BigTV English

WhatsApp : జనవరి 1 నుంచి ఆ డివైజెస్ లో వాట్సాప్ సేవలు బంద్… ఎప్పటినుంచంటే!

WhatsApp : జనవరి 1 నుంచి ఆ డివైజెస్ లో వాట్సాప్ సేవలు బంద్… ఎప్పటినుంచంటే!

Whatsapp : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదారణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. మెటా తీసుకొచ్చిన ఈ యాప్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ను సంతరించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన వినియోగదారుల భద్రతను మరింత పెంచే దిశగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న ఈ సంస్థ.. కొన్ని డివైజెస్ లో త్వరలోనే వాట్సాప్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.


WhatsApp 2025 నుండి పాత Android పరికరాలకు మద్దతును నిలిపివేయాలని నిర్ణయించుకుంది. జనవరి 1 నుండి Android KitKat లేదా పాత వెర్షన్‌లు నడుస్తున్న Android ఫోన్‌లలో పని చేయదు. కొత్త మార్పులతో పాత Android మోడల్‌లను ఉపయోగిస్తున్న వ్యక్తులు వాట్సాప్ ను ఉపయోగించడానికి ఫోన్‌లను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది

వాట్సాప్ తన Android డివైజస్ కు ఎందుకు మద్దతును నిలిపివేస్తోందంటే.. పాత డివైజస్ లో హార్డ్‌వేర్ యాప్‌కి వచ్చే కొత్త ఫీచర్‌లకు మద్దతు ఇవ్వదు. వాట్సాప్ ఈ ఏడాది ప్రారంభంలో మెటా AIకి మద్దతు ఇచ్చి ఎన్నో ఫీచర్లతో AI అప్డేట్స్ ను తీసుకొచ్చింది.


2025లో WhatsAppకు సపోర్ట్ చేయని టాప్ Android ఫోన్స్ –

Samsung Galaxy S3, Motorola Moto G, HTC One X, Sony Xperia Z తో సహా పలు ఐకానిక్ Android ఫోన్‌లలో WhatsApp ఇకపై పని చేయదు. ఇంకా Samsung Galaxy Note 2, Samsung Galaxy S4 Mini, Motorola Moto G (1st Generation), Motorola Razr HD, Moto E 2014, HTC One X, HTC One X+, HTCDesire 500, HTCDesire 601, LG ఆప్టిమస్ జి, LG Nexus 4, LG G2 మినీ, LG L90, సోనీ ఎక్స్‌పీరియా Z, సోనీ Xperia SP, సోనీ ఎక్స్‌పీరియా టి, సోనీ ఎక్స్‌పీరియా వంటి డివైజస్ లో పనిచేయదు.

ఇంకా వాట్సాప్ iOS 15.1 లేదా పాత వెర్షన్‌లను నడుపుతున్న ఐఫోన్‌లకు మద్దతును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంటే iPhone 5s, iPhone 6, iPhone 6 Plus లలో పనిచేయదు. అయితే, iPhone వినియోగదారులు కొత్త డివైజెస్ కు మారడానికి మే 5, 2025 వరకూ టైమ్ ఉంది.

ఇక మే 5, 2025 తర్వాత WhatsApp iOS వెర్షన్‌కు మద్దతు ఇవ్వడం ఆపివేస్తుందని కొద్ది రోజుల క్రితమే మెటా వినియోగదారులకు నోటిఫికేషన్స్ పంపింది. మెుబైల్ 15.1 కంటే ముందు iOS వెర్షన్‌లలో రన్ అవుతున్నట్లయితే.. కచ్చితంగా iPhoneను అప్డేట్ చేయాలని లేదా కొత్త వెర్షన్ ను తీసుకోవాలని తెలిపింది. ఇలా చేయని డివైజస్ లో సేవలు నిలిచిపోతాయని హెచ్చరించింది.

WhatsApp iOS 12 తో పాటు ఆ తదుపరి మోడల్స్ కు సపోర్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. iOS 15.1 లేదా లేటెస్ట్ అప్డేట్స్ కు సపోర్ట్ చేయనుంది. ఇక మెటా పంపిన అప్‌డేట్ నోటీసు వ్యవధి 5 ​​నెలలు కాబట్టి వినియోగదారులు ఈలోగా తమ ఐఫోన్‌లను అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ మార్పులు రావాటానికి ప్రధాన కారణం లేటెస్ట్ ఫీచర్స్ తో వాట్సాప్ ను మరింత అప్ గ్రేడ్ చేయాలనుకోవటమే.

ALSO READ : క్రిస్మస్, న్యూయర్ కు బెస్ట్ టెక్ గిఫ్ట్స్ ఇవే!

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×