BigTV English
Advertisement

Jr NTR: నాగచైతన్య రెస్టారెంట్ పై ఎన్టీఆర్ ఓపెన్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Jr NTR: నాగచైతన్య రెస్టారెంట్ పై ఎన్టీఆర్ ఓపెన్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Jr NTR..యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR ) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకోవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్ (Ram Charan) తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈయన.. ఈ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ అయిపోయారు. అంతేకాదు ఈ సినిమాతో ముఖ్యంగా జపాన్ లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకోవడం జరిగింది. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో ‘దేవరా’ సినిమా చేశారు. వాస్తవానికి వీరిద్దరి కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. దీంతో దేవర కూడా సూపర్ హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఈ సినిమా మాత్రం మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.ఆ తర్వాత స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో సైలెంట్ గానే రూ.600 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది ఈ సినిమా


జపాన్లో దేవర ప్రమోషన్స్..

ఇకపోతే ఈ సినిమాను జపాన్ లో విడుదల చేయాలని అక్కడి అభిమానుల నుండి డిమాండ్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు మార్చి 28వ తేదీన జపాన్లో విడుదల చేశారు. ఇక అందులో భాగంగానే డైరెక్టర్ కొరటాల శివతో పాటు ఎన్టీఆర్ కూడా జపాన్ కి వెళ్లి వరుసగా ప్రమోషన్లు చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూకి హాజరవ్వగా.. ఆ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ సినిమా గురించి మాట్లాడుతూనే.. నాగచైతన్య (Naga Chaitanya) రెస్టారెంట్ పై కూడా ఆసక్తికర కామెంట్లు చేశారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


ALSO READ:Nayani Pavani: బీచ్ లో బికినీతో రచ్చ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. దేని కోసం..?

హైదరాబాదులో జపాన్ ఫుడ్ కావాలి అంటే చైతూ రెస్టారెంట్ కి వెళ్లాల్సిందే..

ఎన్టీఆర్ మాట్లాడుతూ..” నేను జపాన్ లో ఉన్నప్పుడు ఫుడ్డుని చాలా ఇష్టంగా తింటాను. కానీ హైదరాబాదు వెళ్లినప్పుడు కూడా జపాన్ ఫుడ్ తినాలని అనిపిస్తుంది. అయితే జపాన్ ఫుడ్ తినాలని అప్పుడప్పుడు అనిపించినా.. అలా అనిపించిన ప్రతిసారి.. కోరికను నెరవేర్చుకోవడానికి జపాన్ కి వెళ్లలేను కదా.. కానీ నా కోరికను నాగచైతన్య రెస్టారెంట్ తీరుస్తోంది. హైదరాబాదులో ఫుడ్ కల్చర్ చాలా భిన్నంగా ఉంటుంది. విభిన్నమైన ఆహారాలు దొరికేది మన హైదరాబాద్ లోనే. అయితే హైదరాబాద్లో జపాన్ ఫుడ్ కావాలి అంటే కచ్చితంగా ‘షోయు’ రెస్టారెంట్ కి వెళ్ళాలి. అది నాగచైతన్య పెట్టాడు. అతని రెస్టారెంట్లో మనకు చాలా రకాల జపాన్ ఫుడ్స్ లభిస్తాయి. అందులో సుషీ అనే జపనీస్ ఫుడ్ అంటే నాకు బాగా ఇష్టం. అది చాలా అమేజింగ్ గా ఉంటుంది. ఇక ఎప్పుడు నాకు జపాన్ ఫుడ్ తినాలనిపించినా సరే నేను కచ్చితంగా ఆ రెస్టారెంట్ కి వెళ్ళిపోతాను” అంటూ ఎన్టీఆర్ నాగచైతన్య రెస్టారెంట్ పై పొగడ్తల వర్షం కురిపించారు.. ఇక ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ అవ్వడంతో నాగచైతన్య షో యు రెస్టారెంట్ కి ఖర్చు లేకుండానే ప్రమోషన్స్ లభించింది అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×