యుమెంట్లు, అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలి.
-కనీసం రూ. 250 జమ చేసి ఖాతా ప్రారంభించవచ్చు.
మెచ్యూరిటీ & డబ్బును ఉపసంహరించుకునే విధానం
-పూర్తి మొత్తం 21 సంవత్సరాల తర్వాత మొత్తం వడ్డీతో సహా తీసుకోవచ్చు
-ఇది పూర్తిగా టాక్స్-ఫ్రీ ఉంటుంది
-అవసరమైతే ముందుగా కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చా?
-బాలిక 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత, చదువుకు లేదా పెళ్లికి 50% వరకు తీసుకోవచ్చు.
SSY స్కీమ్ ప్రయోజనాలు
-పెద్ద మొత్తంలో పొదుపు: 15 సంవత్సరాలు మాత్రమే డబ్బు జమ చేస్తే, 21 సంవత్సరాల తర్వాత భారీ మొత్తం లభిస్తుంది.
-ఉత్తమ వడ్డీ రేటు: ఇతర పొదుపు స్కీమ్స్ కంటే ఎక్కువ వడ్డీ (8.2%).
-పన్ను మినహాయింపు: పెట్టుబడి, వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం – ఇవన్నీ టాక్స్ ఫ్రీ.
-పిల్లల భవిష్యత్తు భద్రత: ముఖ్యంగా అమ్మాయిల చదువు, వివాహ ఖర్చులకు తల్లిదండ్రులు భరోసా పొందొచ్చు.
-సురక్షితమైన పెట్టుబడి: ప్రభుత్వ మద్దతుతో ఉన్నందున ఇది పూర్తి భద్రత కలిగిన స్కీం.